పురాతన గ్రంథాలయాలు

ఏప్రిల్‍ 23న ప్రపంచ పుస్తక దినోత్సవం

ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానమని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‍ కలాం తరచూ చెప్పేవారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఏప్రిల్‍ 23 ప్రపంచపుస్తక దినోత్సవం.. పుస్తకం గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే.. అందుకే వాటికి నిలయమైన కొన్ని విలక్షణమైన గ్రంథాలయాల గురించి తెలుసుకుందాం.. ఇవి ప్రపంచంలోనే ప్రత్యేక లైబ్రరీలు.


దీని వయసు 1,162 ఏళ్లు
ప్రపంచంలో ఇప్పటికీ నిలిచిఉన్న పురాతన లైబ్రరీ మొరాకో లోని ‘ది అల్‍ ఖారవియిన్‍ లైబ్రరీ’. క్రీస్తుశకం 859లో ఫాతిమా అల్‍ ఫిహ్రీ అనే సంపన్న మహిళ దీనిని కట్టించారు. ఇందులో ఎన్నో పురాతనమైన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి.. మొరాకో ప్రభుత్వం ఈ మధ్యే ఈ బిల్డింగ్‍ను పునరుద్ధరించి.. ప్రజల కోసం ఓపెన్‍ చేసింది.


470 భాషలు.. 3.2 కోట్ల పుస్తకాలు
అమెరికా ప్రతి నిధుల సభ కాంగ్రెస్‍ కు అనుబంధంగా ఉండే ‘లైబ్రరీ ఆఫ్‍ కాంగ్రెస్‍’ ఇది. ప్రపంచం లోనే అతిపెద్ద లైబ్రరీ ఇదే. 470 భాషలకు చెందిన 3.2 కోట్ల పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి . అందమైన నగిషీలు, మార్బుల్‍ ఫినిషింగ్‍తో అందమైన లైబ్రరీగానూ పేరుపొందింది. ప్రతినిధుల సభకు అనుబంధంగా ఉన్నా అక్కడి పౌరులెవరైనా వెళ్లి పుస్తకాలు చదువుకోవచ్చు.


నేచురల్‍ లైటింగ్‍..
చూడటానికి డిఫరెంట్‍గా కనిపిస్తున్న ఈ బిల్డింగ్‍ ఈజిప్ట్లోని బబ్లియోథెకా అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రపంచంలోని పురాతన, అతిపెద్ద లైబ్రరీల్లో ఇదీ ఒకటి. ఈ లైబ్రరీకి 2002లో కొత్త బిల్డింగ్‍ కట్టించారు. పూర్తిగా సౌర కాంతి పడి పుస్తకాలు చదువుకునేలా రూపొందించారు. ఎక్కువ సంఖ్యలో పురాతన గ్రంథాల ఫొటో కాపీలు ఇక్కడ ఉన్నాయి.

చదువుతూ.. రిలాక్స్..
లైబ్రరీ అంటే అంతా సైలెంట్‍, ఓ పక్కన కూర్చుని మీ చదువేదో మీరు చదువుకుంటారు కదా.. కానీ ఫ్రాన్స్లో సముద్ర తీరం వెంబడి ఏర్పాటు చేసిన ‘లైర్‍ అ లా ప్లాగ్‍ (బీచ్‍ దగ్గర చదువుకోండి)’ లైబ్రరీలు మాత్రం వెరీ స్పెషల్‍. నచ్చిన పుస్తకమో, నవలో, మేగజైనో తీసుకుని.. బీచ్‍ ఇసుకలో అలా రిలాక్స్డ్‍గా చదువుకోవచ్చు. బీచ్‍ల వెంట ఆరెంజ్‍ పైకప్పు, ఎరుపు రంగు కుర్చీలను ఏర్పాటు చేశారు.


బొమ్మల పుస్తకాలు..
బొమ్మలతో ఉండే కథల పుస్తకాలు.. చిన్నప్పుడు ఇష్టంగా చదివేవాళ్లం.. వాటిని ఇప్పుడు కూడా చదవొచ్చు.. జపాన్‍లోని ఇవాకీ సిటీలో ఉన్న ఈ లైబ్రరీకి వెళ్తే.. ఇక్కడ వెయ్యికి పైగా ఇలాంటి పిక్చర్‍ బుక్స్ ఉన్నాయి. లోపల సెటప్‍ సూపర్‍గా ఉంటుంది.. అక్కడే ఉండిపోవాలనిపిస్తోంది.

  • దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *