deccanland

నిజ దర్పణం

సమతలదర్పణమే ఐ తీరాలనినిబంధనలేం లేవుజల్లులు జల్లులుగావానకురుస్తూ ఉన్నప్పుడుతుంపర తుంపరలుగాచూరుచుక్కలు జారవిడుస్తూ ఉన్నప్పుడుతరచిన అంతరంగంలాశిలాకెరటాన్ని నునుపుగా చెక్కితేఅద్దంలానే ప్రతిబింబాన్ని పరుస్తుందిసప్తవర్ణాల నయాసౌధాల నేలగోడల్లోదీనవదనాలే కాదు దిక్కులన్నీ కనిపిస్తాయిమేఘాలు ఢీకొని మెరిసినఆకాశ దర్పణం మీదభూతల తడితలంపుచిత్రితమౌతూనే ఉంటుందిభూమ్యాకాశాల నడిమిఆవర్తన రేఖనిండా తిరగాడేపిట్టలగుంపు మనుషుల్లోనేదాగిన రెక్కలనుసంకేతిస్తూ ఉంటాయిఅన్నీ అంచనాలేఅనంతంలో దేన్నైనాఅచ్చంగా దాన్లాగే చూపేపరికరమేదీ ఉన్నట్టు లేదుఅయినా మనల్ని మనంఅద్దంలోనేనా మిత్రుల కనురెప్పలు చిలికేనీలిమలోనూ చూసుకోవచ్చుసహచరి చిట్లించేకనుబొమల వంపుల్లోనూవ్యక్తపరచుకోవచ్చుకన్నవాళ్ళ చిట్టివదనపుభవితలోనూ దర్శించుకోవచ్చుమనం పట్టించుకోంగానీమన చుట్టూ తిరగాడుతున్నదంతామనకో నిజదర్పణమే -ఏనుగు నరసింహారెడ్డిఎ : 8978869183

పీఠికలు భిన్నభావాల పేటికలు

పీఠిక, ఉపోద్ఘాతం, ముందుమాట, తొలిపలుకులు ఇలా ఎన్ని రకాల పేర్లు పెట్టినా అవి గ్రంథాని (text)కి, పాఠకుని (target)కి అనుసంధానాలుగా ఉపకరించేవి. గ్రంథకర్త స్వయంగా రాసుకోవచ్చు. తాను పడిన శ్రమ, తనలక్ష్యం, ఇంకా భవిష్యత్తులో చేయవలసిన కృషి, సహకరించిన వారికి కృతజ్ఞతలు మొదలైన అంశాలు రచయిత తన పీఠికలో నివేదించుకొంటాడు. రచయిత తన గ్రంథానికి మరి కొందరు ఇష్టులు అయిన వ్యక్తుల చేత ముందు మాటలు రాయించుకొంటాడు. వారు సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు కావచ్చు. వారి ముద్ర పడితే …

పీఠికలు భిన్నభావాల పేటికలు Read More »

పాద ముద్రలు

చితి మంటల్లో దహించుకుపోతున్న తండ్రి శరీరం వైపు అభావంగా చూస్తూ నిలుచున్నది సుమతి. సుమతి.. ది వైస్‍ ప్రెసిడెంట్‍ ఆఫ్‍ ‘రీ డు’ కంపనీ.‘రీ డు’ కంపనీ తన మొదటి ప్రయత్నం లోపలే అన్ని వేళలా మనుషులు కృతకృత్యులు కారనీ.. గమ్యాన్ని చేరడానికి మనిషి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉండాలనీ.. అలసిపోవడమో.. పథభ్రష్టత పొందడమో, లక్ష్యం నుండి ప్రక్కకు తొలగి దారి మళ్ళి వెళ్ళిపోవడమో చేయకూడదనీ.. అసలు ఏ మనిషైనా జీవితాంతం ఎప్పుడూ విజయాలనే చవిచూడలేరనీ.. …

పాద ముద్రలు Read More »

బంజార జీవితాలను నవరసభరితంగా చూపించిన ‘గోర్‍జీవన్‍’ చిత్రం

సుమారు వంద సంవత్సరాల తెలుగు సినిమా చిరిత్రలో పూర్తిస్థాయిలో బంజారా భాషలో రూపొందిన తొలిచిత్రం గోర్‍ జీవన్‍ సినిమా. ఒకరకంగా ఇది రికార్డ్ అనికూడా చెప్పొచ్చు. 1921లో రఘుపతి వెంకయ్య ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే మూగ సినిమా (మాటలులేని) వీడుదల చేశాడు. పూర్తిస్థాయి మాటలతో 1931లో భక్త ప్రహ్లాద చిత్రం విడుదలైంది. ఆనాటి నుండి నేటి వరకు వేల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. అయితే అవన్నీ పౌరాణిక, సాంఘిక, చారిత్రక, కాల్పనిక నేపథ్యాలతో అల్లబడిన సినిమాలనే చెప్పాలి. …

బంజార జీవితాలను నవరసభరితంగా చూపించిన ‘గోర్‍జీవన్‍’ చిత్రం Read More »

‘దండకడియం’ అతని కవిత్వం ఒక నిరలంకారపద్యం

తెలంగాణ నేపథ్యంతో, తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించేలా, తెలంగాణ పదబంధాలతో సాహిత్య సృజన చేయడం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత ఎక్కువగా జరుగుతోంది. ఈ సోయి ఎక్కువగా యువకవుల్లో కనిపిస్తోంది. ఇది ఒక మంచి పరిణామం. అలాంటి యువకవుల్లో ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేర్లలో తగుళ్ళ గోపాల్‍ ఒకటి. ఈ మధ్యనే రంగులద్దిన వాక్యాలలోకి అంటూ తన 55 కవితలని ‘దండకడియం’గా ధరించి మన ముందుకొచ్చాడు. గోపాల్‍ కవిత్వాన్ని చదువుతుంటే జీవితచిత్రాల్ని సజీవంగా ప్రతిఫలింపజేసే, సహజ …

‘దండకడియం’ అతని కవిత్వం ఒక నిరలంకారపద్యం Read More »

వివిధ రాష్ట్రాల కమిషన్‍లకు టీఎస్‍పీఎస్సీ ఆదర్శం

ఐదేళ్ల క్రితం ఏర్పడిన కొత్త టీఎస్‍పీఎస్సీ ప్రస్థానం నేడు దేశంలో పలు కమిషన్లు టీఎస్‍పీఎస్సీని అనుసరించే స్థాయికి ఎదిగింది. కమిషన్‍ అనుసరిస్తున్న సాంకేతిక విధానాలను తెలుసుకునేందుకు దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్లు టీఎస్‍పీఎస్సీని సంప్రదించడం, 9 రాష్ట్రాల కమిషన్లు సహాయ, సహకారాలు తీసుకోవడం మన పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ విధానాలను గుజరాత్‍ యథాతథంగా అనుసరించడం మన ఆదర్శ నిర్మాణ దృక్ఫథానికి, నిబద్ధతకీ విలువైన గుర్తింపు. అది మనకు గర్వకారణం కూడా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం …

వివిధ రాష్ట్రాల కమిషన్‍లకు టీఎస్‍పీఎస్సీ ఆదర్శం Read More »

చెర్విరాల భాగయ్య

యక్ష శబ్దం వేదమంత్ర ప్రమాణంగా చూస్తే దైవానికి అనువర్తిత పదంగా చెప్పబడింది. యక్షుజంటి పరమాత్మ అనే అర్థం కూడా నిఘంటువులు తెలియజేశాయి.యక్షగానం అంటే యక్షులు పాడే పాట అని, మరొక అర్థంలో దైవాన్ని స్తుతిస్తూ చేసే గానం అని కూడా చెప్పుకోవచ్చు.ఈ యక్ష గాన పక్రియ 15వ శతాబ్దం ఉత్తరార్థం నుండి కన్పిస్తోంది. ఇది చారిత్రంగా స్పష్టమైన నిజం. దక్షిణాంధ్ర యుగంలో విశ్వవిఖ్యాతమైన ఈ ఆహార్య పక్రియ తెలంగాణ కీర్తి తలమానికంగా స్థిరపడింది. తెలంగాణ యక్షగానం అనగానే …

చెర్విరాల భాగయ్య Read More »

చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు

(గత సంచిక తరువాయి)నాసిర్‍జంగ్‍ హత్యకు గురైన తర్వాత ఫ్రెంచ్‍ కంపెనీ వారు ఏడునెలలుగా నాసిర్‍జంగ్‍ ఖైదులో ఉన్న ముజఫ్ఫర్‍ జంగ్‍ (?-1751)ని విడుదల చేసి రాజుగా ప్రకటిస్తారు. దీంతో ముజఫ్ఫర్‍ జంగ్‍ తనకు అండగా నిలిచిన ఫ్రెంచ్‍ కంపెనీకి జింజి, తిరువత్తి తదితర ప్రదేశాలను జాగీర్లుగా దారాదత్తం చేసిండు. నిజాం తర్వాత అంతటి బలవంతుడు మరొక్కరు లేకుండా ఏడు వైల సైన్యాన్ని కలిగి ఉండేందుకు డూప్లెక్స్కు అనుమతినిచ్చాడు. నజరానాలు కూడా సమర్పించుకున్నడు. అంతేకాదు మచిలీపట్నంను కూడా డూప్లెక్స్కు …

చరిత్రలో వెలుగు చూడని చీకటి కోణాలు Read More »

ఓయూలో రాతి పనిముట్లు, నాణేలు, శిలాజాల ప్రదర్శన

చరిత్ర పూర్వ యుగం నాణాలు, శిలాజాల ప్రదర్శన అమోఘం : ప్రిన్సిపాల్‍ ప్రొ. డి.రవీందర్‍ చరిత్ర పూర్వ యుగం, చారిత్రక యుగానికి సంబంధించిన ముఖ్య పనిముట్లు, నాణాలు, శిలాజాలను ప్రదర్శనలో ఉంచడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగం ఉంటుందని ఆర్టస్ కళాశాల ప్రిన్సిపాల్‍ ప్రొఫెసర్‍ డి.రవీందర్‍ అన్నారు. ఓయూ ఆర్కియాలజీ విభాగం ఆధ్వర్యంలో చారిత్రక పూర్వయుగానికి సంబంధించిన పురాతన రాతి పనిముట్లు, మానవ శిలాజాలు, చారిత్రక యుగంకు సంబంధించిన నాణాలు (కైన్స్) ప్రదర్శన కార్యక్రమాన్ని ఆర్టస్ కళాశాల …

ఓయూలో రాతి పనిముట్లు, నాణేలు, శిలాజాల ప్రదర్శన Read More »

వాసన

ఒక్కమాట చాలువాసన పసికట్టడానికి.అది అవసరమోఆప్యాయతోఆనందమోఅవ్యాజమోచప్పున స్ఫురిస్తుంది. పరిమళం పువ్వులనుంచే రాకపోవచ్చుఆకాశం నుండి రాలే వాన చినుకులుభూమిని ముద్దుపెట్టుకునేటప్పుడులేచే మృత్తికాసౌరభం కావచ్చు,తోటంతా ఉక్కిరిబిక్కిరౌతూసమిష్టి భావనలు నిండిపోవచ్చుకాని ఇవేవీ కావు. అది రింగ్‍టోనోఎస్‍. ఎం. ఎస్సోవాట్సాపోచివరికి ఈ మెయిలైనా కావచ్చునీటిబొట్టు లా రాలే శబ్దానికిఒక స్మరణ మేల్కోంటుంది. ఏమి రాయకుండానేతెల్లకాగితానికి కలలుంటాయిఅక్షరాలకు ధ్వనులే ఒక వాసన ఎవరిదో పొడ గడపలోంచిలోపలికి అడుగుపెట్టగానేతెలిసిపోయే అపరిచిత సమీరస్పర్శఘ్రాణేంద్రియానికి అందేది కాదుప్రాణ సర్వస్వానికి తెలిసేది కాదు.సమస్త వాసనాధురీణ జగుత్తులోకాస్త కాస్త దేనికోసమో అలమటించిపోతున్నానుబహుశా అదిమనిషి …

వాసన Read More »