బహుజనుల ‘మట్టిపొయ్యి’
ఆధునిక కథా రచనకు రాయలసీమ ప్రాంతం ఒక ముడి వనరులాంటిది. ఇక్కడ ఏ రాయిని పలకరించినా, ఏ మట్టిరేణువును తాకినా, ఏ మట్టిమనిషిని కదిలించినా ఒక దు:ఖపూరిత కథనే చాలా ఆర్ద్రంగా వినిపిస్తాయి. ‘గతమంతా తడిసె రక్తమున/ కాకుంటే కన్నీళులతో’ అని శ్రీశ్రీ అన్నట్లుగా వికటించిన మానవ సంబంధాలతోనో, కరువుతోనో, ఫ్యాక్షన్ కక్షలతోనో వణికిపోని ఊరు రాయలసీమలో లేదంటే అతిశయోక్తికాదు. ‘కడపటి పైసా’ కథ రచయిత దగ్గరి నుండి ఇవ్వాళ్లి డా. ఎం. హరికిషన్ దాకా ప్రతి …