‘కొండపల్లివర గ్రామె చాముండ శాసనం’ అనే పసాయిత గణపతిరెడ్డి శాసనం


కాకతీయుల సామంతులనేకులు. వీరిలో 1.రేచెర్ల నాయకులు, 2.విరియాల నాయకులు, 3.మల్యాల నాయకులు, 4.నతవాడి నాయకులు, 5.చెరకు నాయకులు, 6.కోటనాయకులు, 7.కాయస్థ నాయకులు, 8.ఇందులూరి నాయకులు, 9.వెలమ నాయకులు, 10. నిడదవోలు నాయకులు ముఖ్యులు.


రేచెర్ల నాయకులు కాకతీయులకు చేసిన సేవ ఎనలేనిది. రాజభక్తి తిరుగులేనిది. వారిలో రామప్పగుడిని కట్టించిన ప్రతాపరుద్ర సేనాపతి(రుద్రసేనాని)కి ‘కాకతిరాజ్య స్థాపనాచార్య, కాకతిరాజ్య సమర్థ, కాకతీయ రాజ్యభార ధౌరేయ’ అనే బిరుదులున్నాయి. (దాక్షారామ, ఉప్పరపల్లి శాసనాలు) మాండలిక హోదా, రాచచిహ్నాలు కూడా లభించింది రుద్రసేనానికే. వారినే రేచెర్ల రెడ్లు అంటారు.


గణపతిదేవ చక్రవర్తి సేనాని రుద్రసేనాని వారసుడైన పసాయిత గణపతిరెడ్డి శాసనాలలో నేలకొండపల్లి చెరువుగట్టు మీద లభించింది మొదటిది. రెండవది గణపురం కోటగుళ్ళ శాసనం.


నేలకొండపల్లి శాసనం 7అడుగుల ఎత్తున్న నలుపలకల రాతిస్తంభానికి నాలుగుదిక్కుల చెక్కివుంది. మొదటివైపు ఢమరుకం, త్రిశూలం వున్నాయి. రెండోవైపు పైన సూర్యచంద్రులు, కింద వరాహం వున్నాయి. మూడోవైపు, నాలుగోవైపు ఏ చిహ్నాలు లేవు. సాధారణంగా కాకతీయల శాసనాల మీద కనిపించే సూర్యచంద్రులు, శివలింగం, ఖడ్గం, ధేనువు చిహ్నాలు ఈ శాసనం మీద కనిపించకపోవడం ప్రత్యేకం. గణపతిదేవచక్రవర్తి రుద్రసేనానికి మాండలికపదవినిచ్చి, రాచచిహ్నాలను కూడా యిచ్చినట్టు పరబ్రహ్మశాస్త్రి కాకతీయులులో రాసారు.(పాలంపేట, దిచ్చకుంట శాసనాలు) రుద్రసేనాని ముదిగొండ చాళుక్యుల తరువాతితరంవాడైన నాగతిరాజును ఓడించి విసురునాడు అని పిలువబడే భద్రాచలం ప్రాంతాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కలిపివేసాడు. గణపతిదేవుడు బహుశ రుద్రసేనానిని ఎలకుర్తికే కాక ముదిగొండ చాళుక్యులేలిన ప్రాంతానికి కూడా మాండలికుని చేసివుంటాడు(?). ఆ పరంపరలో వచ్చిందే ఈ శాసన సందర్భం.


ఈ శాసనం గణపతిదేవుని రాజ్యపాలనకాలమప్పటిది. (నేల)కొండపల్లి చెరువుకట్టమీది పోలకమ్మ మూలస్థానాని(గుడి)కి మహామండలేశ్వర కాకతీయ గణపతిదేవ మహారాజు నిజభృత్యుడైన రేచెల్ల(ర్ల) పసాయిత గణపతిరెడ్డి బొల్లసముద్రము(చెరువు) వెనుక ఇరుకారుల పంటను(రెండుకార్తెలు, రెండు సీజన్లు) రెండు మర్తురుల భూమిని (3ఎకరాలు దాదాపు) వ్రిత్తిగా ఇచ్చాడు. ఈ దానశాసనంలో ప్రోలకమ్మకు, నూకానమ్మకు, మారకమ్మకు ఆభరణాలు, ఎత్తునయనాలు, 2 సిన్నాల ఎత్తు పహిండాకులు, 2సిన్నాల ఎత్తు ముంగరలు, మూడు కంచు పళ్ళెరాలు, 12 సిన్నాలు ధూప, దీప, హారతులకు, రెండు చిపముంతల పాల కొనుగోలుకు 20 మాడలు, యిట్లా దేవతార్చనలకు అనేకవిధాల దానాలు చేసిన వివరాలీ శాసనంలో వున్నాయి. అన్నీ దానాలు గ్రామదేవతలైన అమ్మదేవతలకే చేయడం ప్రత్యేకం.
ఇది శక సం. 1162, శార్వరి సం.ర వైశాఖ శుద్ధ తదియ గురువారమునాడు అనగా క్రీ.శ. 1240 మార్చి 26న ఇచ్చిన దానశాసనం. 151 పంక్తులున్న ఈ శాసనభాషలు సంస్కృతం, తెలుగు. లిపి 13వ శతాబ్దపు తెలుగు.


ఈ శాసనం తొలుత సాధారణ శాసనపదాలతో మొదలైనా, తరువాత సంస్కృత శ్లోకాల్లోనికి (శాసనంలో 21 పంక్తి నుంచి 58వ పంక్తివరకు), తెలుగు గద్య, పద్యాల్లోనికి(65-70 పంక్తులు) మారిపోతుంటుంది.
ఈ శాసనంలోని కందపద్యమొకటి…
కం. ‘‘శ్రీ కొండపల్లిపురమునం
బ్రాకటముగ బెద్దచెర్వు పశ్చిమ దిశ సో
(భా)కరమై నెలకొన్న ద
యాకరి రచియింత్తు బుదజనావలి మెచ్చన్‍’’… అంటాడు ఈ శాసనాన్ని రచించిన త్రినేత్ర పండితుడు. శాసనాన్ని శిలాస్తంభంపై చెక్కింది ముప్పపోజు.

శాసనపాఠం:

 1. స్వస్తిశ్రీ శుభ శక
 2. వర్షంబులు 1162
 3. అగు శార్వరి సంవత్స
 4. ర వైశాఖ శుద్ధ తదియ
 5. గురువారమున కొండ
 6. పల్లి కట్టమీంది మూ
 7. లస్థానము ప్రోలకం
 8. మకు శ్రీ మన్మహా
 9. మండలేశ్వర కాకతియ్య
 10. గణపతిదేవ మహా
 11. రాజు నిజబ్రెత్యుండై
 12. న రేచెల్ల పసాయిత
 13. గణపతిరెడ్డివారు బొ
 14. ల్ల సముద్రము వె
 15. నుక తూముకాలువ
 16. ను మోగవాతను ఇ
 17. రుగారూం బండను
 18. పెట్టిన వ్రిత్తి రెండు మ
 19. ఱుతురు ..కొండపల్లి
 20. వర గ్రామె చాముండ
 21. శాసనం తథా ఆచం
 22. ద్రతారకార్కరోచసు స్వి
 23. రంబ్బూ సముద్రవత్‍
 24. స్వదత్తాం పరదత్తాం వా
 25. యోహరేతి వసుం
 26. ధరా…..సహ
 27. స్రాదివిస్త్రాయాం
 28. జాయతే క్రిమిః అ
 29. కరదాంని షూరాం కణ్వగోరీ
 30. జెడనీయమిత్తేవిలహరితం
 31. నరః …త్వాగొకొజెర్పద
 32. మమ్నిలతు

సూర్య, చంద్రుల వైపు

 1. రాజన స్వరాదయః క్షి
 2. తిమిమాం సంప్పాత్య సర్వే
 3. మృతాస్తి సహాయకియ
 4. దత్కియతాత్‍ …గ్రామాశ్చ
 5. గ్తాస్సుడ……త్తం దత్త
 6. విపన్నమాద…మవతః
 7. …ప్రంవరితిలదాం
 8. విండద్వం విది….పభు
 9. ద్వ మడురుంకాలఃక
 10. ముత్స్రక్షతి….త్తమము
 11. దేవ శాసనదత్తు
 12. లుద్రిప్పం..దగ మ
 13. దరణ….తులకుం బొ
 14. త్తునం గుడువ వడువా
 15. పముకర…….గాం
 16. గుంబె పాతకంబున
 17. ముంచును..దతఃద్దాన
 18. జలైఃద్రవ…….ప్రత్య
 19. ..భూ…………రక్త
 20. వినిస్ర……………వి
 21. త్రిలోక…………యె హ
 22. తః శతృదాగపాగ….న…చ
 23. …………..నాక
 24. ….హయ…………….బావ
 25. తఃశో…యా……..మణ్య
 26. తే……………..
 27. 0గానున్నయ…………….లుండె
 28. బెట్టి……నట్టిట్టిన
 29. వల……………హర
 30. ములకుం…..శ్రీ…
 31. ….డివత……
 32. పూర్వందొటెలు……

3వ వైపు

 1. కం..శ్రీ కొండపల్లిపురము
 2. నం బ్రాకటముగం బె
 3. ద్దచెర్వు పశ్చిమ దిశ సోయా
 4. కరమై నెలకొన్న దయా
 5. కరి రచియింత్తు బుదజ
 6. నావలి మెచ్చన్‍…
 7. మెచ్చలపడి
 8. రడిపెదచెర్వు వెనుకను
 9. మావిండ్లకడను తన అరు
 10. వనమలోనను నివేద్యమున
 11. కునిచ్చిన దివిసాముసేను..
 12. లోలాక్షి నిలవన్నా…సితప
 13. …కడి పోగక యూర ర
 14. త్నాలంకారి కామచారి వర
 15. దభయంకరి బాసవాస్వా
 16. దమోదియాద్యశక్తిః
 17. ప్రమత్తాత్రినయనతుమా
 18. కొండపల్లినివాసభూత ప్రే
 19. తాది దైత్యావరిచర జయ
 20. రంగాకద్ద గంగ్వాదయాంగ్గా
 21. …డి రెచెవిదాసనంబుస
 22. మనోద్భవమై యొకసిగా పా
 23. కు వెండాకా..చెవింగ్రాల
 24. వెంబడగలొప..గు…గకు
 25. మారజవి…..లకు…ల్లభ
 26. తిందూలంగరుణ శ్రీ
 27. లింబాలు….సన్నమ…
 28. త్తివాయకదరంగానవా
 29. అనికి..యుమ శ్రీ
 30. యును…భ్భుచుం
 31. డేడనొ….డ్రొనా
 32. రదంద్రిషాకింకింవాత్త…
 33. మహిత…. పసాయిత
 34. చమూనాధపునః కన్నోపి
 35. జాయతే.. జననుత కీర్తో
 36. విక్రమ పసాయిత నియ
 37. సిదేనుమ్యసాదన విపినంబు
 38. గ్రుమ్మరు నతత్తనుయం త్రి
 39. లతాసమూహము……..
 40. నుమున వైరిరక్తబహుతాయ
 41. ము ద్రాగును …..రవాండియ
 42. …నురిపునోరి కనియూరక
 43. యుండుటె ఏమిచోద్యమో
 44. హరి

4వ వైపు

 1. ……………
 2. దండస్యపాతువః హే
 3. మాద్రి కడశాయత్ర ధాత్రిఛ
 4. త్రి శ్రీయందద్‍ ..ప్రోలకమ్మ
 5. కూనూంకనమ్మకూ మారకమ్మ
 6. కూను ఆభరణాలు పట్టేలా
 7. మూండు మాడల ఎత్తుపుమ్వదర
 8. నొము ఎత్తునయనాలు రె
 9. 0డు సిన్నాల ఎత్తు పహిండా
 10. కులు రెండు సిన్నాల ఎత్తు ముం
 11. గరలు మూండు కంచుం బ
 12. లైరాలు మూండు జెప్పంట్ట ప
 13. డ్రెండు సిన్నాలు దూపది
 14. వారతులు రెండు చిప ముం
 15. తడి పాలకు కొనవ్రోలు బొం
 16. డు ఇచ్చిన మోడాలు 20 యెంక
 17. లు…తనదేమలోపలను ప
 18. డకమకుంటె వెనుకును పెద్ది
 19. నూంతి మోగవాతను ఇచ్చి
 20. న వ్రిత్తి అడ్డసేను నిత్యపడినిన
 21. వేద్యమునకు బియ్యము
 22. ఇరుసాను…డ్తెండు లేక్కను
 23. చెల్లుటెచిత గుడి….సిన
 24. కునిడురిడి ఒక్క ఇస్తుపకట్టు
 25. బండి…వతగుడికిని ముండ
 26. దడీ భవికకూను తొంటల
 27. నూంతంలకూంగొన వ్రోలు బొ
 28. 0డు చేసిన దర్మత్రయము
 29. నూంట పడెను మాడలు…
 30. ఆనందమూర్తి…నయస…
 31. నందయె శోర్తో గంగ అనుదిన
 32. మును వార్దినిదింగొనె వ్రోలన
 33. భూనుట రక్షించు నదక పుణ్య
 34. నగల్యును సుకవి త్రినెత్ర పండి..
 35. ..కలంకుండాజాత వెడిర అవ
 36. యలిలను సుకవికవితాశిబామ
 37. ..వ్రక్త దాంచెను శాసనంబు …
 38. ద్యవిరచననో విలత్రొం బ్రెగడు మా
 39. రయప్రాలొప్పుగ ముప్పపొ
 40. జు నరశాసన దొశి…లతం ద్రి
 41. నేత్ర రచనను భూలోకంబు
 42. నుం బ్రోలెబొయుండు వరగెన్‍
 43. మంగ్గళ మహాశీశీశ్రీ

శాసనం జాడ చెప్పింది పోతగాని సత్యనారాయణ, శాసనం డిజిటల్‍ ఫోటోలు, సహశోధన చేసిన మా చరిత్ర బృంద కో-కన్వీనర్‍, కట్టాశ్రీనివాసుకు(టీచర్‍) సాయపడ్డది సాధు రాధాకృష్ణమూర్తి సార్‍. శాసనప్రతి అచ్చుతీయడంలో సహకారం ఏలేటి చంటి, రాగిమురళి, సహయాత్రికుడు వేముగంటి మురళీకృష్ణకు ధన్యవాదాలు.

 • శ్రీరామోజు హరగోపాల్‍,
  ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *