అవే ఎదురు చూపులు! నిరీక్షణలో మరో దేవాలయం!!
పీవీనరసింహారావుగారికి చిన్నప్పటి స్నేహితులు, పరిచయస్తుల్లో రాగి భద్రయ్య ఒకరు. ఆయనది, అప్పటి కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ తాలూక, గొడిశాల గ్రామం. గొడిశాలను గుజ్జులపల్లి అని కూడ పిలుస్తారు. రాగిభద్రయ్య తరచూ నేను పనిచేసిన పురావస్తుశాఖకు వస్తూ ఉండేవారు. గొడిశాలలోని శిథిల శివాలయాలను బాగు చేయమని అప్పటి పురావస్తుశాఖ సంచాలకులు, డా.వి.వి. కృష్ణశాస్త్రిగారిని, 1990 ఆగస్టులో కలిసి విజ్ఞప్తి చేశారు. శాస్త్రిగారు నన్ను పిలిచి, ఆ ఆలయాలు మన రక్షిత కట్టడాలు, వాటిని ఎలా బాగు చేయాలో చూచి, …