రావెళ్ళ వెంకట్రామారావు
తెలంగాణ ఉద్యమ వనంలో తొలి గేయమైన ‘‘కదనాన శత్రువుల కుత్తుకల నవలీల – నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి – ధీరులకు మొగసాలరా! – తెలంగాణ వీరులకు కాణాచిరా’’ అనే పాటతో యాభైఏళ్ళ కిందనే తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను రగిలించిన కవి, పెన్నుగన్ను సమానంగా ఉపయోగించి నిజాం నింరకుశత్వానికి ఎదురు నిలిచిన కవి రావెళ్ల వెంకట రామారావుగారు.వారి తండ్రి లక్ష్మయ్య తల్లి సుబ్బమ్మ. 1930 జనవరి 30న ఖమ్మం జిల్లా ముదిగొండ దగ్గర గోకినపల్లిలో పుట్టారు. ఒక అన్న …








