తెలంగాణ గిరి‘జనం’ జాతర
మేడారం మహా జాతర ఓ అద్భుతం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. గత ఎనిమిది వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న ఆదివాసీల ఆరాధ్యదైవాల సజీవ సంస్కృతుల సమ్మేళనం. అడవిబిడ్డల ఆరాధ్యదేవతలైన సమ్మక్క-సారలమ్మ పోరాట పటిమకు.. ధిక్కారస్వరానికి.. ఆత్మగౌరవానికి ప్రతీకలు. ఆదివాసీల పరిభాషలో పంచభూత ప్రకృతి దైవాలుగా విరాజిల్లుతున్న సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు, నాగులమ్మల కలయికే మేడారం జాతర. కీకారణ్యంలో రెండేళ్లకోమారు ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ జాతరకు రాష్ట్ర …