‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో 150 మందిని కాపాడిన చింతచెట్టు కింద స్మారక సమావేశం
సెప్టెంబర్ 28 (మంగళవారం)న అఫ్జల్‍గంజ్‍లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఆవరణలోని చింత చెట్టుకింద ‘ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్’ ఆధ్వర్యంలో ‘సెంటర్ ఫర్ దక్కన్ స్టడీస్’, ‘దక్కన్ హెరిటేజ్ ట్రస్ట్’, ‘దక్కన్ హెరిటేజ్ అకాడమీ’ భాగస్వామ్యంతో – మణికొండ వేదకుమార్ అధ్యక్షతన స్మారక సమావేశం జరిగింది. 1908 సం।।లో వచ్చిన మూసీ వరదల్లో ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. వేల మంది ఆ మూసీ వరదల్లో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. అయితే కొందరు ఈ చింతచెట్టుపైకి …









