మునగ తిన్నవారికి ఆరోగ్యం -పండించిన వారికి లాభం!


పోషకాల గనిగా పేరు తెచ్చుకున్న మునగ.. రైతుల పాలిట కల్పవ•క్షంగా విరాజిల్లుతున్నది. తిన్నవారికి ఆరోగ్యం, పండించిన వారికి లాభాలు అందిస్తున్నది. తక్కువ పెట్టుబడితోనే అధిక దిగుబడులు అందిస్తూ.. అన్నదాతల ఇంట సిరులు కురిపిస్తున్నది.
మునగ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగకరమైనదే. వీటి ఆకులు, కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి విత్తనాలను ఔషధ పరిశ్రమలలో వాడతారు. అందుకే, వీటికి మార్కెట్‍లో భారీ డిమాండ్‍ ఉంటుంది. ఆరోగ్యపరంగానే కాకుండా, వ్యాపారపరంగానూ మునగను సాగు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఇటీవలి పరిశోధనలతో ఏకవార్షిక రకాలు.. అంటే ఆరు నెలల్లోనే కాతకు వచ్చే రకాలు అందుబాటులోకి వచ్చాయి. సాగులో మెలకువలు పాటిస్తే, మేలైన దిగుబడులు సాధించవచ్చని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
అనుకూలమైన నేలలు :
అన్ని రకాల నేలల్లో మునగను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 6.5-8 శాతం ఉండే ఇసుక రేగడి నేలలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి.
పంట సీజన్‍ :
జూలై నుంచి అక్టోబర్‍ వరకు మునగను విత్తుకోవచ్చు. అయితే ఏ సమయంలో విత్తినప్పటికీ, వేసవిలోనే అంటే.. జనవరి-ఏప్రిల్‍ మధ్యలోనే పూతకు వస్తుంది. ఫిబ్రవరిలో ఎకువ పూత, కాత ఉంటుంది.
విత్తన మోతాదు :
ఎకరానికి 200 గ్రా. విత్తనం అవసరం అవుతుంది. 2.5-3 సెం.మీ లోతు గుంతలు తీసుకొని ఒక గుంతకు రెండు విత్తనాల చొప్పున వేసుకోవాలి. నెల వ్యవధిలో మొలకలను పరిశీలించి, మొలకలు లేని గుంతల్లో మళ్లీ విత్తనాలు వేసుకోవాలి. లేదా ముందుగానే పాలీ బ్యాగులలో మొక్కలను పెంచుకొని, 35-40 రోజుల సమయంలో గుంతలలో నాటుకోవాలి. ఒక్కో గుంతకు మధ్య 2-2.5 మీటర్ల దూరం ఉండేలా 45 సెం.మీ పొడవు, 45 సెం.మీ వెడల్పు, 45 సెం.మీ లోతులో తవ్వుకోవాలి. ఒకో గుంతలో 15 కిలోల కంపోస్టు లేదా బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. మొకలు 75 సెం.మీ ఎత్తు పెరిగినప్పుడు మొదలుపై చివర్లను తుంచితే, పక కొమ్మలు ఎకువ సంఖ్యలో వస్తాయి. మునగలో అంతర పంటలుగా టమాట, మిరప, బెండ, బొబ్బర్లను సాగు చేసుకోవచ్చు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ మొకజొన్నను వేయవద్దు.
ఎరువులు :
విత్తిన మూడు నెలల్లో గుంతకు 45:15:30 గ్రా. చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‍ ఎరువులు వేసుకోవాలి. ఆరు నెలలకు పూత సమయంలో మరో దఫాగా ఒకో గుంతలో 45 గ్రా. నత్రజని ఎరువు వేయాలి. విత్తిన మూడో రోజు మొదటి తడిని, ఆ తర్వాత 10-15 రోజుల వ్యవధిలో నీటి తడులను ఇస్తూ ఉండాలి.


సస్యరక్షణ :
కాయ పండు ఈగ యాజమాన్యం : విత్తనం వేసిన 150, 180, 210 రోజుల్లో ఎకరానికి 80 గ్రా. థయోమిథాక్సోమ్‍ 25 డబ్ల్యూజీని నేలలో వేయాలి. ఎకరానికి 10 కుళ్లిన టమాటాలతో కూడిన ఫ్రూట్‍ టాప్‍ను 500 లీటర్ల నీటిలో కలిపి వేయాలి. మరో దఫాలో ఎకరానికి 200 లీటర్ల నీటిలో 500 గ్రా. ప్రొఫెనోఫాస్‍ కలిపి పిచికారీ చేయాలి.
బొంత పురుగు యాజమాన్యం :
మునగ కాండంపై బొంత పురుగులు గుంపులుగా చేరి, బెరడును తొలిచి తింటాయి. ఆకులను తొలిచేస్తాయి. దీంతో ఆకు విపరీతంగా రాలిపోతుంది. ఈ సమయంలో పురుగు గుడ్లను, లార్వాలను ఏరివేయాలి. వర్షాల తర్వాత పెద్ద పురుగులను నివారించడానికి హెక్టారుకు ఒక దీపపు ఎరను ఉంచాలి. లార్వాలను చంపే ‘బర్నింగ్‍ టార్చి’ వాడాలి. లీటర్‍ నీటిలో 2 మి.లీ. క్వినాల్‍ ఫాస్‍ లేదా 2 మి.లీ. మిథైల్‍ డెమటాన్‍ కలిపి పిచికారీ చేయాలి.
కార్సి పంట :
మొదటికాయ కోత తర్వాత భూమట్టం నుంచి 90 సెం.మీ ఎత్తులో మొక్కను కత్తిరించాలి. దీంతో 4, 5 నెలల్లో చెట్టు మళ్లీ కాపుకొస్తుంది. మూడు సంవత్సరాల వరకు ఇలా కార్సి పంటను తీసుకోవచ్చు. కత్తిరించిన వెంటనే మొకకు 45, 15, 30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‍ ఎరువులు వేయాలి. 30 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‍ ఎరువులు వేయాలి. ఏటా 25 కిలోల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువును వేయాలి.
దిగుబడి:
సాలీనా చెట్టుకు సగటున 220 మునగ కాయల చొప్పున హెక్టారుకు సుమారు 50-55 టన్నుల దిగుబడి వస్తుంది.
మునగ రకాలు :
కేఎం-3 : ఈ రకాన్ని విత్తనాలతో సాగు చేయాలి. సాలీనా ఒక చెట్టుకు 400-500 కాయలు వస్తాయి. నాటిన ఆరు నెలలకే కాపుకొస్తుంది. కాయలు 25-30 సెం.మీ పొడవు ఉంటాయి. మొకలు పొదలుగా ఉంటాయి. కాబట్టి కాయ కోత చాలా సులభం. మొదటి కోత తర్వాత భూ మట్టానికి ఒక మీటరు మందం కాండం వదిలి, మిగతా భాగాన్ని కత్తిరించాలి. కార్సి పంటగా 2-3 సంవత్సరాలు దిగుబడిని ఇస్తుంది.
పీకేఎం-1 : ఈ రకం విత్తిన 5-6 నెలలకు పూతకొస్తుంది. 7-8 నెలల్లో కోతకొస్తుంది. మార్చి-ఆగస్టు మధ్యలో దిగుబడి ఎకువగా ఉంటుంది. ఒక సంవత్సరంలో 4-6 మీటర్ల పొడవు పెరుగుతుంది. 6-12 కొమ్ములు వస్తాయి. కాయలు 75 సెం.మీ పొడవు ఉండి, 150 గ్రాముల బరువు తూగుతాయి. సాలీనా మొకకు 220 కాయలు వస్తాయి. హెక్టారుకు 52 టన్నుల దిగుబడి ఉంటుంది. ఈ రకం మునగ తోటలో అంతర పంటగా మిరప, వేరుశనగ, ఉల్లి పంటలను వేసుకోవచ్చు.
పీకేఎం-2 : ఇది సంకర రకం. విత్తనాల ద్వారా సాగు చేసుకోవాలి. నాటిన ఆరు నెలల్లో కాతకొస్తుంది. వివిధ పంటల సరళిలో సాగుకు అనుకూలం. కాయలు 120 సెం.మీ పొడవు
ఉండి 70 శాతం కండతో 280 గ్రాముల బరువు తూగుతుంది. కాయలలో విత్తనాలు తకువ. కండ ఎకువగా ఉంటుంది. సాలీనా చెట్టుకు 220 కాయలు వస్తాయి. హెక్టారుకు 98 టన్నుల దిగుబడి వస్తుంది. కార్సి పంటను మూడేండ్ల వరకు సాగు చేయవచ్చు.
వ్యాపార కోణంలో :
వ్యాపార కోణంలో మునగ సాగు చేయాలనుకునే రైతులు అధిక సాంద్ర పద్ధతిని ఎంచుకోవాలి. సాధారణ పద్ధతికి బదులుగా మొక్కల మధ్య దూరం 1 మీ., వరుసల మధ్య దూరం 1.5 మీ. వచ్చేలా గుంతలు తీసుకోవాలి. దీంతో హెక్టారుకు 13,333 మొకలు వస్తాయి. మొకల సాంద్రత పెరగడం వల్ల భారీ దిగుబడి సాధించవచ్చు. ఈ పద్ధతిలో బిందు సేద్యం ద్వారా సాగునీరు అందించాలి. ప్రతి మొక్కకూ ఫెర్టిగేషన్‍ ద్వారా 135:23:45 గ్రాముల చొప్పున నత్రజని, భాస్వరం, పొటాష్‍ను అందిస్తే దిగుబడులు పెరుగుతాయి. నత్రజని, పొటాష్‍ ఎరువులను యూరియా, మ్యూరేట్‍ ఆఫ్‍ పొటాష్‍ రూపంలో డ్రిప్‍ ద్వారా అందించాలి.


విత్తనోత్పత్తి
మునగ సాగు చేయాలనుకొనే రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేపట్టవచ్చు. పూత సమయంలో వర్షాలు రాకుండా ఉండే కాలంలో విత్తనం నాటుకోవాలి. ఒక రకం మొక్కల నుంచి మరో రకం మొక్కలకు 500 మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. అలాగే పూత సమయంలో వేడి వాతావరణం ఉండాలి. మొక కాండం లక్షణాలు, కాయ అభివృద్ధి దశలలో లక్షణాలను బట్టి కల్తీలను ఏరివేయాలి. ఏడాది చెట్టుకు 200-250 కాయలు వస్తాయి. ఒకో కాయలో 10-13 విత్తనాలుంటాయి. అంటే.. ఒకో చెట్టుకు 600 గ్రా. నుంచి కిలో వరకూ విత్తన దిగుబడి ఉంటుంది. కాయలు కోసి రెండు రోజులపాటు ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత పగులగొట్టి విత్తనాలను సేకరించాలి. 8-10 శాతం తేమ వరకు ఆరబెట్టుకోవాలి. కిలో విత్తనానికి 2 గ్రా. బావిస్టిన్‍తో విత్తనశుద్ధి చేసి నిల్వ ఉంచుకోవాలి. పాలిథీన్‍ బ్యాగులలో విత్తనాలు ఎకువ కాలం నిల్వ ఉంటాయి. వీటిని ఒక ఏడాది వరకు నిల్వ ఉంచుకుని విత్తనంగా వాడుకోవచ్చు.
చిన్న, సన్నకారు రైతులకు లాభం
ఏకవార్షిక మునగ సాగు చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పంటకు తకువ మొత్తంలో నీరు అవసరం పడుతుంది. కూలీల అవసరం కూడా తక్కువే. కుటుంబ సభ్యులే వివిధ పనులు పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఎరువులు, పురుగు మందులు కూడా ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు. తక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటారు కాబట్టి, కాయలను సులభంగా, తకువ కాలంలోనే స్థానిక మారెట్లకు తరలించవచ్చు.


ఆనబోయిన స్వామి,
ఎ : 9963 87 2222

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *