మనం మరచిన సంస్థాన మహిళలు
హైదరాబాద్ రాజ్యమే ఎనుకటి ఇండియాలో పెద్ద సంస్థానం. దానికి అనుబంధంగా ప్రతి జిల్లాలో చిన్న, పెద్ద సంస్థానాలు పరిపాలన సాగించేవి. ఈ సంస్థానాధీశులతో చాలా మందికి దగ్గరి సంబంధాలుండేవి. దోమకొండ సంస్థానానికి అమరచింత సంస్థానాధీశులతో, గద్వాల సంస్థాన పాలకులకు మెదక్ జిల్లాలోని పాపన్నపేట సంస్థానానికి, జటప్రోలు (కొల్లాపురం) సంస్థానాధీశులకి వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి పాలకులతో, వనపర్తి సంస్థానం వారికి మునగాల పాలకులతో సంబంధ బాంధవ్యాలుండేవి. ఇవన్నీ ఆ పరిపాలన సజావుగా జరగడానికి, వారి రాజరికాన్ని, అధికారాన్ని నిలుపుకోడానికి …








