దక్కన్‍కు వన్నె తెచ్చిన బీద్రీ

భారతీయ మెటల్‍ క్యాస్టింగ్‍ యొక్క అత్యుత్తమ సంప్రదాయాల్లో ఒకటి బీద్రి. హైదరాబాద్‍కు సుమారుగా 145 కి.మీ దూరంలో, బహమని, బీదరీ సామ్రాజ్యాల రాజధానిగా ఉన్న బీదర్‍ నగరంలో మొదటగా ఈ కళ రూపుదిద్దుకుంది. ఈ కళ మూలాలు ఎక్కడో ఇంకా తేలనప్పటికీ, ఇస్లామిక్‍ ప్రపంచంలో ఇది పరిపూర్ణతను సం తరించుకుంది. అక్కడి నుంచి అది దక్షిణ భారతదేశానికి చేరుకుంది. దక్కన్‍ పాలకులు ఈ కళను పెంచి పోషించారు. ఈ మెటల్‍ వర్క్ శైలి, డెకొరేటివ్‍ ఎలిమెంట్స్ రెండూ కూడా హిందూ, ముస్లిం హస్త కళాకారుల స్థానిక సంప్రదాయాలు, హస్తకళానైపుణ్యాలచే ప్రభావిత మయ్యాయి. ముస్లింలు ఈ కళను బాగా ఆదరించి పెంచి పోషించారు.


అత్యున్నత స్థాయి హస్తకళానైపుణ్యం బీద్రీ కళలో కనిపిస్తుంది. 17వ శతాబ్ది కన్నా పూర్వం నుంచే దీని ఆనవాళ్ళు ఉన్నాయి. బీద్రీ కళ గురించిన ప్రస్తావన 17వ శతాబ్ది కాలపు రచనలలో కనిపిస్తుంది. పర్షియన్‍ హిస్టరీ ఆఫ్‍ ఇండియా చహర్‍ గుల్‍షాన్‍లో దీని ప్రస్తావన ఉంది. ఇది 1759 కాలానికి చెందింది. దక్కన్‍ మినియేచర్‍లలో కూడా బీద్రీ కళ ముద్ర కనిపిస్తుంటుంది. 17వ శతాబ్ది, తదనంతర కాలంలో ఇది ఉచ్ఛస్థితికి చేరుకొని దక్కన్‍ నుంచి ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించింది. ఉత్తర భారతదేశంలోని లక్నో, పుణెలకు చేరింది. 19వ శతాబ్దిలో ముర్షిదాబాద్‍కూ విస్తరించింది. బ్రిటిష్‍ హయాంలో జరిగిన ప్రదర్శనల్లో ఆయా కళాఖండాలు యురోపియన్ల దృష్టిని కూడా ఆకట్టుకున్నాయి.


క్యాస్టింగ్‍, పాలిషింగ్‍, ఎన్‍గ్రేవింగ్‍, ఇన్‍లేయింగ్‍, లోహ మిశ్రమాన్ని నలుపు చేయడం అనేవి ఈ కళ వస్తూత్పత్తిలో కీలకదశలు. ఎర్రమట్టి మౌల్డ్లలో క్యాస్టింగ్‍ చేస్తారు. వాక్స్ కరిగిపోయిన తరువాత మోల్టెన్‍ మెటల్‍ను వీటిలో పోస్తారు. ఇలా వచ్చిన దాన్ని లేత్‍పై చి సెల్‍ లేదా ఫైల్‍ సాయంతో రఫ్‍గా పాలిష్‍ చేస్తారు. ఫైన్‍ పాయింట్‍తో డిజైన్లు గీస్తారు. ఆ తరువాత ఈ మెటల్‍ను కావాల్సిన డిజైన్లలోకి మలుస్తారు. ఆ తరువాత సాండ్‍పేపర్‍, చార్‍కోల్‍, కొబ్బరి లేదా మంచినూనెతో పాలిష్‍ చేస్తారు. కాపర్‍ సల్ఫేట్‍ ద్రావణంతో ఈ లోహ మిశ్రమాన్ని నలుపు చేస్తారు. ఇది సిల్వర్‍ను పర్మనెంట్‍ జెట్‍ బ్లాక్‍ బ్యాక్‍గ్రౌండ్‍తో మెరిసేలా చేస్తుంది. ఈ విధమైన కాంట్రాస్ట్ బీద్రివేర్‍కు జీవం పోస్తూ దాన్ని ప్రత్యేకమైందిగా మారుస్తుంది. బీదర్‍ ఫోర్ట్లో లభ్యమయ్యే ఒక రకం మట్టిని నీటిలో కలిపి ఈ లోహమిశ్రమాన్ని నలుపు చేసేందుకు వినియోగిస్తారు. ఈ కళ ఇక్కడే పరిఢవిల్లేందుకు ఇది కూడా ఒక కారణమై ఉండవచ్చు.

తర్కాశి (ఇన్‍లే ఆఫ్‍ వైర్‍), తైనిషాన్‍ (ఇన్‍లే ఆఫ్‍ షీట్‍) వంటి ఇన్‍లేయింగ్‍ టెక్నిక్స్ను , డిజైన్లకు అదనంగా జర్నిషాన్‍ (లో రిలీఫ్‍), జబుర్‍లాండ్‍ (హై రిలీఫ్‍), అఫ్తాబి (కట్‍ అవుట్‍ డిజైన్‍ ఇన్‍ ఓవర్‍లైడ్‍ మెటల్‍ షీట్‍)లను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఈ టెక్నిక్స్ను ఒకదానితో ఒకటి మిళితం చేస్తారు.


సాధారణంగా ఈ బీద్రీ కళాత్మక వస్తు వులను సాధారణ వినియోగానికి ఉపయోగించేవిగా కూడా చేస్తారు. హుక్కా, ఉగాల్దాన్‍, సైలాబ్చి (వాష్‍ బేసిన్స్), మిర్‍-ఇ-ఫార్ష్ (వెయిట్స్), సిని (ప్లేట్‍) రూపాల్లో వీటిని తయారు చేస్తారు. మహిళలు ఉపయోగించే పాన్‍ దాన్‍, నగర్‍దాన్‍, చాన్‍గేర్‍, ముకబా, డిబియా కూడా రూపొందిస్తారు. చేపల ఆకారంలో ఉండే బాక్స్లు కూడా తయారు చేస్తారు.


ఆయా వస్తువులపై డిజైన్లు సాధారణంగా జామెట్రిక్‍ పాటర్నస్లో లేదా సంప్రదాయక తీగలు, పూవులు తరహాలో ఉంటాయి. ఇలాంటి వాటిపై పర్షియన్‍ ప్రభావం అధికంగా ఉంటుంది. స్వస్తిక్‍, క్రీపర్‍ డిజైన్లు కూడా కానవస్తాయి. స్వాతంత్య్రానికి పూర్వం యురోపియన్‍ ప్రభావం ముఖ్యంగా ఫ్రెంచ్‍ ప్రభావం కూడా ఈ డిజైన్లపై అధికంగా ఉండేది.


హైదరాబాద్‍లోని సాలార్‍జంగ్‍ మ్యూజియం బీద్రీలో వివిధ అలంకరణ వస్తువులకు, కళాత్మక రూపాలకు సంబంధించి అద్భుత సేకరణ కలిగిఉంది. పలు రకాల బీద్రీ కళాఖండాలను ఇక్కడ చూ డవచ్చు.

-చరిత

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *