2020

కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు

కొలాం సంప్రదాయ వివాహంలో కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొలాం వివాహ వ్యవస్థలో వరకట్నం అనేది ఉండదు. వరుడు గృహం వద్దనే వివాహం జరుగుతుంది. వివాహానికి అనేక దూర ప్రాంతాల వారిని ఆహ్వానించుతారు. ఆహ్వాన ఆనవాలుగా పసుపుతో కలిపిన జొన్న ధాన్యాలను తలూవల్‍ (అక్షింతలు)గా వారికి అందజేస్తారు.ఊరిలో కళ్యాణ మండపం నిర్మించడానికి గ్రామంలోని ప్రజలందరు సహకరిస్తారు. అడవి నుండి వెదురు (బొంగులు) పెళ్ళిపందిరి నిర్మాణానికి తీసుకొని వస్తారు.కళ్యాణానికి వచ్చే బంధువుల, చుట్టాల కోసం, భోజనం చేయడానికి, మోదుగు …

కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు Read More »

యే షెహర్‍ మేరా హై! తోడ పురానా హై!

నేను, నా కల్చరల్‍ సిటీ హైదరాబాద్‍ వర్షంలో తడిసి అలా నిద్రపోయాం. రాత్రి కురిసిన వర్షం నేలకు ప్రశాంతతను బహూకరించింది. ఆరు బయట చల్లగా ఉంది. హాయినిచ్చే చల్లదనం. గరం చాయ్‍ ఉదయాన్ని మరింత రాగరంజితం చేస్తుంది. జస్ట్ ఇప్పుడే తెలవారింది. లేత ఉదయం, రాత్రి కురిసిన వానలో చెట్లు స్నానం చేసి, ఆకుపచ్చదనంతో కళకళలాడుతున్నాయి. తురాయి చెట్టు అయితే మరీనూ. నా ముందు హొయలు పోతుంది. ఆటిట్యూడ్‍, సో మచ్‍ ఆటిట్యూడ్‍. ఎర్రగా వికటించి నా ముందు అందంగా నిలబడింది. పోనీలే …

యే షెహర్‍ మేరా హై! తోడ పురానా హై! Read More »

పిల్లల సాహిత్య సృజన – పాఠ్య పుస్తకాలు(ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు)

రెండువేల పద్నాలుగు నుంచి తెలుగులో బాల సాహిత్యాన్ని గురించిన సోయి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగింది. పెద్దవాళ్ళు పిల్లలకోసం రాయడంతో బాటు పిల్లలు కూడా బాల సాహిత్యంలో కథలు, కవిత్వం విస్తృతంగా రాస్తున్నారు. వాళ్ళ రచనలు కూడా పుస్తకాలుగా అచ్చయి వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు అన్ని తెలుగు పత్రికలు పిల్లల రచనలను ప్రచురిస్తున్నాయి. బాలసాహిత్యం వికసించడానికి అవసరమైన వాతావరణాన్ని కొన్ని సాహిత్య సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, బాల సాహిత్యవేత్తలు, బాల సాహిత్య అభిమానులు పోత్సహిస్తున్నా తెలంగాణ సాహిత్య అకాడమి …

పిల్లల సాహిత్య సృజన – పాఠ్య పుస్తకాలు(ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు) Read More »

నక్క – ముతాయి రాజు

చాలా కాలం క్రితం చైనాలో ముతాయి అనే ఒక పేదరైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న గుడిసె, కొద్దిపాటి పొలం మాత్రం ఉండేవి. అతని పొలంలో ఒక దానిమ్మ చెట్టు ఉండేది. ఆ చెట్టు విరగకాసినప్పుడు అతను సంతోషంతో గంతులు వేసేవాడు.ఒకసారి అతని దానిమ్మచెట్టు బాగా కాసింది. ముతాయి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. అయితే అతని సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. రోజూ రెండు దానిమ్మ పండ్లు చెట్టునుంచి మాయమవసాగాయి. ముతాయికి ఏమీ అంతుపట్టలేదు. ఎలాగయినాసరే దానిమ్మ పళ్ళని …

నక్క – ముతాయి రాజు Read More »

సహజ వనరులను సహజంగా ఎదగనిద్దాం!

కరోనా ఏ రోజు కారోజు విజృంభిస్తున్నప్పటికీ ఉత్పాదక విధుల నిర్వహణ ఏదో ఒక పరిమితిలోనైనా పునఃప్రారంభమైంది. లాక్‍డౌన్‍ సడలింపులు మొదలయ్యాయి. భయభయంగానైనా సామాజిక జన జీవితం దారిలో పడుతున్నది. కరోనాతో సహజీవనమంటే ఇదే. కరోనా వల్ల వచ్చిన ఇబ్బందులు, సమస్యలు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ మనకి ఒక కొత్త జీవన విధానాన్ని అలవాటు చేసింది. దీనివల్ల భౌతిక, ఆంతరంగిక పరిణామాలతో పాటు వాతావరణంలో వచ్చిన మార్పులు హర్షనీయాలే. ముఖ్యంగా వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గాయి. …

సహజ వనరులను సహజంగా ఎదగనిద్దాం! Read More »

పల్లా దుర్గయ్య

తెలంగాణ అనగానే కాకతీయుల రాజధాని వరంగల్లు గుర్తుకు వస్తుంది. వరంగల్లు జిల్లాలోని మణికొండ గ్రామం, మహాకవులకు, పండితులకు పుట్టినిల్లు.పల్లా దుర్గయ్య గారి స్వగ్రామం ఈ మణికొండే. దుర్గయ్యగారు 25-5-1914 తేదీన పల్లా నర్సమ్మ పాపాయ్య దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులకు వీరు 5వ సంతానం. తండ్రిగారికి వ్యవసాయం, ఉంది. పౌరోహిత్యం కూడా చేసేవారు. కాని దుర్గయ్యగారికి పౌరోహిత్యం అబ్బలేదు.దుర్గయ్యగారి 3వ అన్నగారైన మడికొండ సత్తెయ్యగారు మంచి హరికథకులుగా పేరుగాంచినారు. ఆకాశవాణి హైద్రాబాద్‍ కేంద్రంలో అర్థశతాబ్దికి పైగా హరికథలు వినిపించారు. …

పల్లా దుర్గయ్య Read More »

తొలి మహిళా అనస్థీషియన్‍మన హైదరాబాదీ

వైద్య రంగంలో హైదరాబాద్‍ది విశిష్టమైన స్థానం. మలేరియాకు కారణమైన దోమను కనుక్కున్నది హైదరాబాద్‍లోనే. ఈ విషయాన్ని కనుక్కున్నందుకు రోనాల్డ్ రాస్‍కు 1902లో నోబెల్‍ బహుమతి దక్కింది. అట్లాగే డాక్టర్‍ మల్లన్న, ముత్యాల గోవిందరాజులు నాయుడు 1900 ప్రాంతం నాటికే దేశంలో పేరెన్నికగన్న వై ద్యులు. నిజామ్‍ రాజులను ఇన్నేండ్లు ఒకే దృక్కోణంతో చూస్తూ ‘ప్రగతిశీలురు’ వాళ్ళని దోపిడీదారులు, హిట్లర్‍, నాజీలతో పోల్చిండ్రు. అయితే నాణేనికి మరోవైపు ఉన్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. ఈ నిజామ్‍ల కారణం గానే హైదరాబాద్‍ ఇవ్వాళ ‘మెడికల్‍ టూరిజాని’కి …

తొలి మహిళా అనస్థీషియన్‍మన హైదరాబాదీ Read More »

చంద్రవదనకో చందన తాంబూలం ‘అధికమెట్టు’

మాహ్‍ లఖా బాయి జననమే ఒక వింత కత. ఆమె తల్లి ఆరు నెలల గర్భవతిగా మౌలాలీ దర్గా సందర్శనానికి మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆ కష్టం భరించలేక గర్భవిచ్చిత్తి జరిగే సూచనలు కనిపించినై. అప్పుడు ఆమె భర్త పరిగెత్తి దర్గా దగ్గరికి వెళ్లి మొక్కుకుని ప్రసాదాన్ని తెచ్చి ఆమెకు తినిపించగానే ప్రమాదం తప్పిపోయి నెలలు నిండిన తర్వాత ఆడపిల్లను కనింది. ‘‘చాంద్‍ కా తుక్‍డా’’ లా ఉందని చాంద్‍ బీబీ పేరు పెట్టారు.అట్లాంటి ఆ చంద్రవదన రెండు …

చంద్రవదనకో చందన తాంబూలం ‘అధికమెట్టు’ Read More »

ఫణిగిరి బౌద్ధ ఆరామ శిథిలాలు

హైదరాబాదు సంస్థానం పూర్వ ఆంధ్రసామ్రాజ్య శిథిలాలకు పట్టుకొమ్మ, పూర్వ ఆంధ్రసాహిత్య, శిల్ప, లలితకళాది సంపదలు అస్థి స్వరూపములో, ఈదేశపు గడ్డను శిథిలాలలో దొరుకుతాయి. ఫణిగిరి అట్టి పూర్వ శిథిలాలలో ప్రసిద్ధమయినది.నల్లగొండ జిల్లాలో, గత పది ఏండ్లలో నేనొనర్చిన పురావస్తు పరిశోధనలకు ఆలవాలమైన పురాతన క్షేత్రాలలో ఫణిగిరి శిథిలారామము, బహుముఖ్యమైనది. ఈ విహారము ఒక చక్కని కొండగుట్టమీద నిర్మితమై ఉన్నది. ఈ గుట్టలో క్రీ.పూ. 1వ శతాబ్దము నుండి, శతాబ్దాలతరబడి కాలగర్భమున లీనమైపోయిన భారత సంస్కృతి, పురావస్తు రూపమున …

ఫణిగిరి బౌద్ధ ఆరామ శిథిలాలు Read More »

స్మృతి: మధ్య యుగాల ఆంధ్రదేశ చరిత్ర దార్శనికుడు ఆచార్య రావుల సోమారెడ్డి

2018 నవంబర్‍ 13వ తారీఖున ఆచార్య రావుల సోమారెడ్డి మరణంతో తెలంగాణ ఒక ప్రముఖ చరిత్రకారుణ్ణి కోల్పోయింది. ఉమ్మడి వరంగల్‍ జిల్లాలోని కుగ్రామంలో రైతు కుటుంబంలో 1943లో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఉస్మానియా యూనివర్సిటి నుండి యం.ఏ., పి.హెచ్‍.డి డిగ్రీలను పొందినాడు. ఆ తర్వాత 1970లో యూనివర్సిటీ లెక్చరర్‍గా జాయిన్‍ అయి మూడు దశాబ్దాలకు పైగా రీడర్‍, ప్రొఫెసర్‍, చరిత్ర శాఖ అధిపతిగా పనిచేసి విశేష అనుభవాన్ని గడించినాడు. మధ్య యుగాల ఆంధ్రదేశ సామాజిక, సాంస్కృతిక చరిత్రలో ప్రత్యేక పరిశోధనలు చేసి అనేక గ్రంధాల్ని రచించినాడు. ఆయన …

స్మృతి: మధ్య యుగాల ఆంధ్రదేశ చరిత్ర దార్శనికుడు ఆచార్య రావుల సోమారెడ్డి Read More »