రాజ్యాంగ పరిరక్షణ నేటి నిజమైన దేశభక్తి
దేశాన్ని ప్రేమించడమంటే దేశంలోని మనుషుల్ని ప్రేమించడం. మనుషుల్ని ప్రేమించడమంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో ఎలాంటి వివక్షతలు, అసమానతలు లేని ప్రజాస్వామిక, మానవీయ స్పర్శతో పరిఢవిల్లే మానవ సమాజాన్ని నిర్మించుకోవడం. దానికవసరమైన భావనల, పాలనావిధానాల, హక్కుల, బాధ్యతల సమోన్నత చట్టరూపమే రాజ్యాంగం. భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రంగా నిర్మించుకునే దీపదారి మన రాజ్యాంగం. వివిధ రాష్ట్రాలు, జాతులు, ప్రాంతాలు, కులాలు, భిన్న సంస్క•తలు, భాషలు, భౌగోళిక స్థితులు కలిగిన వైవిధ్యపూరితమైన మనదేశ ప్రజలందరి మధ్య …