వలసదారుల దినోత్సవం!


డిసెంబర్‍ 18 ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్లమంది పైగా ఎన్‍ఆర్‍ఐలు

విశ్వవ్యాప్తంగా అధిక సంఖ్యలో పెరుగుతున్న వలసలను పరిశీలించి ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ, 1990 డిసెంబర్‍ 18న జరిగిన సమావేశంలో ‘వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని మేరకు డిసెంబర్‍ 18ని అంతర్జాతీయ వలసదారుల దినోత్సవంగా ప్రకటించింది. వలస అంటే బతుకుదెరువు కోసం, లేదా ఆర్థికాభివృద్ధి కోసం చేసుకునే ‘నివాస మార్పు‘గా భావించవచ్చు. ప్రజలు వలసలతో పలు అవకాశాలను పొంద గలుగుతున్నప్పటికీ కష్టాలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. వలసలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వలస వెళ్లేలా ‘నెట్టివేయబడే’ పరిస్థితులు కొన్నైతే, వున్నచోట పరిస్థితులు అనుకూలంగా లేక మరొక చోట ‘ఆకర్షణీయంగా’ ఉండడం మరొక కారణం.


పని కోసం, బతుకుదెరువు కోసం పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు గానీ, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి గానీ వలస వెళ్లడాన్ని ‘అంతర్గత వలసలు’ అంటారు. ఒకదేశం నుంచి మరొకదేశానికి వెళ్లడాన్ని ‘అంతర్జాతీయ వలసలు’ అంటారు. ప్రవాసులకు రాయితీలు కల్పిస్తూ వారిని ప్రాత్సహిస్తే అభివృద్ధి సాధించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాలలో 3 కోట్లమంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారని అంచనా.


ఉమ్మడి ఆంధప్రదేశ్‍ రాష్ట్రం నుంచి 1970లో వలసలు ప్రారంభమయ్యాయి. అప్పుడే గల్ఫ్ దేశాల్లో పెట్రోల్‍ నిల్వలు బయటపడటంతో అక్కడ కూలీల అవసరం ఏర్పడింది.


తెలంగాణాలో బతుకు దెరువులేని రైతులకు, వ్యవసాయ కూలీలకు అక్కడ మంచి అవకాశం దొరికింది. పొట్టకూటి కోసం వెళ్లిన వలస కార్మికులకు అక్కడి, ఇక్కడి ప్రభుత్వాలు అండగా ఉండాలి. తమ ఉనికిని కాపాడుకుంటూ, మాతృ దేశంపై మమకారం చూపుతూ మరెందరికో సహకారాన్ని అందిస్తున్నా, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అనే మాటను నిజం చేయాల్సిన బాధ్యత కూడా ప్రవాసుల మీదవుంది. వలసలు అభివృద్ధికి మార్గం కావాలి!


ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధుల సభ (యునైటెడ్‍ నేషన్స్ జనరల్‍ అసెంబ్లీ) 18 డిసెంబర్‍ 1990 సంవత్సరంలో జరిగిన సమావేశంలో ‘‘అందరు వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యుల హక్కుల రక్షణ’’ గురించి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మెరుగైన ఉపాధి అవకాశాల కోసం ఎంత స్వేఛ్చా స్వతంత్వ్రంగా విదేశాలకు వెళ్తున్నారో అంతే స్వేఛ్చగా తిరిగిరావొచ్చని సభ తీర్మాణం చేసింది.

  • దక్కన్‍న్యూస్‍
    ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *