కళ’తప్పుతున్న కంసాలి బతుకులు
విశ్వకర్మ చరిత్ర :‘శిల్పాచార్యాయ దేవాయ నమస్తే విశ్వకర్మణేమనవే మయాయ త్వష్ట్రేచ శిల్విన్ దైవ్ఞతే నమః’పురుషసూక్తంలో విరాట్ పురుషునిగా అభివర్ణితుడైన విశ్వకర్మ దేవశిల్పి. అష్టావసువులలో ఒకరైన ప్రభావను కుమారుడు. తల్లి యోగసిద్ధి. పురాణకథల్లో అనేక చోట్ల విశ్వకర్మ ప్రస్తావన కనిపిస్తుంది. అరవై నాలుగు కళలలో ఒకటైన వాస్తు (నిర్మాణ) శాస్త్ర స్థాపకుడు (గాడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్) వాస్తు పురుషుడు. ‘విశ్వకర్మా సహంస్రాంశౌ’ అని ప్రమాణం. తొలిరోజులలో విశ్వకర్మను అపర బ్రహ్మ అనీ వ్యహరించేవారు. అప్సరస ఘృతాచిని, విశ్వకర్మ పరస్పరం …