అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-14
కళ్యాణచాళుక్య యువరాజు మూడోతైలపుని జడ్చర్ల జినశాసనం (క్రీ.శ.1127) జడ్చర్ల. అదొక కూడలి. హైదరాబాదు, రాయచూరు, కర్నూలు, శ్రీశైలం, కొల్లాపూర్ ఇలా ఎన్నో ఊళ్లకు వెళ్లే మార్గాల కూడలి. అంతేకాదు. అటు శైవ, వైష్ణవ, జైన మతాల కూడలి కూడ ప్రక్కనే ఉన్న గంగాపురంలో మతాల మధ్య సామరస్యాన్ని నింపిన పంచాయతన దేవాలయం, జైనతీర్థంకరునికి ఆచ్ఛాదన కల్పించిన ఇటుకరాతి జైన దేవాలయం, తొలిమధ్య, చాళుక్య, రాష్ట్ర కూటకాలపు శైవ-వైష్ణవ -శాక్త స్థావరం మీనాంబరం, కందూరిచోళుల తొలి, మలి రాజధానులైన …