గురి తప్పొద్దు
రోజు ఉదయించే సూర్యుడే అయినా ఏదో కొత్తదనం. రోజు నడిచే దారి అయిన ఏదో కొత్త ఉత్సాహం. రోజు వెళ్ళే కాలేజే అయిన తెలియని చైతన్యం… ఓయూ క్యాంపస్‌లోనే నేను పనిచేస్తున్న కాలేజీ ఆంధ్రమహిళాసభ. పేరు తగ్గట్టుగానే అందులో అందరూ సమైఖ్యవాదులే. కొంతమంది తెలంగాణవాదులు తప్ప. పదయిందంటే అటెండెన్స్ రిజిస్టర్ ఒక నిముషం కూడా ఆగకుండా ప్రిన్సిపల్రూమ్కు పరుగెత్తుతుంది. సమయానికి వెళ్లకపోతే రెడ్‌మార్క్ పడిపోతుంది.గేటు దాటి లోపలికి గబగబా నడుచుకుంటూ వెళ్ళాను. నాకు లాగే అధ్యాపకులందరూ వచ్చి …