ప్రకృతి నిర్మిత సౌందర్యాన్ని కాపాడుకుందాం!
కళాకారులు మానవ హృదయ నిర్మాతలు. ప్రకృతి అద్భుతమైన సహజ సౌందర్యాల నిర్మాత, కన్నతల్లి. కళాకారుల సృజన ఆనాటి నాగరికతకు, నైపుణ్యాలకు ప్రతీక. ప్రకృతి సృజన స్వాభావికమైనది, సహజమైనది. వాటిని ప్రకృతి మార్పులు, చేర్పులు చేయలేదు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఈ పంచభూతాల సమ్మిళతమే ప్రకృతి. ఈ పంచభూతాల సంచలిత క్రియలు వాతావరణాన్ని మార్పుకు గురిచేస్తాయి. పెల్లుబికిన లావా చల్లబడి వివిధ నిర్మాణ రూపాలు తీసుకుంటాయి. శిలలు, కొండలు, గుహలు, దిబ్బలు, సొరంగాలు ఇలా ప్రకృతి …