సస్టెయినబుల్‍ అర్బనిజం – హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍


(ప్రపంచ పర్యావరణ దినం, ఫోరమ్‍ ఫర్‍ ఎ బెటర్‍ హైదరాబాద్‍ 21వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ఆన్‍ లైన్‍ సమావేశంలో సస్టెయినబుల్‍ అర్బనిజం – హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍ అంశంపై ఇంటాక్‍ (న్యూదిల్లీ) గవర్నింగ్‍ కౌన్సిల్‍ సభ్యుడు ప్రొఫెసర్‍ కేటీ రవీంద్రన్‍ చేసిన ప్రసంగ సారాంశం)


నలభై ఏళ్ళ క్రితం… నేను హైదరాబాద్‍ లో రెండేళ్లు ఉన్నాను. నా మనస్సులో కొంత భాగం ఇక్కడే ఉండిపోయింది. ఎందుకంటే నేను ఈ నగరాన్ని ప్రేమిస్తాను. ఇక్కడి ప్రజలను అభిమానిస్తాను. సస్టెయినబుల్‍ అర్బనిజం – హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍ అంశంపై నా ప్రసంగం. సుస్థిరదాయఖ అర్బనిజం గురించి మనం మాట్లాడుతుంటాం. హెరిటేజ్‍ మేనేజ్‍ మెంట్‍ అంశాల్లోనూ అది తన పునాదులను కలిగిఉంది. ఒక ఐదా రేళ్లుగా సస్టెయినబుల్‍ డెవలప్‍ మెంట్‍ గోల్స్ గురించి మీకందరికీ తెలుసు. దీనిపై భారత్‍ కూడా సంతకం చేసింది. ఐక్యరాజ్య సమితి 17 సుస్థిరదాయక అభివృద్ధి లక్ష్యాలను నిర్వచించింది. ఇవన్నీ కూడా వారస త్వ సంపదపై ప్రభావం కలిగించగల అంశాలే. అందుకే ఈ అంశాలన్నీ కూడా మనకెంతో ముఖ్యమైనవే. మరీ ముఖ్యంగా 3, 6, 7, 8, 11, 12, 13, 14, 15, 17 అంశాలు చారిత్రక వారసత్వంపై ప్రత్యక్ష ప్రభావం కలి గించేవి. దారిద్య్రం, ఆకలి లాంటివి పరోక్ష ప్రభావం కలిగిస్తాయి. నాణ్యమైన విద్య, లింగసమానత్వం లాంటి అంశాల కూడా వారసత్వంపై పరోక్ష ప్రభావాన్ని కలిగిస్తాయి. నిజానికి సుస్థిరదాయకత అనేది 1987లోనే ఐక్యరాజ్యసమితిలో చర్చకు వచ్చింది. అప్పట్లో దాన్ని ‘భవిష్యత్‍ తరాలు తమ అవసరాలతో రాజీపడాల్సి న అవసరం రాకుండానే ప్రస్తుత అవసరాలను తీర్చగలిగే అభివృద్ధి’గా నిర్వచించారు. అప్పట్లో దీన్ని గ్రాండ్‍ ప్లాన్‍ కమిషన్‍గా వ్యవహరించారు. ఆ తరువాత 2015లో ఈ దృక్పథంలో భారీ మార్పు చోటు చేసుకుంది. వనరుల సుస్థిరదాయకత నుంచి మనిషి-ఆవరణ వ్యవస్థ మధ్య సుస్థిరదాయక సంబంధాల దిశగా అందరి దృష్టి మళ్లింది. భవిష్యత్తు గురించి మాత్రమే కాదు, ఈ క్షణం గురించి… వర్తమానం గురించి మాట్లాడడం కూడా మొదలైంది. వారసత్వ సంపద పరిరక్షణలో మనం మన ప్రయత్నాలు ఎక్కడ చేయాలి అనేది ప్రా ధాన్యం సంతరించుకుంది. అంటే మనం సహజ ఆవరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని మాత్రమే చూడడం లేదు, మా నవ నెట్‍ వర్క్ లు, మానవ ఆవరణ వ్యవస్థల గురించి కూడా ఆలోచిస్తున్నాం. అవి ఒకదానితో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో చూస్తున్నాం. మనకు అందిన వాటిని భవిష్యత్‍ తరాలకు అందించాల్సి ఉంటుందని అంటారు. పర్యావరణం, సుస్థిరదాయకతలను భావితరాలకు అందించాలి. ఆ జాబితాలో హెరిటేజ్‍ కూడా ఉంటుంది. అంతే కాదు… అవి భవిష్యత్తుకు సంబంధించినవి కాదు. వర్తమానానికి సంబంధించినవే. గతంలో మనం ఏం చేశాం, భవిష్యత్‍లో ఏం చేయనున్నాం అనేవి కూడా ముఖ్యమైనవే. 2020లో హైదరాబాద్‍లో వరదలు వచ్చాయి. దురదృష్టవశాత్తూ ఈ నగరం ఇప్పుడు తీవ్రమైన వరద ముప్పును ఎదుర్కొంటోంది. ఒక నగరానికి వాటిల్లే అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి అది. వరద వస్తే యావత్‍ ఆర్థిక వ్యవస్థ కూడా మందగిస్తుంది. ఎన్నో ఏళ్ళ పాటు దాని ప్రభావం ఉంటుంది. మరీ ముఖ్యంగా పేదలకు మరెంతగానో కష్టనష్టాలు ఎదురవుతాయి. వాటి గురించి మాటల్లో వర్ణించలేం. వారి ఇళ్లు కొట్టుకుపోయాయి. వారి జీవనోపాధులూ పోయాయి. సాధారణంగా వారు ఓపెన్‍ స్పేసెస్‍ లో జీవనోపాధి కార్యకలాపాలు నిర్వ హిస్తుంటారు. వరదలకు అవి కూడా దెబ్బ తిన్నాయి. వారు ఎన్నో అనారోగ్యాలకు గురయ్యారు. అస్థిర నగరాలకు మూల కారణం మానవ చర్యలు ఇన్‍ సెన్సిటివ్‍గా ఉండడం. అది మార్పును వేగవంతం చే స్తుంది. హైదరాబాద్‍లో పరివాహక ప్రాంతాలు ఎన్నో చెరువులను ఏర్పరిచిన సంగతి మనకు తెలిసిందే. అవన్నీ కూడా గతంలో అభివృద్ధి పేరిటనో, విస్తరణ కారణంగానో ఆక్రమణలకు గురయ్యాయి. ఇక్కడ మనకు రింగ్‍ రోడ్‍ ఉంది. నిజానికి అంది నగరం చుట్టూరా పని చేస్తుంది. నీటి ప్రవాహం సౌత్‍ ఈస్ట్ వైపు వెళ్ల కుండా చూస్తుంది. మన భవిష్యత్‍ అవసరాలు తీరాలి అనే విషయం మనకు తెలుసు. మనం వనరులను పరిరక్షించు కోవాలి. భూ వినియోగాన్ని తగ్గించుకోవాలి. దీనికి సంబంధించి మనం తీసుకోవాల్సిన చర్యలు ఎలా ఉండాలో చూద్దాం. రెసిలియెంట్‍ అర్బనైజేషన్‍ దిశగా పని చేయాలి. రెసిలియెంట్‍ కమ్యూని టీలను రూపొందించాలి. వనరుల సంరక్షణ కోసం వారసత్వాన్ని పరిరక్షించు కోవాలి. అర్బన్‍ ఫామ్‍ ను రీపర్పసింగ్‍ చేయాలి. వరదలు ఒక్కటనే కాదు. భూకంపాల గురించి, అగ్నిప్రమాదాల గురించి కూడా ఆలో చించాలి. నగరం యధా పూర్వస్థితికి రావడంపై దృష్టి పెట్టాలి. ప్రజలను కూడా అందుకు సన్నద్ధులను చేయాలి.


హెరిటేజ్‍ కు సంబంధించినంత వరకు వనరులను సంరక్షించు కోవడం అనేది అత్యంత ముఖ్యమైంది. మనం వినియోగించే భూమిని మనం విస్తరిస్తూ పోతున్నాం. మనం మన ప్రస్తుత హౌసింగ్‍ స్టాక్‍ వైపు చూడడం లేదు. ప్రస్తుత పాత నగరాల వైపు దృష్టి పెట్టడం లేదు. అభివృద్ధికి గాను విస్తరణకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నాం. అంతేగాకుండా అర్బన్‍ ఫామ్‍ పై కూడా దృష్టి పెట్టాలి. అంటే, ప్రస్తుత భవనాలను తిరిగి విని యోగించుకోవడం, హౌసింగ్‍ స్టాక్‍ రీయూజ్‍ లాంటివి చూడాలి. తద్వారా మనం మెరుగైన జీవన పరిస్థితులను కల్పించగలుగుతాం. హెరిటేజ్‍ ఇంటర్వెన్షన్స్తో సస్టెయినబుల్‍ అర్బనిజం రూపొందించగలుగుతాం.


ఇక వర్తింపజేయాల్సిన ప్రధాన సూత్రాల్లో ప్రముఖమైంది సర్క్యులర్‍ మెటబాలిజమ్‍. నగరాల్లోకి మనం రకరకాల పదార్థాలు, శక్తి లాంటివాటిని అందిస్తుంటాం. అదే సమయంలో వ్యర్థాలు, కాలుష్యం రూపంలో విషతుల్యాలను నగరాల నుంచి పొందుతుంటాం. ఇది లీనియర్‍ మెటబాలిజం. దాన్నే మనం ఇప్పుడుఅనుసరిస్తున్నాం. ఈ భావనను మనం కొత్త తరహాగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సర్క్యులర్‍ మెటబాలిజం. ఇక్కడ మనం క్లోజ్డ్ లూప్‍ సిస్టమ్‍ కలిగి ఉంటాం. దాన్ని మల్టిపుల్‍ సైకిల్స్ కు వర్తింప జేయవచ్చు. ఎస్టీపీ నెట్‍ వర్క్ను సమర్థంగా వినియోగించుకోవాలి. అధునాతన సాంకేతిక తలను వినియోగించుకోవాలి. మనాలి వంటి చిన్న చిన్న పట్టణాల్లోనూ ఈ పనిని ఇప్పుడు సమర్థంగా చేస్తున్నా రు. హైదరాబాద్‍ వంటి పెద్ద నగరాలు మరింతగా పెద్ద ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ ఎస్టీపీలు వ్యర్థాలను సరిగా నిర్వహించలేక పోతాయి. సగం మాత్రమే శుద్ధి చేసిన వ్యర్థాలుగా వాటిని పరి గణించాల్సి ఉంటుంది. ఆ తరువాత తిరిగి వాటిని నదుల్లోకి డంప్‍ చేస్తుంటారు. మన నదుల పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ఈ విధమైన వ్యర్థాలు భూమిని కలుషితం చేస్తున్నాయి. మన నగరాలేవీ ఈ పరిస్థితికి మినహాయింపు కాదు.


వనరుల సంరక్షణ, సుస్థిరదాయకతలో అత్యంత ముఖ్యమైన భాగం చారిత్రక నగరాన్ని నిర్వహించడం. భారతీయ నగరాల ప్రజానీకం ఇప్పుడు కోరుకుంటున్నది మానవత్వంతో కూడిన ధోరణి. దేశ జనాభాలో 45 శాతం మంది పాతికేళ్లలోపు వారు. వయస్సు పెరిగిపోతున్న వారి మీద అసలే మాత్రం పట్టింపు ఉండడం లేదు. పని చేస్తున్న సాధారణ ప్రజలను ఎంతో మందిని మేం కలుసుకున్నాం. వారంతా కూడా ఏ మాత్రం సంతోషం లేకుండానే పని చేస్తున్నారు. పూర్తి నాణ్యంతో జీవితాన్ని ఆనందించలేకపోతున్నారు. వీరంతా కూడా సుస్థిరదాయకం కానటువంటి నగర వ్యవస్థలో భాగమవుతున్నారు. ఇప్పుడు మనం వృద్ధి చేయాల్సింది చక్కటి పార్టిసిపేటరీ గవర్నెన్స్, హౌసింగ్‍, సామాజిక మౌలిక వసతులను. ఇక మనం మొబిలిటీ, దానికి సంబంధించిన మౌలిక వసతుల దిశగా పని చేయాల్సి ఉంటుంది. వీటన్నిటి మధ్య నిరంతర కమ్యూనికేషన్‍ కూడా ఉండాల్సిన అవరం ఉంది. మానవ నెట్‍ వర్క్లను నిలకడతో కూడుకున్నవిగా చేసేందుకు సంప్రదాయక నగరాలను స్మార్ట్ చేయాలి. ఒక్కసారి ఇన్వెస్ట్ మెంట్‍ చేసినంత మాత్రాన వారు బాధల నుంచి బయటకు రారు. భారతీయ నగరాల ఆర్థిక వారసత్వ ఫైన్‍ టెక్చ్సర్‍ను మనం కాపాడాలి. ఒకప్పుడు పట్టణాల్లో ఎంతో మంది ఆంతప్రెన్యుయర్లు ఉండేవారు. మరెంతో మంది హస్త కళాకారులు రకరకాల వస్తువులను ఇళ్లలో తయారు చేసే వీధుల్లో విక్రయించేవారు. ఇలాంటి ఆర్థిక వారసత్వాలను కాపాడాల్సిన అవసరం ఉంది. భారతీయ నగరం అనేది వారసత్వంలో ఒక భాగం. నూతన ధోరణులకు మనం బలైపోతున్నాం. మరీ ముఖ్యంగా కోవిడ్‍ మహమ్మారి లాంటి సమయాల్లో. ఆన్‍ లైన్‍ కొనుగోళ్లలో మోసాలకు ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. ఇవన్నీ కూడా ఈ విధమైన ఆర్థిక వారసత్వాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి.


అర్బన్‍ డిజైన్‍ ద్వారా భారతీయ నగరాన్ని మానవత్వంతో కూడుకున్నదిగా చేయడం మరొక అంశం. నగ రాలను రూపొందించేందుకు మనం సరైన అర్బన్‍ డిజైన్‍ సూత్రాలను పాటించాలి. నగరాలు ప్రజలు ఆనం దించేవిగా ఉండాలి. అప్పుడు మాత్రమే అక్కడ నివసిస్తున్న వారు ఆయా నగరాలతో యాజమాన్యపు అ నుభూతిని పొందగలుగుతారు. వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకో గలుగుతారు. అలాంటి నగరాల్లో పెరిగే పిల్లల సుస్థిరదాయక భవిష్యత్‍ నిర్వహణకు అది మెరుగైన రీతిలో తోడ్పడుతుంది. ఇప్పుడు మనం నగ రాల వేగాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తూ మ న ట్రాఫిక్‍ ప్లానర్లు ఎప్పుడూ వేగాన్ని పెంచాలనే ప్రయత్నిస్తుంటారు. మరెన్నో ఫ్లైఓవర్లు నిర్మిస్తారు. మరెన్నో రహదారులు నిర్మిస్తారు. మరెన్నో రోడ్ల నిర్మాణంలో మరింతగా పెట్టుబడులు పెడుతున్నారు. తద్వారా వేగం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. నడక మార్గాలకు తగ్గించుకుంటున్నాం. ఇప్పుడు వీటన్నింటికీ విరుద్ధంగా మనం పని చేయాల్సి ఉంటుంది. ప్రకృతి, మానవ నిర్మిత హెరిటేజ్‍ను మిళితం చేసే దిశగా పని చేయాలి. పట్టణ సేవలకు, హెరిటేజ్‍ ఆస్తులకు సమానమైన యాక్సెస్‍ ఉండాలి. సదుపాయాలకు విస్తృత యాక్సెస్‍కు వీలు కల్పించేలా టెక్నాలజీ అప్లికేషన్స్ ఉండాలి.


సుస్థిరదాయక హెరిటేజ్‍ సిటీ కోసం ఏడు సూత్రాలు పాటించాలి. సమకాలీన అర్బన్‍ డిజైన్‍, సమకాలీన ఇ మాజినేషన్‍ కు అవి అనువుగా ఉంటాయి. మన హెరిటేజ్‍ నగరాల లక్షణాలు ఏంటో చూడండి. అవి కాంపాక్ట్గా ఉండాలి. తగినంత జనసాంద్రత ఉండాలి. మిక్స్డ్‍ యూజ్‍ సిటీగా ఉండాలి. నడక బాటలు, నాన్‍ – మోటరైజ్డ్ వాహనాల రాకపోకలు ఉండాలి. శక్తి వినియోగం తక్కువస్థాయిలోనే ఉండాలి. వీధులు సోషల్‍ స్పేసెస్‍గా ఉండాలి. సుస్థిరదాయక సోషల్‍ నెట్‍ వర్క్లు ఉండాలి. ఫ్యాన్సీగా ఉండే నూతన మెటీరియల్స్ను ఇప్పుడు మనం విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. అవి వాడవద్దని నేను అనడం లేదు. కాకపోతే మెటీరియల్‍ కల్చర్‍ను కూడా పాటించాలి. ఈ ఏడు సూత్రాలు సమకాలీన అర్బన్‍ డిజైన్‍ కు ప్రాథమిక సూత్రా లుగా ఉంటాయి. ఏళ్లుగా వృద్ధి చెందుతూ వచ్చిన దాన్ని తుడిచిపెట్టేసి ఫైబర్‍ ఆప్టిక్‍ సిస్టమ్స్తో నింపేస్తే సరిపోతుందా? ఇక చివరిగా అహ్మదాబాద్‍ లోని సబర్మతి హాస్టల్‍ గోడలపై ఒక ఫోటోగ్రాఫ్‍లో ఉన్న దాని గురించి మాట్లా డుకుందాం. అది మహాత్మా గాంధీ సందేశం. ‘‘నా ఇల్లు అన్ని వైపులా గోడలతో ఉండాలని, కిటికీలు సామ గ్రితో నిండి ఉండాలని నేను కోరుకోవడం లేదు. అన్ని రకాల సంస్కృతులు వీలైనంత స్వేచ్ఛగా ఇంట్లోకి రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ, నా పాదాలను మరొకరు తోసివేయడాన్ని మాత్రం నేను తిరస్కరి స్తాను’’ అని అందులో ఉంటుంది. బహుశా అది 1940లకు చెందిన వ్యాఖ్య కావచ్చు. ఈ సూక్తి ఇప్పుడు మన రాజకీయ స్థితిగతులకు, మనం అనుసరిస్తున్న ధోరణులకు సరిగ్గా సరిపోతుందని నేను భావిస్తున్నాను. మనం మన తలుపులు తెరుచుకొని ఉండాలి. అదే సమయంలో మరే వ్యవస్థ కూడా మనల్ని గాల్లో కి ఊదేయకుండా మన పాదాలు నేలపై బలంగా ఉండాలి.

అనువాదం : యన్‍. వి.యం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *