2021

పక్షులకు ముప్పుగా పారిశ్రామిక వ్యర్థాలు

మే 13న అంతర్జాతీయ వలస పక్షుల దినోత్సవం గత చరిత్రను, మన పూర్వీకుల అనుభవాలను నెమరు వేసుకుంటూ ఆనందంగా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము. సమాజానికి ఒక నిర్ధేశిత సందేశం ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూ ఉంటాం. సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాం. ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే. పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు, ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి …

పక్షులకు ముప్పుగా పారిశ్రామిక వ్యర్థాలు Read More »

తెలంగాణా చారిత్రక గాథాలహరిలో

ఇక్కుర్తి – అగ్గలయ్య ఆలేరు నదీలోయ నాగరికతకు ఇక్కుర్తి ఒక పురాతన సాక్ష్యం. ఇక్కుర్తి గొప్ప చారిత్రకస్థలం. అతిపురాతన నాగరికతల నిలయం. ఆదిమానవులకాలం నుండి నేటి వరకు చరిత్రను పుక్కిటపట్టిన కాలనిఘంటువు, విజ్ఞానసర్వస్వం ఈ వూరు. ఇక్కుర్తి పేరు ఇక్కురికి నుండి పరిణమించింది. ఈంకురికి ఇక్కురికి అయింది. కురికి అంటే పురాతన ధాన్య విశేషం. పాల్కురికి పాలకుర్తి అయినట్లు ఇక్కురికే పలుకుబడిలో ఇక్కుర్తిగా పిలువబడుతున్నది.ఇక్కుర్తి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గ్రామం. ఆలేరుకు కొలనుపాక, ఇక్కుర్తి గ్రామాలు …

తెలంగాణా చారిత్రక గాథాలహరిలో Read More »

తీర్పుల్లో నవలలోని అంశాలు

తీర్పుల్లో కవిత్వం కనిపించిన సందర్భాలు చాలా వున్నాయి. కవిత్వమే కాదు కొన్ని సందర్భాల్లో నవలలోని అంశాలు కూడా తీర్పుల్లో కన్పిస్తున్నాయి. చార్లెస్‍ డికెన్స్ పేరు తెలియని వ్యక్తులు చాలా అరుదని చెప్పవచ్చు. ఆయన రాసిన రెండు పుస్తకాల్లోని విషయాలు రెండు ప్రధాన తీర్పుల్లో ప్రతిబింబించాయి. ఆ రెండు తీర్పులు కూడా సుప్రీంకోర్టు తీర్పులు కావడం విశేషం.భోపాల్‍ గ్యాస్‍ దుర్ఘటన సంఘటనకు సంబంధించి స్పెషల్‍ లీవ్‍ దరఖాస్తుని పరిష్కరించే విషయంలో సుప్రీంకోర్టు చార్లెస్‍ డికెన్స్ రాసిన ‘జార్న్డైస్‍ వర్సెస్‍ …

తీర్పుల్లో నవలలోని అంశాలు Read More »

పుడమితల్లికి నిరంతర పురిటి నొప్పులు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 9 ప్రకృతే శాసిస్తుంది!! మానవుడి మేధస్సుకు అందిన పరిజ్ఞానం ప్రకారం జీవం కలిగివున్న గ్రహం ఒక్క భూమి మాత్రమే! గెలాక్సీలోని ఇతర నక్షత్ర కూటములలోని (నక్షత్ర కుటుంబాలల్లో) ఏదైనా గ్రహంపై కూడా జీవరాశి వుండవచ్చు. ఆ జీవరాశి భూమిపై గల జీవరాశికి భిన్నంగా కూడా వుండవచ్చు! వాటి జీవన చర్యలు (metabolic) వైవిధ్య భరితంగా కూడా వుండవచ్చు! మానవుడిలాంటి బుద్ది కుశలతగల జీవులుగాని, ఇంతకన్నా మెరుగైనవిగాని, తక్కువస్థాయివిగాని కూడా వుండవచ్చు! ఈ విషయాలన్నీ భవిష్యత్తులో …

పుడమితల్లికి నిరంతర పురిటి నొప్పులు! Read More »

మే 18 ఇంటర్నేషనల్‍ మ్యూజియం డే

వారసత్వ సంపద ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మ్యూజియమ్స్ను ప్రోత్సహించడానికి, అంతర్జాతీయ సమాజ వృద్ధిలో మ్యూజియంల పాత్ర గురించి అవగాహన కల్పించడానికి మ్యూజియం డే ముఖ్యమైనది. మ్యూజియాలు మౌనముద్ర దాల్చినట్లుగా కనిపిస్తాయి. నిజానికి అవి నిరంతరం మాట్లాడుతూనే ఉంటాయి. అవి ఉబుసుపోని మాటలు కాదు. కళాతత్వాన్ని గురించి విడమరచి చెప్పే మాటలు. చరిత్రను కళ్లకు కట్టినట్లుగా వ్యాఖ్యానించే మాటలు. కొన్ని మాటలు మాటలుగా మాత్రమే ఉండవు. అవి వెలుగుదీపాలై దారి చూపుతాయి. మ్యూజియంలోకి అడుగుపెట్టడం అంటే …

మే 18 ఇంటర్నేషనల్‍ మ్యూజియం డే Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ

(గత సంచిక తరువాయి) నష్టపరిహారం క్లెయిమ్‍ చేయాలంటే…. పశువులు మరణించిన వెంటనే సంబంధిత ఇన్సురెన్సు కంపెనీకి టెలిగ్రామ్‍ ద్వారా తెలియపర్చాలి. సంబంధిత పశువైద్యాధికారి నుండి ‘‘డెత్‍ సర్టిఫికేట్‍’’ తీసుకొని సమర్పించాలి. పశువుల్ని బ్యాంకు రుణం ద్వారా పొందితే సంబంధిత బ్యాంకు వారికి కూడా తెలియపరచాలి. మరణించిన పశువు ఫోటో తీసి ఉంచాలి. పశువు కళేబరాన్ని ఇన్సురెన్సు కంపెనీ అధికారుల పరిశీలన నిమిత్తం 24 గంటలుంచాలి. కంపెనీ నుండి వచ్చే క్లెయిమ్‍ ఫారం పూర్తిచేసి, డాక్టర్‍ ఇచ్చే పోస్టుమార్టం …

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

మన భద్రత మన చేతుల్లోనే…

ప్రకృతిని ఎంతగా వినియోగించుకుంటే నాగరికత అంత అభివృద్ధి చెందుతుందని సామాజిక శాస్త్రవేత్తలు అంటుంటారు. ప్రకృతిని వినియోగించుకునే విధానం నాగరికత అభివృద్ధిని నిర్ణయిస్తుంది. ఆ జీవిత విధానాలనే సంస్కృతి అంటారు. ప్రకృతి అనేక సహజ నిర్మాణాలతో కూడుకొన్నదే అయినా నాగరికత అభివృద్ధి చెందేకొద్దీ దాని నిర్మాణ రూపాలు మారిపోతాయి. వినియోగం అనేదానిలోనే విధ్వంసం దాగి ఉంటుంది. సమతుల్యతను భంగపరుస్తుంది. ప్రకృతిలో సంభవించే ఈ అసమతుల్యతనే పర్యావరణ సంక్షోభం అంటాం. దీన్ని నివారించడమే పర్యావరణ పరిరక్షణ. ఈ పరిరక్షణ అనేది …

మన భద్రత మన చేతుల్లోనే… Read More »

అబిద్‍ హసన్‍ సఫ్రానీ

జై హింద్‍! అనే నినాదం జాతీయమైనది. అది భారతీయులకు ఎంతో పవిత్రమైనది. ఈ పవిత్ర నినాద సృష్టికర్త మేజర్‍ అబిద్‍ హసన్‍ సఫ్రానీ. ఆయన హైదరాబాద్‍కు చెందిన వ్యక్తి. అబిద్‍ హసన్‍ హైదరాబాద్‍ నగరంలోని ఒక ఉన్నతమైన కుటుంబంలో 1912వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తల్లి ఫక్రున్నిసా బేగం. ఆమెకు సరోజిని నాయుడు సాంగత్యంలో దేశభక్తి నరనరాన జీర్ణించుకుపోయింది. విదేశీ వస్త్రాలను తగులబెట్టిన మొదటి హైదరాబాద్‍ మహిళగా ఆమె అందరి మన్ననలను పొందగలిగింది. మహాత్మాగాంధీ, నెహ్రూ, ఆజాద్‍ …

అబిద్‍ హసన్‍ సఫ్రానీ Read More »

ఎర్త్ ఫస్ట్

గేలార్ట్ నెల్సన్‍ 1970ల్లో ధరిత్రి దినోత్సవం ఒకటి కావాలని ప్రతిపాదించాడు. దిస్కాన్సిన్‍ సెనేటర్‍గా నెల్సన్‍కి ఉన్న అసంతృప్తి లోంచి ‘ఎర్త్డే’ అనే భావన పుట్టింది. పర్యావరణం గురించి రాజకీయాలుగానీ మీటాయీ కానీ పెద్దగా పట్టించుకోని కాలాన ఎర్త్డే పట్టుకొచ్చింది. తదాదిగా ప్రతి ఏటా ఏప్రిల్‍ 22ను ఎర్త్డేగా పాటించటం జరుగుతోంది. ఇది ప్రతి ఏటా జరుగుతూ ఉన్నదే. ఎర్త్డేను ఎందుకు పాటించటం. ఎందుకు జరుపుకోవటం అనే ప్రశ్నలు ఎప్పటికీ విలువైనవే. ఈ ఘటన ఒక అంశాన్ని మనం …

ఎర్త్ ఫస్ట్ Read More »

అక్షరభిక్ష ప్రసాదించిన ‘గౌలిగూడ’

గలగలా పారే ముచికుందా నది తీరాన పుష్కలంగా లభించే పచ్చగడ్డి భూములలో గొల్లల ఆవాస నివాసాలు ఏర్పడేసరికి ఆ ప్రాంతం గొల్లగూడెం నుండి గౌలిగూడాగా మారింది. ‘‘ఒకే ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక’’ అన్న కవిత్వం కార్యాచరణకు దిగింది ఈ గౌలిగూడాలోనే. అక్కడి రామమందిరం వీధిలో సుబ్బారావు హోటల్‍ ఉండేది. ఈ హోటల్‍ 1920లలో ప్రారంభమయ్యింది. ఇరవయ్యవ దశకంలోనే నగరంలో హోటళ్లు ప్రారంభం అయినవి. నగరానికి ఎవరైనా కొత్తగా వస్తే అన్నదాన సత్రాలలో ఉచిత …

అక్షరభిక్ష ప్రసాదించిన ‘గౌలిగూడ’ Read More »