2వ జగదేకమల్లుని రాజ్యకాలాన్ని పెంచిన వాడపర్తి శాసనం


యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లా భువనగిరికి సమీపంలోని వడపర్తి గ్రామంలో కళ్యాణీచాళుక్యుల పాలనాకాలంనాటి కొత్త శాసనం లభించింది. పాలకుడు ప్రతాపచక్రవర్తి 2వ జగదేకమల్లుని ఏలుబడిలో భువనగిరి దండనాయకుడుగా పనిచేసిన విద్ధమయ్య వేయించిన ఆలయదాన శాసనమిది. వడపర్తిలో శంభునిమర్రి అని గ్రామస్తులు పిలుచుకునే పొలంలో నల్లశానం రాయి మీద చెక్కివున్న శాసనం, శాసనంలో పేర్కొన్న ‘వైజరాజ చెరువు’ రాచకాలువ పక్కన పొలాలలో లభించింది.


వాడపర్తి చారిత్రక విశేషాలు:
వాడపర్తిలో చరిత్రపూర్వయుగంలోని రాతిచిత్రాలు, పెదరాతియుగం సిస్టు సమాధులు, డోల్మన్లు, మెన్హర్‍, సాతవాహనుల కాలంనాటి ఇటుకలు, కుండపెంకులు అగుపించాయి.
వడపర్తిలోని ఈశ్వరిగుట్టమీద ఉన్న గుడిలో ఉన్నది శైవదేవతగా భావిస్తున్న ఈశ్వరి కాదు సరస్వతి. గుట్టమీద దేవాలయ శిథిలాలున్నాయి. రాచకాలువ దగ్గర కూడా దేవాలయ శిథిలాలెన్నో ఉన్నాయి. గుట్టమీద ఉన్న విడి శిల్పాలలో శైవద్వారపాలకులు, వైష్ణవ దేవాలయ ధ్వజస్తంభం, మహాపాదం, చాళుక్యశైలిలో చెక్కిన మైలారదేవుడు, భద్రకాళి, వినాయకుడున్నారు.
వడపర్తి శాసనంలో పేర్కొనబడిన వైజరాజు చెరువు రాచకాలువున్న చెరువే. రాచకాలువ నుంచి నీరు భువనగిరి చెరువుకు చేరుతుంది. బీబీనగర్‍, వడపర్తి, భువనగిరి, రాయగిరిలోని చెరువులు గొలుసు చెరువులు.


శాసనం-చాళుక్యుల ప్రశస్తి:

బాదామీ చాళుక్యుల నుంచి కళ్యాణీ చాళుక్యుల వరకు తమను ‘హారీతిపుత్రుల’మని చెప్పుకున్నారు. మానవ్యసగోత్రులు (ఇది బ్రాహ్మణగోత్రం)గా చెప్పబడిన వీరు క్షత్రియలక్షణాలున్న బ్రాహ్మణులు. పవిత్రక్షత్రియులుగా శాసనాలలో పేర్కొనబడ్డారు. వారు ద్వివర్ణులని జి.పి.భట్‍(1988)తన గ్రంథంలో రాసారు. చాళుక్యులు హారీతి పుత్రులని పేర్కొన్నశాసనాలు ఈ శాసనంతో యాదగిరిగుట్ట-భువనగిరి జిల్లాలో రెండవది లభించినట్లైంది. అది కూడా ఒక్క విద్ధమరసరు వేయించినవే రెండు శాసనాలు(చందుపట్ల, వడపర్తి-రెండు గ్రామాల మధ్యదూరం 20 కి.మీ.లలోపే) కావడం విశేషం. చందుపట్ల శాసనంలో చాళుక్యవంశీయుల వంశవృక్షం చెప్పబడ్డది. కొల్లిపాకనాడులోని ఆలేటి కంపణం-40కి చెందిన భువనగిరి దుర్గాధిపతి మహాప్రధాన, దండనాయకుడు విద్ధమరసరు లేదా విద్ధమయ్య చందుపట్ల (చంద్రపట్టణం)లో విద్ధేశ్వరస్వామిని ప్రతిష్టించి చేసిన భూదానాలు ప్రస్తావించబడ్డాయి. (నల్గొండ జిల్లా శాసన సంపుటి, శాసన సంఖ్యలు-37, 43)


శాసన విషయం-చరిత్ర:
భువనగిరిపట్టణానికి సమీపంలోని వడపర్తి(వాడపఱ్తి) గ్రామీణులు (80 సం.లు పైబడిన)సంకూరి బొంతప్ప, బొమ్మ వెంకటయ్యగారలు నిర్మిస్తున్న కొత్తశివాలయం దగ్గరకు చేర్చబడ్డ శంభునిమర్రి పొలంలో దొరికిన వడపర్తి శాసనంలో కళ్యాణిచాళుక్యుల వంశవృక్షం, ప్రశంసవుంది. చివరి చాళుక్యరాజుకు ముందువాడైన ప్రతాపచక్రవర్తి రెండవ జగదేకమల్లునిపాలనలో సంధి-విగ్రహి, మహాప్రధాన, దండనాయకుడు విద్ధమయ్యరసరు ప్రతిష్టించిన ‘స్వయంభూ కందర్పేశ్వర’ దేవునికి ధాతసంవత్సర (క్రీ.శ.1156) అక్షయత•తీయ సందర్భంగా అంగరంగభోగాలకు, గంధాక్షత, ధూప, దీప నైవేద్యాలకు, నృత్త, గీత, వాద్యాదులకు కొంతభూమి, ఒక పూదోట, 4 గద్యలు దానం చేసినట్లుగా ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. వడపర్తి గావుండ(గ్రామాధికారి) కొమనయ్యపేరు కూడా ప్రస్తావించబడ్డది.
చరితగ్రంథాలలో చెప్పబడినట్లు క్రీ.శ.1138-1151కాక ఈ శాసనంవల్ల రెండవజగదేకమల్లుని రాజ్యకాలం క్రీ.శ.1156 వరకు పెరిగింది. దానశాసనాలు సాధారణమే కాని ఈ శాసనం విద్ధమయ్యరసరున్న కాలాన్ని తెలియజేస్తున్నది. ఈ శాసనంతో విద్ధమయ్య త్రిభువనమల్లదేవ 6వ విక్రమాదిత్యుడు, 3వ సోమేశ్వరుడు, 2వ జగదేకమల్లదేవుల పాలనాకాలంలో భువనగిరి దండనాయకుడుగా పనిచేసినట్లు తెలుస్తున్నది.


ఈ శాసనాన్ని నకలుతీయడంలో మా చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, ఆవుల వినోద్‍ కుమార్‍, చకిలం సురేందర్‍ (ఈనాడు విలేకరి), చంటి సహకరించారు. ఈ కార్యక్రమంలో వడపర్తి గ్రామస్తులు సంకూరి బొంతప్ప, బొమ్మవెంకటయ్య, బరిగె నర్సింహ, కసగోని మల్లయ్య, జూపల్లికృష్ణలు సహాయ, సహకారాలందించారు.


వడపర్తి(వాడపఱ్తి) శాసనం:
వంశం: కళ్యాణీ చాళుక్యులు
రాజు: ప్రతాపచక్రవర్తి జగదేకమల్లుడు-2(1138-1151)
కాలం: దాత నామ సం. అక్షయ తృతీయ, క్రీ.శ.1156 ఏప్రిల్‍ 24
భాష: సంస్కృతం, కన్నడం
లిపి: తెలుగన్నడం

శాసనపాఠం:
మొదటిపక్క:

5 పంక్తులంత రాయి విరిగిపోయింది.

  1. హారీతిపుత్రరుం కౌశికీవర ప్రసా
  2. దలబ్ద శ్వేతాత పత్రాది రాజ్య చిహ్నరుం
  3. సప్తమాతృకా పరిరక్షితరుం కార్తికే
  4. య వరప్రసాదలబ్ద మయూరపింఛ
  5. కుంతధ్వజరుం భగవన్నారాయణ ప్రసాద
  6. సంచిత వరవరాహలాంఛనే క్షణక్షణ వ
  7. శీకృతారాతి రాజమండలరుం సమస్త భువనా
  8. శ్రయ సర్వలోకాశ్రయ విష్ణువర్ధన విజయా
  9. దిత్యాది విశేషాభిదానరు మెనిసి నెగఱ్ద రాజ
  10. రత్నంగళుద్భవ భూమియాద చాళుక్యవంశ…
  11. తారడోలం శ్రీమచ్చాళుక్యవంశలలామం క్రోధ
  12. ద్వర్ధన రామ్నయోధ్యధామం సత్యాశ్రయ నిజ
  13. సోమం సింహాసనాధిపతియ వేనేగఱ్ఱం తా
  14. మచ్చాపాదానేందిత్త జయసింహ మ
  15. హీపాలనాదియోగకరుం రాజ్యంగెయ్యు
  16. త్తిమిరలనన్తరం విక్రమాదిత్యదేవనమగం
  17. కం ll బడతైలనేం హరట్దిరన్చనుదిదో బా
  18. లాండం-తెది బ్రబాప్వరే నూర్మడి తైలనె
  19. బెనంగెల్దదర్దంత దాష్ట్రకూటసింహాసన
  20. మం తత్పుత్రం సత్యాశ్రయం తదనుజం దశ
  21. వర్మాం తదపత్యం విక్రమాదిత్యం తదనుజం జ
  22. యసింహం తత్తనూజ నాహవమల్ల భూవల్లభం
  23. తదాత్మజం భువనైకమల్లం తదనుజం త్రి
  24. భువనమల్ల జగద్పాలణం llశ్లోll ఆతన తన
  25. యం భువనవినుతం భూలోకమల్ల భూయా చ
  26. న్ద్ర నుత్తమపుత్రం శౌర్యగర్భితం జగదేకమల్లనోన
  27. జగతివిదుం ఇడియపెదెసడియ
  28. ఖడోయపనోదివిక్రాంతం తదన్పుత్ర-యాం-
రెండవపక్క:
  1. యిచా
  2. ళుక్యభరణం శ్రీమత్ప్రతాప చక్ర
  3. వర్తి జగదేకమల్లదేవర రా…
  4. జ్యముత్తరోత్తరాభివృద్ధి ప్ర
  5. వర్ధ చంద్రార్కతారం కల్వ(చేడె)
  6. ద నెలవీడినుండ సుఖ సు
  7. వినోదదిం రాజ్యాంగే
  8. రే తత్పాదపద్మోపజీవి సమ-
  9. చ మహాశబ్ద మహాసా
  10. పతి మహాప్రధానం సేనాధిప(తి)
  11. త వేర్గడే కన్నడ సంధి విగ్రహిది
  12. దండనాయకం విద్దమరసరు
  13. భువనగిరియ దండనాయకం
  14. ది రాజయ్యంగడు వాడపఱితియ
  15. ప శ్రీస్వయంభూ కందర్పేశ్వర దేవర్గె
  16. వభ హోమం మాడిసి శ్రీమత్ప్రాతాప(చ)
  17. క్రవర్తి చాళుక్య జగదేకమల్ల మ
  18. ద వినేయసి ధాతృ సంవత్సరద(అక్ష)
  19. య తృతీయ మహాపర్వదందు తా-
  20. వాడపఱ్తితియ గావుండోర్మల్లిగ
  21. యుం మాణికేయనాయక సమిర్దోరె
  22. ర్గే గంధాక్షత పుష్ప ధూప దీప –
  23. ద్యక్కం నృత్త గీత వాద్యాది బొరక
  24. సలద ఖండస్ఫుదిత జీర్ణోద్ధార
  25. దొ సబెసక్కమా వాడపఱ్తితియ
  26. దా దేవర దేగులదన్రేతిత్యదల్లిద
  27. ముంగిడి నిదానర్మెంబరాదొనీయు
  28. ఆరావిద గర్దోయ ఈశానద గొదిన
  29. గోత్తుఱగ్నేయద లోప్యసఱగలు
  30. న్రేరిత్వదల్లిబేర్దం వాయవ్యద
మూడవపక్క:
  1. ల్కడె సు
  2. గటింగెర
  3. – చ్మముము నల్తియ
  4. మఠ సుంకద విత్తిద
  5. గటింగెరధేరదు(?)
  6. మం దేవర డేగులద
  7. ణ భాగద పూదోంట
  8. మానిన్తి నితుమం ధారా (పూ)
  9. ర్వకం మాడికొద్దరు……….(సు)
  10. వర్నామేకంగామేకాం భూమేర
  11. (ప్యద్ధ)ర్మంగుళం హరం నరకమా(ప్నోతి)
  12. -ఱి యామదా భూతసంప్సవషు
  13. మదంశజః పరమ బాపరివ
  14. వాపా పాదజ తమవసో భూ
  15. విభూపాఃయేపాడయం రిమమద
  16. మిమం సమస్తం దేతేభ్యోమయా విధభి
  17. రాజాటిరేఫమూర్ధో- స్వదత్తాం పరదత్తాం
  18. వాయోహరేతు వసుంధరా షష్టిర్వర్ష
  19. సహస్రాణి మిష్టాయాం జాయతే క్రిమిః
  20. ర్గె రంగవల్లియ నిక్కువమాస
  21. -ఱెయల్లి మత్తురు1 దేవర
  22. -గకం వైజరాజంగేకెరెయ విత్తుత భూ
  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *