deccanland

పురాతన గ్రంథాలయాలు

ఏప్రిల్‍ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‍ కలాం తరచూ చెప్పేవారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఏప్రిల్‍ 23 ప్రపంచపుస్తక దినోత్సవం.. పుస్తకం గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.. అందుకే వాటికి నిలయమైన కొన్ని విలక్షణమైన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం.. ఇవి ప్రపంచంలోనే ప్రత్యేక లైబ్రరీలు. దీని వయసు 1,162 ఏళ్లుప్రపంచంలో ఇప్పటికీ నిలిచిఉన్న పురాతన లైబ్రరీ మొరాకో లోని ‘ది అల్‍ …

పురాతన గ్రంథాలయాలు Read More »

కథ కంచికి..

చెప్పేవారే కరువు.. అంతా స్మార్ట్ఫోన్‍ బాధితులే.. వ్యక్తిత్వ వికాసానికి కథలే మార్గం ఉన్నత విలువల సాధనకు దిక్సూచి పిల్లలకు రోజూ ఒక కథ చెప్పగలగాలి తల్లిదండ్రుల్లో కానరాని ధోరణి.. యాంత్రిక జీవితమే కారణం అనగనగనగా అనగానే.. తెలియని ఆసక్తి, మధురానుభూతి, ఏదో వినబోతున్నామన్న ఉత్కంఠ.. ఇన్ని ఆలోచనలు ఒకేసారి మొదలవుతాయి. అంతటి శక్తి కథలకు మాత్రమే ఉంది. గతంలో అమ్మమ్మ, తాతయ్య చెప్పే కథలు వింటూ చిన్నారులు అలా ఊహా లోకంలో తేలిపోయేవారు. సంప్రదాయాలను, సంస్కృతులను, చరిత్రను, …

కథ కంచికి.. Read More »

ఆహారభద్రతకు భరోసా చిరుధాన్యాలే

ప్రపంచంలోనే చిరుధాన్యాల ఉత్పత్తిలో అగ్రగామి భారతదేశం. వీటి వైవిధ్యంలోనూ మనదే అగ్రస్థానం. కాబట్టి, 2022-23 కేంద్ర బడ్జెట్‍లో చిరుధాన్యాలకు అదనపు విలువను జోడిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడం, దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా వీటికి బ్రాండ్‍ విలువను తీసుకురానున్నట్లు కేంద్ర బడ్జెట్‍లో ప్రకటించడం సరైన దిశగా తీసుకున్న చర్య అనే చెప్పాలి. చిరుధాన్యాల పైపొట్టు తీయడంలో ఉన్న క్లిష్టత కారణంగా వాటి వినియోగం దేశంలో తగ్గిపోతోంది. కాబట్టి పోషక విలువలు కోల్పోకుండా చిరుధాన్యాల పొట్టు …

ఆహారభద్రతకు భరోసా చిరుధాన్యాలే Read More »

వేసవిలో కూరగాయలకు డిమాండ్‍

తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం వేసవి వచ్చింది. ఈ కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ కూరగాయ పండించినా మంచి డిమాండ్‍ ఉంటుంది. అధిక లాభాలు రావాలంటే.. యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. రాష్ట్రంలో కూరగాయల సాగుకు సమయం ఆసన్నమైనది. వరి వేద్దామనుకొన్నా.. బియ్యం కొనబోమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో కూరగాయల సాగు రైతులకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని ఉద్యానశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవసరాలకు సరిపడా కూరగాయలు సాగు …

వేసవిలో కూరగాయలకు డిమాండ్‍ Read More »

అనగనగా…

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘రంగారెడ్డి బడిపిల్లల కథలు’ గురించి కవి జుగాష్‍ విలి గారి విశ్లేషణ. కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ వారి ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా …

అనగనగా… Read More »

హైదరాబాద్‍ మహానగరంలో ఇక సాఫీ సడక్‍లు

పలు ప్లై ఓవర్లు, అండర్‍ పాస్‍లు, జంక్షన్‍లు కొత్తగా రైలు వంతెనల నిర్మాణానికి చర్యలు గ్రేటర్‍లో 3 ఆర్‍యూబీలు.. 6 ఆర్‍ఓబీలు సిగ్నల్‍ ఫ్రీ సిటీగా మారనున్న గ్రేటర్‍ హైదరాబాద్‍ మునిసిపల్‍ శాఖ మంత్రి కేటీఆర్‍ మహానగరంలో ట్రాఫిక్‍ చిక్కులు లేని ప్రయాణాల కోసం ఇప్పటికే వ్యూహాత్మక రహదారుల పథకం (ఎస్సార్‍డీపీ) ద్వారా పలు ఫ్లై ఓవర్లు, అండర్‍పాస్‍లు, జంక్షన్ల అభివృద్ధి వంటి పనులు చేస్తున్న జీహెచ్‍ఎంసీ ఆయా ప్రాంతాల్లో రైలు ఓవర్‍ బ్రిడ్జీలు (ఆర్‍ఓబీలు), రైలు …

హైదరాబాద్‍ మహానగరంలో ఇక సాఫీ సడక్‍లు Read More »

అద్భుతమైన ప్రకృతి సౌందర్యం సుందర్‍బన్స్ జాతీయ ఉద్యానవనం 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు•

సుందర్‍బన్స్ జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్‍ రాష్ట్రంలోని సౌత్‍ 24 పరగనాస్‍ అనే ప్రాంతంలో దాదాపు 1,355 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ఉద్యావనానికి సుందర్‍బన్‍ అనే పేరు సుందర్బన్‍ అనే మడ చెట్టు నుండి వచ్చింది. ఈ ఉద్యానవనాన్ని 1984లో జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. ఈ ఉద్యానవనం 1973లో సుందర్బన్‍ పులుల సంరక్షణ కేంద్రంగా, 1977లో వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతంగా, మే 4, 1984న దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ …

అద్భుతమైన ప్రకృతి సౌందర్యం సుందర్‍బన్స్ జాతీయ ఉద్యానవనం 1987లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు• Read More »

చారిత్రాత్మక కళారూపం బాతిక్‍ పెయింటింగ్‍

బాతిక్‍ పెయింటింగ్‍ అత్యంత అందమైన, చారిత్రాత్మక కళారూపం. బాతిక్‍ పెయింటింగ్‍లు బట్టల ముక్కలపై గీసిన వివిధ బొమ్మలు, నమూనాలతో కూడిన కళ యొక్క అద్భుతమైన రూపాన్ని సూచిస్తాయి. ఈ పెయింటింగ్‍ల కళానైపుణ్యం ఇండోనేషియాలో పుట్టింది. బాతిక్‍ పెయింటింగ్‍ అంటే ‘బట్టలపై చుక్కలు’ అని అర్థం. బాతిక్‍ వస్త్రాలలో ఉపయోగించే మైనపు-నిరోధక రంగు సాంకేతికతను సూచిస్తుంది. ఈ కళ దాదాపు రెండు వేల సంవత్సరాల నాటిది. జావా (ఇండోనేషియా), భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో బాతిక్‍ ఆర్ట్ వర్క్ …

చారిత్రాత్మక కళారూపం బాతిక్‍ పెయింటింగ్‍ Read More »

దక్కన్‍ ల్యాండ్‍ చర్చ మానవత్వం, మతసహనం, మర్యాద… వన్నె తెచ్చిన దక్కన్‍ సంస్కృతి

ఎంత చెప్పినా తరిగిపోని అంశాలు చరిత్రలో కొన్ని ఉంటాయి. ఆ జ్ఞాపకాల ఊటలు అలా ఊరుతూనే ఉంటాయి. దక్కన్‍ సంస్కృతి కూడా తెలంగాణలో ప్రధానంగా భాగ్యనగరంతో, దాని ఐదు శతాబ్దాల చరిత్రతో ముడిపడినప్పటికీ, అంతకు ముందు కొన్ని వేల ఏళ్ళ చరిత్ర కూడా దానిలో అంతర్భాగంగానే ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఇందులో కలగలసిపోయి దానికొక విశిష్టతను సంతరింపజేశాయి. ఒకటి కాదు, రెండు కాదు.. పదుల సంఖ్యలో నగరాల, దేశాల భిన్న సంస్కృతులు తెలంగాణలో …

దక్కన్‍ ల్యాండ్‍ చర్చ మానవత్వం, మతసహనం, మర్యాద… వన్నె తెచ్చిన దక్కన్‍ సంస్కృతి Read More »

ఎడారుల చిరుగాలి వాణి సూఫీ సంగీతపు రారాణి రేష్మాకు నివాళి

గాలి దూమారాల మధ్య హోయలు పోయే ఇసుక తిన్నెల మధ్య స్వరధారలా సాగిపోయిన ఆ గొంతు అప్పుడే ఆగిపోయింది. అక్షరమంటే తెలియని ఆమె తన స్వరలయలతో తరతరాల భారత ఉపఖండపు సూఫీయోగుల మార్మికతా మర్మాలు అలవోకగా తను గాత్రపు చాలులో మొలకలెత్తి అనామకుల ఆత్మలను తట్టిలేపేవి. పాటలు కట్టేది ఆమే.. పాడేది ఆమే. ఆధునికార్ధంలో చెప్పుకుంటే ఆమె గొప్ప సూఫీ గీత రచయిత, సుస్వరాల సంగీతపు రారాణి. ఆమెది ప్రాచీన సుఫియానా (భారతదేశ సుఫీ మత యోగుల …

ఎడారుల చిరుగాలి వాణి సూఫీ సంగీతపు రారాణి రేష్మాకు నివాళి Read More »