వ్యక్తి, మానవ సమాజం… నడుమ కరోనా
2019 సంవత్సరం చివరి రోజు, డిసెంబర్ 31న మానవాళి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం అనుకుంటూ ఉండగా, 2020 లీపు సంవత్సర ఉదయం పట్టుకుని వచ్చిందొక అనూహ్య పరిణామం.మొత్తం మానవ జాతికి ఆరోగ్య అత్యవసర పరిస్థితి. కంటికి కనబడదు. ఈగ, దోమ ఎత్తుకు రావు. పెంపుడు జంతువుల వలనో, దురలవాటో కారణం కాదు. ప్రకృతి వైపరీత్యం అంతకన్నా కాదాయె! నెలలు, వారాలు, రోజులు కాదు… గంటల్లో – పట్టణాలను, ఆ తరువాత మహా సముద్రాలను దాటి ఖండాలను, …