పురాతన ధాన్యం- చిరుధాన్యాల పుణరాగమనం మిల్లెట్‍ మ్యాన్‍ ఆఫ్‍ ఇండియా డా. ఖాదర్‍ వలికి ఆక్స్ ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ సత్కారం

నవంబర్‍ 18న హైదరాబాద్‍, హిమాయత్‍నగర్‍లోని ఆక్స్ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ యాజమాన్యం పద్మశ్రీ అవార్డు గ్రహిత డాక్టర్‍ ఖాదర్‍ వలికి ఆతిథ్యమిచ్చి సత్కరించారు.


ఈ సందర్భంగా సత్కారగ్రహీత డాక్టర్‍ ఖాదర్‍వలి మాట్లాడుతూ.. వరి మరియు గోధుమ వంటి సాంప్రదాయ ప్రధాన పంటల నుండి ప్రపంచ ఆహార ఉత్పత్తి మరియు మానవ ఆరోగ్యంపై మన ద•ష్టిని మరల్చవలసిన అవసరాన్ని డాక్టర్‍ వలి చెప్పారు. అతను కొర్రలు, ఊదలు, సామలు, అరికలు, అండు కొర్రలు, సజ్జలు, రాగులు, వరిగలు మరియు జొన్నలు ప్రపంచ వ్యాప్తంగా కనిపించే చిరుధ్యాన్యాల రకాల యొక్క గొప్పతనాన్ని విశ్లేషించారు.
విద్యార్థుల విషయంలో ఆరోగ్యకరమైన మరియు సుస్థిరమైన భవిష్యత్తును ప్రేరేపించడానికి ఆక్స్ ఫర్డ్ గ్రామర్‍ స్కూల్‍ డైరెక్టర్‍ మణికొండ ప్రార్థన మార్గదర్శకత్వంలో ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నారు అని తెలిపారు. పాఠశాల ఆవరణలో ప్రత్యేకమైన చిరుధ్యాన్యాల తోట ఏర్పాటు చేయబడుతుంది అని అన్నారు. ఇది విద్యార్థులకు అభ్యాస అవకాశాలను మెరుగు పరుస్తుంది. అదనంగా, పాఠశాల యొక్క ‘‘చిరుధ్యాన్యాల సోమవారం’’ చొరవ విద్యార్థుల ఆహారంలో వారంలో ఒక రోజు చిరుధ్యాన్యాలు భుజించడానికి మరియు వాటిపై ఆసక్తిని కలిగించి, పోషకాలు అధికంగా ఉండే ధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది అన్నారు. డాక్టర్‍ ఖాదర్‍ వలి చిరుధ్యానాల వైపు మన ఆహార ద•ష్టిని మార్చవలసిన తక్షణ అవసరాన్ని సూచించారు.


కార్యక్రమంలో శ్యామ్‍ సుందర్‍ రెడ్డి నీటిపారుదల శాఖలో రిటైర్డ్ ఇంజనీర్‍, మినుము సాగులో తన అనుభవాలను తెలిపారు. లయన్స్ క్లబ్‍ ధనంజయ్య చిరుధ్యాన్యాలు తినడం వల్ల తనతో పాటు తన కుటుంబ సభ్యులు పొందిన ఆరోగ్య ప్రయోజనాలను విషదీకరించి పిల్లలలో చిరుధ్యాన్యాల పట్ల ఆశక్తిని ప్రేరేపించారు.


పాఠశాల తన విద్యార్థులలో చిరుధ్యాన్యాల సాగు మరియు వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా, స్థిరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల పట్ల లోతైన అవగాహన కలిగించడం లక్ష్యంగా పెట్టుకుంది. డాక్టర్‍ ఖాదర్‍వలి యొక్క ప్రయత్నం నిశ్శదేహంగా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ‘‘చిరుధ్యాన్యా విప్లవాన్ని’’ స్వీకరించడానికి ప్రేరేపించింది.


‘‘ఖాదర్‍ వలి సిరి జీవన విధానం శాస్త్రీయం మరియు కళాత్మకం’’ పుస్తకావిష్కరణ:

ఈ సందర్భంగా ఎస్‍. ధనంజయ్య, డా.సముద్రాల మారయ్య -మణెమ్మ సేవా ట్రస్ట్ తరపున ‘‘ఖాదర్‍ వలి సిరి జీవన విధానం శాస్త్రీయం మరియు కళాత్మకం’’ అనే పేరుతో తెలుగులో ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు వక్తలతో ‘‘చిరుధ్యాన్యాల ప్రాముఖ్యతని’’ పరప్సర సంభాషణాలతో నిమగ్నమైన ఉత్సాహంతో తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్‍ ప్రార్థన మణికొండ, కరస్పాండెంట్‍, కె. ప్రభాకర్‍, డీన్‍ రామాంజుల, సీబీఎస్‍ఈ ప్రిన్సిపాల్‍ రేఖ రావ్‍, ప్రీ-ప్రైమరీ ప్రిన్సిపాల్‍ ఫాతిమా ఖాజిమ్‍, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

  • కట్టా ప్రభాకర్‍, ఎ : 8106721111

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *