దేశంలో విలువైన విద్యా విధానం రావాలి : చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్
క్లాస్‍రూమ్‍కే విద్య పరిమితం కాకూడదు..దేశాభివృద్ధికి నాణ్యమైన విద్య ఎంతో అవసరమని, మంచి విద్యా విధానంతోనే సమాజంలో గుణాత్మకమైన మార్పు వస్తుందని చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్, బాలచెలిమి సంపాదకులు మణికొండ వేదకుమార్ పేర్కొన్నారు. బాలచెలిమి పిల్లల వికాస పత్రిక ఆధ్వర్యంలో బాలచెలిమి ప్రచురించిన హైదరాబాద్ బడి పిల్లల కథలు ఆవిష్కరణ సభ సీతాఫల్‍మండిలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో జరిగింది. సీహెచ్.మల్లేశం అధ్యక్షత వహించిన ఈ సభలో ముఖ్య అతిథిగా చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ మణికొండ వేదకుమార్, విశిష్ట …