సుంకిరెడ్డి నారాయణరెడ్డి కవిత్వం, శిల్పం
‘మా గ్లూకోజ్ బాటిల్ బద్దలాయె’ అనే కవితా పాదం ద్వారా లక్ష్యార్థం అవగతమైతది. తద్వారా కవి, ఆయన కాలం, ఆ కవి మీద పనిచేసిన ప్రభావాలు తెలుస్తె, అలా కవి ఆ వస్తువును ఎంపిక చేసుకోవడానికి కారణాలతో పాటు, ఆ వస్తువు తీసుకున్న రూపం అర్థమవుతుంది. ఈ రూపం రావడానికి కారణమైన శిల్పం తెలుస్తుంది. శిల్పంలో భాగమైన భాష, ఆ భాషకే లేదా జాతికే పరిమితమైన జాతీయాలు, పదబంధాలు, సాంస్కృతిక ప్రతిఫలనాలు తెలిసొస్తాయి. కవి జాగరూకతతో వేసిన …