2022

అవే ఎదురు చూపులు! నిరీక్షణలో మరో దేవాలయం!!

పీవీనరసింహారావుగారికి చిన్నప్పటి స్నేహితులు, పరిచయస్తుల్లో రాగి భద్రయ్య ఒకరు. ఆయనది, అప్పటి కరీంనగర్‍ జిల్లా, హుజూరాబాద్‍ తాలూక, గొడిశాల గ్రామం. గొడిశాలను గుజ్జులపల్లి అని కూడ పిలుస్తారు. రాగిభద్రయ్య తరచూ నేను పనిచేసిన పురావస్తుశాఖకు వస్తూ ఉండేవారు. గొడిశాలలోని శిథిల శివాలయాలను బాగు చేయమని అప్పటి పురావస్తుశాఖ సంచాలకులు, డా.వి.వి. కృష్ణశాస్త్రిగారిని, 1990 ఆగస్టులో కలిసి విజ్ఞప్తి చేశారు. శాస్త్రిగారు నన్ను పిలిచి, ఆ ఆలయాలు మన రక్షిత కట్టడాలు, వాటిని ఎలా బాగు చేయాలో చూచి, …

అవే ఎదురు చూపులు! నిరీక్షణలో మరో దేవాలయం!! Read More »

సామాజిక స్పృహను నేర్పిన సిటీ కళాశాలకు శత వసంతాలు

1912లో ఏడవ నిజాం అసఫ్‍ జాహీ మీర్‍ ఉస్మాన్‍ అలీఖాన్‍ అంకురార్పణ ఒక కళాశాల వందేళ్ల పాటు నిరంతరాయంగా సేవలందించిం దంటే… దాని గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. మూసీ నది ఒడ్డున రాజసం ఒలకబోస్తూ ఠీవీగా, కళాత్మకంగా కనబడే ‘సిటీ కళాశాల’ శత వసంతాలను పూర్తి చేసుకుంది. దాని నీడలో విద్యను అభ్యసించి, దేశ విదేశాల్లో పేరు తెచ్చుకున్న ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు. కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా… అనేక సామాజిక ఉద్యమాలకు, పోరాటాలకు అండగా …

సామాజిక స్పృహను నేర్పిన సిటీ కళాశాలకు శత వసంతాలు Read More »

తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ

పల్లెవాసుల బతుకులో బతుకమ్మ కదలాడుతుంది. వారి ప్రతి పనిలో బతుకమ్మ పాట ఉంటుంది. కొత్త పంటలు చేతికొచ్చే వేళ ప్రతి ఇంట్లో ఒక సంబురం. కొత్త బట్టలు ధరించి బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్క చోటుకు చేరి ఆడుతుంటే కళ్లార్పకుండా చూడాల్సిందే. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపంగా వెలుగొందే బతుకమ్మ పండుగ వేడుకలు మహాలయ అమావాస్యతో ప్రారంభమై ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు కొనసాగుతాయి.‘బతుకమ్మ బతుకు / గుమ్మడి పూలు పూయగా బతుకు / తంగెడి …

తెలంగాణకే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ Read More »

పరిమాణం గోరంత… ప్రయోజనం కొండంత @నానో టెక్నాలజీ..!!

ఇప్పుడంటే ఇంటర్నెట్‍, ఓటీటీల హవా నడుస్తోంది గానీ, రెండు, మూడు దశాబ్దాల కిందట సామాన్య ప్రజానీకం వినోదం కొరకు ప్రధానంగా ఆధారపడే సాధనం టీవీ అని చెప్పవచ్చు. అప్పట్లో టీవీలు పరిమాణంలో చాలా పెద్దవిగా ఉండి, ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేవి, కానీ ప్రస్తుతం మిల్లీమీటర్ల మందంతో గోడకు అతికించుకొనే విధంగా, పరిమాణం, చాలా తక్కువగా ఉండి పలుచని, అతి తక్కువ మందం కలిగిన టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ‘ఇందుగలడందులేడని సందేహం వలదు’ అన్నట్లుగా విస్తరించిన కంప్యూటర్ల …

పరిమాణం గోరంత… ప్రయోజనం కొండంత @నానో టెక్నాలజీ..!! Read More »

వెలుగుకు నోచుకోని అనేక విషయాలను వెలుగులోకి తెస్తున్న ‘దక్కన్‍ ల్యాండ్‍’

‘దక్కన్‍ల్యాండ్‍’ పత్రికను పదేండ్లు సుదీర్ఘ కాలగమనంలో, ఇది సామాన్యంగా కన్పింపచవచ్చునేమో కానీ, సాహిత్య, సామాజిక, కళారంగాలకు చెందిన పత్రికా ప్రపంచంలో ఇది తక్కువేమీ కాదు. పత్రికను ప్రారంభించడం తేలిక! రెండు, మూడు సంచికలు వెలువడ్డాక, పత్రికా నిర్వాహకులు ఎదుర్కొనే పరిస్థితులు అనేకం. నిర్వహణ ఖర్చు ముఖ్యమైనా, దాన్నటుంచి, పాఠకుల్లోకి చొచ్చుకుపోయి, వారి మదిలో సుస్థిరస్థానం పొందడం తేలికైనపని కాదు. దీనికి ఎన్నోఉదాహరణలు మన అనుభవంలో చూశాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, సాహిత్య, సాంస్కృతిక, సామాజిక అంశాలతో …

వెలుగుకు నోచుకోని అనేక విషయాలను వెలుగులోకి తెస్తున్న ‘దక్కన్‍ ల్యాండ్‍’ Read More »

భీమ్‍బేట్కా శిలా గుహలు

ఆదిమ మానవుడు నివసించిన ప్రాంతం… భీముడు తలదాచుకున్న చోటు!!2003లో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపుఅక్టోబర్‍ 6న వరల్డ్ జియో హెరిటేజ్‍ దినోత్సవం సందర్భంగా… భీమ్‍ బెట్కా భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుహలు. ఈ గుహలకు అటు పురాణ ప్రాధాన్యతతో పాటు చారిత్రాత్మక ప్రాధాన్యత కూడా ఉంది. భీమ్‍ బెట్కా గుహలు మధ్యప్రదేశ్‍లోని భోపాల్‍కు కేవలం కేవలం 50 కిలోమీటర్ల దూరంలో అమర్‍ కంటక్‍ నదీ తీరంలో రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో చూడవచ్చును. ఒకప్పుడు ఆదిమానవులకు, …

భీమ్‍బేట్కా శిలా గుహలు Read More »

ఆహారం వృథాను అరికడుదాం.. అక్టోబర్‍ 16న ప్రపంచ ఆహార దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నిరుపేదలు ఆకలి కడుపుతో రోజులు గడుపుతున్నారు. ఆహారం వృధాను అరికట్టి అందరి కడుపులు నింపడం మనందరి సామాజిక బాధ్యత. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం అందరికీ ఆరోగ్యంపై అవగాహన కాస్త అయినా పెరిగింది. పోషకాహారాన్ని తీసుకోవాల్సిన ప్రాధాన్యతను అది నొక్కి చెబుతున్నది. అయితే అందరికీ మూడు పూటలా ఆహారం లభించడం లేదని మన కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో అక్టోబర్‍ 16న మనం జరుపు కుంటున్న ప్రపంచ ఆహారదినోత్సవం (వరల్డ్ …

ఆహారం వృథాను అరికడుదాం.. అక్టోబర్‍ 16న ప్రపంచ ఆహార దినోత్సవం Read More »

తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు!

‘కొత్త తెలంగాణ చరిత్ర’ బృందం ప్రతి నెల నిర్వహిస్తున్న వెబినార్‍లో భాగంగాసెప్టెంబర్‍ మాసంలో ముఖ్య వక్తగా ప్రసంగించిన డా।। ఈమని శివనాగిరెడ్డి-స్థపతి వ్యాసం కొత్త తెలంగాణా చరిత్ర బృందం కన్వీనర్‍ రామోజు హరగోపాల్‍ గారు ఈ నెల నన్ను మాట్లాడమని కోరి, చరిత్ర చదవాల్సిన అవసరం, బోధనా పద్దతుల్లో రావల్సిన మార్పులు, ఉద్యోగావకాశాలు, చరిత్ర చదవటం వల్ల వ్యక్తిగతంగా ఒనగూడే ప్రయోజనాలు అన్న అంశాలను స్పృశించమన్నారు. ఆయా సందర్భాల్లో గమనించిన కొత్త విషయాలను పాతరాతియుగం నుంచి క్రీ.శ.1000వ …

తెలంగాణా చరిత్రలో మైలురాళ్లు! Read More »

కాకతీయుల శాసనాలు సమగ్ర పరిశీలనం

(గత సంచిక తరువాయి) సాంఘిక స్థితిగతులుకాకతీయుల కాలంలో సాంఘిక వ్యవస్థ ప్రాచీన భారతీయ రాజనీతి విధానాన్నే అనుసరించినారు. రాజ్యవిస్తరణలో భాగంగా వివాహాది సంబంధాలకు కుల ప్రాతిపదికను రాజులు స్వీకరించలేదనే చెప్పవచ్చు. సంఘంలో అన్ని కులాలవారు వారి వారి కులసంబంధ వృత్తులను చేసుకునేవారని శాసనాల ద్వారా తెలుస్తుంది. రాజ్య వ్యవస్థలో బాహత్తర నియోగాధిపతులు ఉండేవారు అందులో అన్ని కులాల వారికి భాగస్వామ్యం ఉండేది. కరణం, పెద్ద కాపు, తలారి, పురోహితుడు, కమ్మరి, కంసాలి, వండ్రంగి, కుమ్మరి, చాకలి, మంగలి, …

కాకతీయుల శాసనాలు సమగ్ర పరిశీలనం Read More »

తెలంగాణ మలి ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక!

అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక.. అని ప్రజాకవి, పద్మవిభూషణ్‍ కాళోజీ నారాయణరావు గారు అర్ధ శతాబ్దం కిందటే అన్నారు. 1969 తెలంగాణ ఉద్యమానికి నెగడై నిలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తొలి తరానికి చెందిన పెద్దలు కాళోజీ, ఆచార్య కొత్తపల్లి జయశంకర్‍, డా. మర్రి చెన్నారెడ్డి తదితరులు పునాదులై నిలిచారు. ప్రస్తుత విషయానికి వస్తే తెలంగాణా మలి ఉద్యమం ద్వారా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైనాక, కొన సాగుతున్న ఎనిమిదేళ్ళ …

తెలంగాణ మలి ఉద్యమానికి దిక్సూచిలా నిలిచిన దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక! Read More »