నిర్మల్‍ బొమ్మలు

నిర్మల్‍!
ఈ పేరు చెబితేనే చాలు…సహజత్వం ఉట్టిపడేలా ఉండే కొయ్య బొమ్మలు, విలక్షణ శైలికి పేరొందిన పెయింటింగ్స్ గుర్తుకు వస్తాయి. ఆదిలాబాద్‍ జిల్లా నిర్మల్‍ కొయ్య బొమ్మలు దేశీయంగానే గాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు పొందాయి. స్థానికంగా అడవిలో లభించే పొనికి కర్రను ఉపయోగించి వనమూలికలు, సహజరంగులతో ఈ బొమ్మలను రూపొందిస్తారు.


ఇదీ నేపథ్యం
నిర్మల్‍ సంస్థానాన్ని పాలించిన నిమ్మనాయుడు పద్మనాయక వంశానికి చెందిన వాడు. అప్పట్లో ఆయన దేశం నలుమూలల నుంచి కళాకారులను నిర్మల్‍కు రప్పించి హస్తకళలను అభివృద్ధి చేశారు. మరీ ముఖ్యంగా మరట్వాడ ప్రాంతంలో నివసించే నకాశి కళాకారు లను రప్పించి వారికి ఉపాధి కల్పించాడు. వారి కోసం కసుబా ప్రాంతంలో ఇళ్ళు కూడా నిర్మింపజేశాడు. వీరు తయారు చేసిన బొమ్మలు పొరుగు రాజ్యాధిపతులను సైతం ఆకట్టుకోవడం వీరి సృ జనాత్మక కళావైశిష్ట్యానికి నిదర్శనం. నిమ్మనాయుడి ఆదరణతో నకాశి కుటుంబీకులకు గౌరవప్రదమైన జీవనోపాధి లభించింది. ఆయన హయాంలో నిర్మల్‍ పేరు ఖండాంతరాలు దాటింది. ఆయన అనం తరం పాలించిన శ్రీనివాసరావు, జలపతిరావు, వెంగళరావు, కుంటి వెంకపూటాయుడు తదితరులు ఈ కుటుంబాలను ఆదుకొని నిర్మల్‍ కళలు అంతరించిపోకుండా అండగా నిలిచారు. నిర్మల్‍లో కొయ్య బొమ్మల పరిశ్రమ 17వ శతాబ్దిలో ప్రారంభమైనట్లు భావిస్తారు. నకాషీ కులానికి చెందిన కళాకారులు ఎక్కువగా ఈ బొమ్మలను తయారు చేస్తారు. ఈ బొమ్మల తయారీ శాతవాహన కాలం నుంచి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అజంతా లోని వర్ణచిత్రాలను పోలిన బొమ్మలను వేయడం ఇందుకు నిదర్శనంగా భావిస్తారు.


ముచ్చటపడ్డ నిజాం నవాబు
నిజాం నవాబు ఒకసారి నిర్మల్‍ పట్టణాన్ని సందర్శించేందుకు వచ్చిన సమయంలో ఆయనకు సకల లాంఛనాలతో స్వాగతం పలికి కోటలోకి ఆహ్వానించారు. నవాబు సింహాసనంపై కూర్చోగానే పైనుంచి పూలవర్షం కురిసింది. అవి మామూలు పూలు కావు. అచ్చంగా బం గారు పువ్వులను తలపించేలా నిర్మల్‍ కళాకారులు రూపొందించిన చెక్క పుష్పాలు. వాటిని చూసి నిజాం నవాబు కూడా ముచ్చటపడ్డాడని అంటారు. నిజాం రాజులతో పాటుగా మహారాష్ట్ర బోంస్లే రాజులు, గోండు రాజులు, బహమనీ సుల్తానులు, వెలమరాజులు ఎందరో వీటిపట్ల ఆకర్షితులయ్యారు.


తయారీ విధానం
ఈ బొమ్మలను తయారు చేసేందుకు పొనికి కర్రను తీసుకువచ్చి కావాల్సిన రీతిలో ముక్కలుగా చేసి బొమ్మ ఆకారానికి మలుస్తారు. చింతగింజల పిండితో తయారు చేసిన జిగురుతో చిన్న చిన్న చెక్క ముక్కలను కావాల్సిన రీతిలో చెక్కి ఆ బొమ్మలకు అతికించి దానికొక రూపం తీసుకువస్తారు. ఆ తరువాత బొమ్మను ఎండలో ఆరబెట్టి రంగులు వేస్తారు. అడవుల్లో దొరికే ఆకుపసర్లు, సహజవర్ణాలు ఉపయోగించి బంగారు రంగును తయారు చేస్తారు. ఈ రంగు చే సేందుకు బాగా శ్రమించాల్సిందే.
ఎన్నెన్నో బొమ్మలు
ఈ కళాకారులు తయారు చేసే బొమ్మల్లో పక్షులు, జంతువులు, కూరగాయలు, పండ్లు, లవంగాలు, యాలకులు, అగ్గిపెట్టె, సిగరెట్‍ పెట్టె లాంటివెన్నో ఉంటాయి.


నిర్మల్‍ పెయింటింగ్స్
బొమ్మల తరహాలోనే నిర్మల్‍ పెయింటింగ్స్ కూడా ఎంతో జ నాదరణ పొందాయి. ముని కోపం వల్ల శిలారూపం దాల్చిన గంధర్వ కన్య, యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసే గీతాబోధన, ప్రకృతి రమణీయత, దేవతల చిత్రాలు..ఇలా ఎన్నో పెయింటింగ్స్ లభ్యమ వుతాయి. ఈ చిత్రాల్లో బంగారు వర్ణం ఎక్కువగా కన్పిస్తుంటుంది. ఈ చిత్రాలు సహజత్వం ఉట్టిపడేలా చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. చెట్ల రసాలు, పువ్వుల నుంచి రంగులను ఈ చిత్రకళలో ఉపయోగిస్తారు. కొత్త అందాల్లో సజీవరీతుల్లో కన్పించే ఈ చిత్రాలకు దేశవిదేశాల్లో మంచి డిమాండ్‍ కూడా ఉంది. చిత్రకళలో ఇక్కడి కళాకారులు బ్రహ్మరౌతు పద్మారావు శైలిని కొనసాగిస్తున్నారు. ఈ చిత్రాలను డ్యూకో రంగులను ఉపయోగించి చెక్కతో చేసిన చట్రాలపై వేస్తారు. ఈ చట్రాల పరిమాణాలు 1.6 అడుగులు × 1 అడుగుగా ఉంటాయి. ఈ చిత్రాలను బహుమతులుగా ఇచ్చేందుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వివిధ రకాల శైలులతో 150కిపైగా థీమ్‍లతో ఈ చిత్రాలు లభ్యమవుతున్నాయి.
1948లో పద్మారావు తండ్రి రాజేష్‍, బూసాని రాములు కలసి నిర్మల్‍ ఇండస్ట్రీస్‍ను హైదరాబాద్‍లోని ఖైరతాబాద్‍ ప్రాంతంలో నెలకొల్పారు. ఈ సంస్థ ద్వారా బొమ్మలు ఉత్పత్తి చేయడమే గాకుండా ఇతరులు చేసిన బొమ్మలు, పెయింటింగ్స్ కూడా విక్రయిస్తుంటారు.


ఎన్నో కష్టాలు

ఈ బొమ్మలను తయారు చేసేందుకు ఉపయోగించే పొనికి కర్ర, ఇతర ముడిపదార్థాలు లభించడం కష్టంగా మారుతోంది. ఈ కారణంగా కళాకారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం లో ప్రభుత్వం తమకు సహకరించాలని వారు కోరుతున్నారు.


చరిత్రలో..
ప్రముఖ యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్ర చరిత్ర గ్రంథంలో ఈ ప్రాంతాన్ని ప్రస్తావించారు. అప్ప ట్లోనే ఇది ఒక పట్టణంగా ఉండేది. నిర్మల్‍ బొమ్మలు, పంచపాత్రల గురించి పేర్కొన్నారు. అతి పరిచయం వల్ల కలిగే ఉదాసీనతతో ఈ బొమ్మల విశిష్టత ఇక్కడి వారికి తెలియడం లేదని, ఇక్కడ ఏ ఇంట్లో చూసినా నిర్మల్‍ పంచపాత్రలు వాడుకలో కనిపించడం లేదని ఆయన రాశారు. 1955లో నిర్మల్‍ కొయ్యబొమ్మల సహకార సంస్థ ఏర్పడింది. ఈ కళాకారులకు రాష్ట్రపతి అవార్డు కూడా లభించింది.


దేశవిదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన నిర్మల్‍ కొయ్యబొమ్మల పట్ల ఉమ్మడి రాష్ట్రంలో నాటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్న నిర్మల్‍ బొమ్మలు నేడు కానరాకుండా పో యాయి. సమైక్య పాలకులు కొండపల్లి బొమ్మలకు ప్రాచుర్యం కల్పించి నిర్మల్‍ కొయ్య బొమ్మలను పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆరు దశాబ్దాల పాటు సరైన మార్కెటింగ్‍ సౌకర్యం లేక ఆదరణ తగ్గి పోవడంతో నిర్మల్‍ కొయ్య బొమ్మల తయారీ కళాకారులు ఆర్థికంగా చితికిపోయారు. కళను నమ్ముకొని బతికే నకాషీ కుటుంబాలు కొయ్య బొమ్మల తయారీని పక్కనబెట్టి బతుకుదెరువు కోసం ఇతర పనులు చేపట్టాల్సిన దుస్థితి ఎదురైంది. ఇప్పుడిప్పుడే వీటికి ఆదరణ క్రమంగా పెరుగుతోంది. ఆన్‍లైన్‍లోనూ ఇవి లభ్యమవుతున్నాయి.
నిర్మల్‍ పెయింటింగ్స్ మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో లభ్యమవుతాయి. ఒక్కో దాని వెల రూ.200 నుంచి రూ.1000 దా కా ఉంటుది. రూ. లక్షలు పలికే పెయింటింగ్స్ కూడా ఉంటాయి. విదేశాలకు సైతం ఇవి ఎగుమతి అవుతున్నాయి. హైదరాబాద్‍ నుంచి ఉత్తరంగా 210 కి.మీ. దూరంలో జాతీయ రహదారిపై నిర్మల్‍ ఉంది.


– దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *