ఉమ్మడి మెదక్‍ జిల్లా శిలా మరియు ఖనిజ సంపద

ఈ జిల్లాలోని ప్రాంతం 9,699 చదరపు కిలోమీటర్లలో విస్తరించి యున్నది. ఈ ప్రాంతం యొక్క పాత పేరు మెతుకు దుర్గం. ఈ పేరు రావడానికి కారణం ఇక్కడ సన్నటి బియ్యం పండించడం వల్ల వచ్చింది. ఈ జిల్లాకి దక్షిణాన రంగారెడ్డి జిల్లా, తూర్పున వరంగల్‍, ఈశాన్యం కరీంనగర్‍, ఉత్తరాన నిజామాబాద్‍, పశ్చిమాన కర్నాటక రాష్ట్రం యొక్క బీదర్‍, గుల్‍బర్గా జిల్లాలు. రెండు రాష్ట్రాల రహదారులు ఎన్‍హెచ్‍-9 (హైదరాబాద్‍-నాగపూర్‍) ఈ ప్రాంతం గుండా వెళ్తావి. రెండు రైలు మార్గాలు, హైదరాబాద్‍ – ఉద్‍గిరి, హైదరాబాద్‍ – ఔరంగాబాద్‍ ఈ ప్రాంతం గుండా వెళ్తవి.
ఈ ప్రాంతం ఒక మోస్తరి ఎత్తు పల్లాలతో చిన్న చిన్న గుట్లతో కూడి వుంటుంది. ఈ ప్రాంతంలో 610 మీటర్ల ఎత్తైన చోటు జహీరాబాద్‍ వద్ద మరియు తక్కువ ఎత్తు గల చోటు సిద్దిపేట దగ్గర 381 మీటర్లుగా వున్నది.


ఈ జిల్లాలో రెండు కొండ ప్రాంతాలు వున్నవి. 1. రామయన్‍పేట – తూప్రాన్‍ మధ్య 2. నారాయణ్‍ఖేడ్‍- గజ్వేల్‍ మధ్య. ఈ జిల్లాలోని పశ్చిమ ప్రాంతం తప్ప మిగతా ప్రాంతం అంతా వివిధ రకాల గ్రానైట్‍ శిలలతో కూడి వుంటుంది. ఇందులో చాలా వరకు గ్రానైట్‍, గ్రానోడమొరైట్‍, ఆల్కలిఫెల్స్పార్‍ గ్రానైట్‍, అడమలైట్‍, మిగ్మటైట్‍నైస్‍, టోనలైట్‍ మరియు అక్కడక్కడా ఆంఫిబొలైట్‍, పైరాక్సిన్‍ గ్రానులైట్‍ ప్యాచెస్‍వి సిద్దిపేట వద్ద చూడగలము. ఈ శిలల్లో ఇన్‍ ట్రూసివ్‍గా డొల రైట్‍ డైక్స్ మరియు క్వార్ట్జ్వీన్స చూడగలము. ఇవి నార్త్-ఈస్ట్, సౌత్‍-వెస్ట్ దిశలలో విస్తరించి వున్నవి. ఈ ప్రాంతంలో డెక్కన్‍ వల్కానిసం వల్ల ఏర్పడిన శిలలు అనగా డెక్కన్‍ బసాల్టస్ మరియు ఇంటర్‍ ట్రాపియన్స్ జోగిపేట్‍ నుండి జిల్లా యొక్క పశ్చిమ సరిహద్దు మధ్య చూడగలము. సంగారెడ్డికి దక్షిణ ప్రాంతంలో కూడా చూడగలము. జహీరాబాద్‍ ప్రాంతంలో విస్త•తంగా ఏర్పడిన లాటరైట్‍ క్యాపింగ్స్ని చూడగలము. ఈస్ట్-వెస్ట్, నార్త్ సౌత్‍ దిశలలో ఉన్న రెండు పెద్ద లీన్యమెంట్స్ క్రాస్‍ అయ్యే ప్రదేశం మెదక్‍-నర్సాపూర్‍ మధ్యలో కలదు.


ఖనిజ సంపద :
ఈ జిల్లాలో క్వార్టజ్, క్లే, లాటరైట్‍ మాలిబ్డినైట్‍, డైమెన్‍శన్‍స్టోన్‍, అగేట్‍, జాస్‍పార్‍ నిక్షేపాలు కలవు.
క్వార్టజ్: మంచి క్వాలిటి క్వార్టజ్ వీన్స్ శంకరంపేట, పాపన్నపేట, నర్సాపూర్‍, అందోల్‍, సదాశివపేట, సంగారెడ్డి ప్రాంతాలలో కలవు.
క్లే : లైట్‍ రెసిడ్యుల్‍క్లే నిక్షేపాలు జహీరాబాద్‍ ప్రాంతంలోని శేక్‍పూర్‍ వద్ద మరియు సిద్ధిపేట ప్రాంతంలోని ఘంబీర్‍పేట వద్ద కలవు.
లాటరైట్‍ : లాటరైట్‍ నిక్షేపాలు జహీరాబాద్‍ ప్రాంతంలో డెక్కన్‍ బసాల్ట్ల పైన క్యాపింగ్స్ రూపలో విస్త•తంగా దొరుకును. వీటిని ఇటుకల తయారీలో వాడుతారు. దీనిలో కొంత బాక్‍సైట్‍ మరియు ఇనుము కలదు.
మాలిబ్డినైట్‍ (MoS2) :
ఇది మాలిబ్డినం యొక్క ముఖ్యమైన ఓర్‍. దీనిని ప్రత్యేకమైన స్టీల్స్, ఎలక్ట్రికల్‍ ఇండస్ట్రీలో మరియు కొన్ని ప్రత్యేకమైన ఇంక్‍ల, గ్లేజ్‍ల తయారీలో వాడుతారు.
ఈ జిల్లాలో ఈ ఖనిజం క్వార్టజ్ వీన్స్, పెగ్మటైట్స్లో డిస్సెమినేశన్స్, స్ట్రింజర్స్ రూపంలో దొరుకును. ఈ ఖనిజం దొరికే ప్రాంతాలు ఎల్‍గండై, సునిగ్రాం, నల్లగొండ, కట్‍కూర్‍ ఈ నిక్షేపాల యొక్క మొత్తం రిజర్వు 1.16 మీటర్లుగా నిర్ధారించారు ఐబీఎం కరీంనగర్‍, మెదక్‍ జిల్లాలకు కలిపి. ఎందుకంటే ఈ ఖనిజం యొక్క బెట్లు కరీంనగర్‍ జిల్లా నుండి మొదలై మెదక్‍ జిల్లాలోకి విస్తరించింది. ఈ రెండు జిల్లాలలో 39 కి.మీ. పొడుదు 13 కి.మీ. వెడల్పుగా వున్నది.


డైమెన్‍శన్‍ స్టోన్స్ : వివిధ రకాల గ్రానైట్‍లు, డోలరైట్‍లు పాలిశ్‍ చేసి డెకరేటివ్‍ స్టోన్స్గా కన్స్ట్రక్షన్‍ ఇండస్ట్రీలో
ఉపయోగిస్తున్నారు. డెక్కన్‍ ట్రాప్స్లో అగేట్‍, జాస్‍పార్‍ దొరుకుతుంది. వీటిని లాపిడరి ఇండస్ట్రీలో డెకరేటివ్‍ ఆర్టికల్స్ తయారీలో వాడుతున్నారు.
ఈ జిల్లాలో ముఖ్య నది మంజీరా. ఇది గోదావరి యొక్క ఉపనది. హల్దీ, కుందేరు, పుసుపుఏరు ఈ జిల్లాలోని డ్రైనేజ్‍నెట్‍ వర్క్. వీటి ప్యాటర్న్ గ్రానైట్స్లో డెంద్రిటిక్‍గా మరియు డెక్కన్‍ బసాల్‍లో ప్యారెలెల్‍గా వున్నది. ఈ జిల్లాలో ఎన్నో లీనియమెంట్స్, ఫ్రాక్యర్స్ కలవు. ఈ ప్రాంతాలు భూగర్భ జలాల డెవలప్‍ మెంట్‍కు చాలా ఉపయోగపడతవి.
ఈ జిల్లాలో పశ్చిమ ప్రాంతం డెక్కన్‍ బసాల్ట్ పైన బ్లాక్‍ కాటన్‍ సాయిల్‍, గ్రానైటిక్‍ టెరెన్‍లో రెడ్‍ సాండీ సాయిల్‍. మంజీరా నదికి ఇరువైపులా సాండీ సాయిల్‍ కలదు.


జహీరాబాద్‍ ప్రాంతం నుండి సీస్‍మిక్‍ ఏక్టివిటి రిపోర్ట్ చేసారు. దీనిని మైనర్‍ క్రస్టల్‍ అడ్జస్ట్మెంట్‍ కారణంగా నిర్ధారించారు. సీస్‍మొటెక్‍టానిక్‍స్టడీ ప్రకారం ఈ ప్రాంతం రెండు సీస్‍మిక్‍ జోన్స్గా గుర్తించారు. గ్రానైట్‍ టెరేన్‍ జోన్‍-1, డెక్కన్‍ ట్రాప్‍ ప్రాంతం జోన్‍-2గా నిర్ధారించారు.

  • కమతం మహేందర్‍ రెడ్డి, ఎ : 91 90320 12955

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *