ప్రమాదంలో పుడమి కవచం
సెప్టెంబర్ 16న ఓజోన్ పరిరక్షణ దినోత్సవం ఒక ఆక్సిజన్ అణువులో సాధారణంగా రెండు ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్ అణువుకు మరో ఆక్సిజన్ పరమాణువు జతచేరినప్పుడు ‘ఓజోన్’ అణువు ఏర్పడుతుంది. మూడు ఆక్సిజన్ పరమాణువులతో కలసి ఏర్పడుతుంది గనుక ‘ఓజోన్’ను ‘ట్క్రెయాక్సిజన్’ అని కూడా అంటారు. ఓజోన్ పొర స్ట్రాటోస్పియర్ వద్ద భూమికి 15 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తున ఆవరించి ఉంటుంది. రుతువుల్లో మార్పుల బట్టి, భౌగోళిక పరిస్థితుల బట్టి ఓజోన్ …