2021

జాతీయ విద్యా విధానం – 2020 తెలంగాణాలో బాలల విద్యావకాశాలు మరియు సవాళ్ళు

కస్తూరిరంగన్‍ కమిటీ ఇచ్చిన తుది నివేదికను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించింది. ఈ విధాన ప్రకటనలో పాఠశాల విద్య మరియు ఉన్నత విద్యకు 2040 సంవత్సరం నాటికి లక్ష్యాలను నిర్దేశించింది. పౌరుల మధ్య సమానత్వాన్ని సాధించడం లక్ష్యంగా, సమానత్వం ప్రాతిపదికన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి విద్య కీలకమయినది అని చెబుతూ జాతీయ విద్యావిధానం ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. అంతే కాకుండా, నాణ్యమైన విద్యను అందరికి అందించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వం, …

జాతీయ విద్యా విధానం – 2020 తెలంగాణాలో బాలల విద్యావకాశాలు మరియు సవాళ్ళు Read More »

వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు

సినిమాల్లో కోర్టు వాతావరణం చూసి చాలా మంది కోర్టులు అలా వుంటాయని అనుకుంటారు. కోర్టు వాతావరణాన్ని దారుణంగా సినిమా వాళ్ళు చూపిస్తూ వుంటారు. అలాంటి సినిమాలు చూసి అదే విధంగా కథలు రాస్తున్న రచయితలూ వున్నారు.నేర న్యాయవ్యవస్థతో సంబంధం వున్న రచయితలు గానీ, న్యాయవాదులైన రచయితలు గానీ, న్యాయమూర్తులైన రచయితలుగానీ కోర్టుకు సంబంధించిన కథలు గానీ, నవలలు గానీ రాసినప్పుడు అలా వుండదు. కోర్టుల్లో వుండే పరిస్థితిని ఆ కథల్లో, నవలల్లో మనం చూడవచ్చు. అయితే తెలుగులో …

వేదనాభరిత జీవితాలని చూపించే కోర్టు కథలు Read More »

శతాబ్ది శిరసున సైన్స్ కిరీటం

ఉషోదయ వేళ విప్పారిన పుష్పం కనువిందు చేస్తుంది. కాని అంతకుముందు రోజే మొగ్గయి, రాత్రి విచ్చుకుంటేనే ఇది సాధ్యం. కాల ప్రవాహంలో రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు జలజల రాలిపడుతుండటం-మనిషి జీవితకాలంతో పోల్చలేం. మానవాళి నాగరికతను అమోఘంగా ప్రభావితం చేసిన విజ్ఞానశాస్త్రం, ప్రగతి వంటి అంశాలను బేరీజు వేసినపుడు వంద సంవత్సరాలు సుదీర్ఘమైన వ్యవధికాదు. సంకేతంగా రాళ్ళు వాడటం క్రీ.పూ. 24,00,000లో ప్రారంభం కాగా, వేటకు సోలతులు, బాణాలు, అంబులు వాడటం క్రీ.పూ. 25,000లో మొదలైంది. అలాగే …

శతాబ్ది శిరసున సైన్స్ కిరీటం Read More »

స్త్రీల కోసం, జెండర్‍ సమానత్వం కోసం సుస్థిరత, అభివృద్ధి UN/SDGs

మార్చ్ నెల స్త్రీల కోసం. మహిళా ఉద్యమాల ఉత్సవాలు జరుపు కోడానికి ప్రపంచ స్త్రీలు ఎదురు చూసే నెల. వాళ్ళతో పాటు నేను కూడా. మార్చ్ నెల ఎండా కాలం వచ్చిందని చెప్తుంది. హైదరాబాద్‍ వేడిగానే వుంది. అది నమ్మి, ఇండియా అంత ఒకే వాతావరణం ఉంటుందని భ్రమపడి, ఢిల్లీ వెళ్ళాను. స్త్రీల హక్కుల కోసం పని చేసినందుకు, భారత ప్రభుత్వం ఇచ్చే జాతీయ పురస్కారాన్ని అందుకోడానికి. చలి. హిమాలయాలు పక్కనే ఉన్నాయా అనిపించేటంత చలి. ‘ఢిల్లీకి …

స్త్రీల కోసం, జెండర్‍ సమానత్వం కోసం సుస్థిరత, అభివృద్ధి UN/SDGs Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం!

గత 6వ కథనంలో శాస్త్రీయ పద్ధతి గూర్చి, త్యాగనిరితితో గూడిన శాస్త్రజ్ఞుల పరిశోధన గూర్చి తెలుసుకున్నాం. ఇదంతా ఊహలతో కూడుకున్నది కాదని, శూన్యంలో జరిపేది అంతకన్నా కాదని గుర్తించడం జరిగింది. ఈ ఆలోచనలు, పరిశోధనలు భూమి ఆధారంగా, భూమి చుట్టూ ఆవరించిన వాతావరణం, పర్యావరణం, జీవావరణం, నేల, నీరు, గాలి తదితర అంశాలతోటే అనుసంధానమై వుంటాయి. వీటికి అతీతంగా ఏ పరిశోధన, పరిశీలన జరగదు. గ్రహాంతర పరిశోధనలు కూడా దాదాపు ఈ నేపథ్యంలోనే వుంటాయి. కాబట్టి, భూగోళమే …

ప్రకృతే నియంత్రిస్తుంది! 8 ప్రకృతే శాసిస్తుంది!! భూగోళమే ఓ శాస్త్రీయ క్షేత్రం! Read More »

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ

పాడిపశువుల రవాణాలో జాగ్రత్తలుపశువుల శరీరలక్షణాలు, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి కొనుగోలు చేసిన పశువులను, శారీరక, మానసిక ఒత్తిడికి గురి కాకుండా క్షేమంగా ఇంటికి చేర్చవలసిన అవసరం ఎంతైనా ఉంది.15-20 కి.మీ. లోపు దూరం ప్రయాణానికి ఎలాంటి వాహనం అవసరం లేదు. మధ్య మధ్యలో కాసేపు విశ్రాంతినిస్తూ, కాలి నడకన తీసుకొని రావాలి. నడిపించే సందర్భాలలో ఒకేసారి చాలా దూరం నడిపించకూడదు. అలా చేస్తే పశువుల కాళ్ళ నొప్పితో బాధపడతాయి. కాళ్లు మెత్తబడి, మేత తినలేక, నడవలేక …

లాభసాటి పాడి పరిశ్రమ నిర్వహణ Read More »

విపత్తుల నివారణ కోసం పటిష్టమైన భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక!

హైద్రాబాద్‍ నగరం రోజురోజుకీ విస్తరిస్తున్నది. స్థానికులతో పాటు ఉపాధి కోసం నగరానికి వచ్చేవారితో జనాభా కూడా పెరుగుతున్నది. ప్రజావసరాలకు అనుగుణంగా విభిన్న వ్యవస్థలు ఎప్పటికప్పుడు రూపొంది, అభివృద్ధి చెందడం అత్యవసరం. ప్రతి వ్యవస్థకూ దానికంటూ కొన్ని ప్రత్యేక ప్రణాళికలున్నప్పటికీ ఆ వ్యవస్థలను రూపొందించడానికి, అమలు చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఉమ్మడిగా సమగ్రమైన ప్రణాళికలు అవసరమవుతాయి. ఈ వ్యవస్థలన్నీ ఒకదానికొకటి ప్రభావప్రేరితాలు. ఈ వ్యవస్థల మధ్య సమన్వయమే ప్రజల అవసరాలను తీర్చడంలో కీలకమవుతుంది. ప్రజాజీవనం సుదీర్ఘమైనది. నగర భౌగోళిక …

విపత్తుల నివారణ కోసం పటిష్టమైన భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక! Read More »

ఆరుట్ల కమలాదేవి

జనసంద్రంలో విరిసిన అరుణారుణ కమలం, నల్లగొండ నుండి వీరవిహారం చేసిన ఓరుగల్లు రుద్రమకు ప్రతిరూపం. విప్లవాల ముగ్గుపరిచిన నవనవోన్మేష క్రాంతి, మానవత్వానికి నిలువెత్తు తార్కాణం. నిర్మల స్వభావం, అన్యాయాన్నెదిరించే అగ్నిశిఖ. వీరోచిత సాహసాలకు ఎక్కుపెట్టిన ఆయుధం. పోరాట కాన్వాస్‍పై చెరగని చిత్రం. హక్కులకై కదం తొక్కిన ధీశాలి. సాయుధ పోరాటంలో వికసించిన అగ్నిపుష్పం. ఆమెనే ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల రామచంద్రారెడ్డికి జీవిత సహచరి అయిన కమలాదేవి రాజకీయప్రస్థానంలోనూ అతని సాహచర్యాన్ని వదలలేదు. తల్లిదండ్రులు లక్ష్మీనర్సమ్మ వేంకటేశ్వర రెడ్డిలు. …

ఆరుట్ల కమలాదేవి Read More »

మనం మరిచిన మహా విమర్శకుడు ఆచార్య గోపాలకృష్ణారావు (జననం : 24 ఫిబ్రవరి, 1926)

మొత్తం తెలుగు సాహిత్య చరిత్రలో గత ఎనిమిది వందల యేండ్లుగా వన్నె తరగకుండా దేదీప్యమానంగా వెలుగుతున్న పక్రియ ‘శతకం’. శతక సాహిత్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు సమకాలీన చరిత్రకు అద్దం పట్టింది. పాండిత్యానికి పెద్ద పీట వేసింది. కన్నడ, సంస్కృత భాషల్లో ఈ పక్రియ కనుమరుగవుతున్నప్పటికీ తెలుగులో మాత్రం కొత్తరూపు సంతరించుకుంటూ ముందుకు పోతుంది. పండితులే గాకుండా గువ్వల చెన్నడి లాంటి సామాన్యులు కూడా ఈ శతకాలను రాసి రంజింప జేసిండ్రు. సమాజంలో చైతన్యం తీసుకొచ్చిండ్రు. …

మనం మరిచిన మహా విమర్శకుడు ఆచార్య గోపాలకృష్ణారావు (జననం : 24 ఫిబ్రవరి, 1926) Read More »

హైదరాబాద్‍ క్రికెట్‍

బ్రిటిష్‍ సైన్యం హైదరాబాద్‍ ప్రజానీకానికి క్రికెట్‍ను పరిచయం చేసింది. సుమారుగా 1880 ప్రాంతంలో నగరంలో క్రికెట్‍కు బీజాలు పడ్డాయి. మొయినుద్దౌలా గోల్డ్ కప్‍ 1930/31కు పూర్వం హైదరా బాద్‍లో ఫస్ట్ క్లాస్‍ క్రికెట్‍కు సంబంధించి ఏ రికార్డులు లభ్యం కావడం లేదు. 19వ శతాబ్ది చివరికాలం, 20వ శతాబ్ది మొదట్లో రాజా లోచన్‍ చంద్‍ ఈ ఆటకు ప్రధాన పోషకుడిగా ఉన్నట్లు చెబుతారు. మసూద్‍ అహ్మద్‍, అహ్మద్‍ అలీ, నజీర్‍ బేగ్‍, ఖుర్షీద్‍ బేగ్‍ లాంటి క్రికెటర్లు …

హైదరాబాద్‍ క్రికెట్‍ Read More »