August

‘తృతీయ ప్రకృతి పౌరులు’.. మనలో ఒకరిగా గుర్తిద్దాం!

హిజ్రాలు నేడు సమాజంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట. వీరిని తృతీయ ప్రకృతి (థర్డ్ జెండర్స్ ) గా పరిగణిస్తారు. స్త్రీ మరియు పురుష లక్షణాలున్న మిశ్రమ జాతిని హిజ్రా, గాండు, పేడీ అని పలురకాలుగా పిలుస్తారు. పుట్టుకతోనే ఈ లక్షణాలున్న వారు కొందరైతే, తమకు నచ్చిన విధంగా లింగ మార్పిడి చేయించుకుని మారేవారు మరికొందరు. వీరికి సమాజంలో సరైన ఆదరణ లేకపోవడంతో ఇలాంటివారందరూ కలసి ఒకే ఇంటిలో జీవిస్తుంటారు.ప్రపంచ చరిత్రను ఒక్కసారి తిరగేసి చూస్తే వీరి ప్రస్తావన …

‘తృతీయ ప్రకృతి పౌరులు’.. మనలో ఒకరిగా గుర్తిద్దాం! Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! పర్యావరణంపై నిరంతర వాగ్బాణాలు!

ఓ వైపు రోజురోజుకు దిగజారుతున్న పర్యావరణ ప్రమాణాలు. మరోవైపు పర్యావరణ పరిరక్షణకై వాగ్బాణాలు. మధ్యన పర్యావరణ రక్షణకై తీసుకోవాల్సిన చర్యల్ని తీవ్రతరం చేయాలంటున్న పర్యావరణవేత్తలు ఇవేవి పట్టని వినియోగదారులుగా మారిపోయిన సగటు జనాలు! నిత్యకృత్యంగా మారిన ప్రకృతి ప్రకోపాలు. మస్తిష్కానికి, సాంకేతిక పరిజ్ఞానానికి అంతు చిక్కని వాతావరణ పెనుమార్పులు. వెరసి భౌగోళిక భగభగలు. ఉరుములు, మెరుపులు, పిడుగులు. ఉప్పెనలు, కుంభవృష్టి, అనావృష్టి, కరువు కాటకాలు! కరిగిపోతున్న మంచు ఖండాలు, పొంగుతున్న మహానదులు, తల్లిడిల్లుతున్న సముద్రాలు, నిరాశ్రయులైతున్న జనాలు, …

ప్రకృతే నియంత్రిస్తుంది! 15 ప్రకృతే శాసిస్తుంది!! పర్యావరణంపై నిరంతర వాగ్బాణాలు! Read More »

బంజారా తీజ్‍ పాటల్లో బంధుత్వ మాధుర్యం

తెలంగాణ జనాభాలో లంబాడీలది 6శాతం. వీరు జరుపుకునే పండుగల్లో ప్రధానమైనది తీజ్‍. వర్షాకాలం ఆరంభంలో తొమ్మిది రోజులపాటు జరుపుకునే ఈ పండుగలో కన్నె పిల్లలు వ్యవసాయం, కుటుంబ పోషణ గురించి తెలుసుకుంటారు. ఈ సందర్భంగా రోజూ పాడుకునే పాటలను ఇప్పటికే ఆచార్య సూర్యధనంజయ్‍, డా. కె. పద్మావతిబాయి దక్షిణ తెలంగాణ ప్రాంతంలోను, డా. జనపాల శంకరయ్య ఉత్తర తెలంగాణ ప్రాంతంలోను సేకరించి ప్రచురించారు. ఆ పాటలకు భిన్నంగా ఆదిలాబాద్‍ జిల్లా నార్మూర్‍ మండలంలో పాడే పాటల్లో బంధుత్వ …

బంజారా తీజ్‍ పాటల్లో బంధుత్వ మాధుర్యం Read More »

కల్యమాకుతో ఎకరానికి లక్ష ఏడాదికి రెండు సార్లు విక్రయం.. భారీ లాభం

అందరు వేసే పంటలే వేస్తే లాభం ఎలా వస్తుంది? మార్కెట్‍లో డిమాండ్‍ను బట్టి పంటలు పండించాలి. ఏ పంట కొరత ఉన్నదో చూసి దాన్ని రైతు సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని అంటున్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్‍కు చెందిన ఓ రైతు. పదెకరాల్లో కల్యామాకు తోట వేసిన ఈయన.. ఎకరానికి రూ.లక్ష చొప్పున ఆదాయం సంపాదిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఏడాదికి రెండు సార్లు కోత తీస్తున్నానని చెప్తున్నారు. 3 ఫీట్ల ఎత్తు పెరగ్గానే కోసి, హైదరాబాద్‍ …

కల్యమాకుతో ఎకరానికి లక్ష ఏడాదికి రెండు సార్లు విక్రయం.. భారీ లాభం Read More »

ఖమ్మం – బాల కథా తేజాలు

పిల్లల రచనలకు ప్రాచుర్యం కల్పించడం, ప్రచురించడం, పంపిణీ చేయడం, మార్కెటింగ్‍ లాంటి సమస్యలు ఉన్నా ‘చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ’ ‘బాలచెలిమి’ తెలంగాణాలోని ఉమ్మడి 10 జిల్లాల ‘‘బడి పిల్లల కథలు’’ సంకలనాలుగా అందమైన బొమ్మలతో వెలువరించింది. ఆ ‘పది జిల్లాల బడి పిల్లల కథలు’ దక్కన్‍ల్యాండ్‍ పాఠకులకు పరిచయం చేయడంలో భాగంగా ‘ఖమ్మంజిల్లా బడిపిల్లల కథలు’ గురించి బాల సాహితీవేత్త అమ్మిన శ్రీనివాసరాజు గారి విశ్లేషణ. కథల కోసం చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్‍ అకాడమీ బాలచెలిమి వారి ఆహ్వానం …

ఖమ్మం – బాల కథా తేజాలు Read More »

గుండేరావు హర్కారే

పట్నములోన హైదరాబాదు గొప్పహైద్రాబాదులోన పాటపత్నంబు గొప్పపాతపట్నంబులో గొప్ప పదియురెండుభాషలెరిగిన హర్కారె పండితుండు(తెలంగాణోదయం) బహుభాషలలోను, బహుశాస్త్రాలలోను ఉత్తమశ్రేణికి చెందిన పండితుడు గుండేరావు హర్కారే. ఎంత పాండిత్యముంటే, అంత ఒదిగి ఉండాలని నిరూపించిన శాంతమూర్తి ఆయన. త్రికరణ శుద్ధికి మారుపేరుగా నిలిచిన హర్కారే జీవితంలో అంచెలంచెలుగా ఎదుగుతూ త్రివిక్రమణ్ణి తలపించాడు.గుండేరావు న్యాయశాస్త్రంలో ఎంత దిట్టనో, వ్యాకరణ శాస్త్రంలోను అంతే దిట్ట. పాణిని రచించిన అష్టాధ్యాయికి, ఆధునిక విజ్ఞానాన్ని అనుసరించి, విద్యార్థుల సౌకర్యార్థం’Sanskrit Grammar Made Easy’ పేరుతో ఒక యంత్రాన్ని …

గుండేరావు హర్కారే Read More »

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍

ప్రపంచ వైద్యచరిత్రలో హైదరాబాద్‍కు ఒక విశిష్టమైన స్థానమున్నది. అంతకన్నా ఘనమైన చరిత్ర ఉన్నది. ప్రజల ఆరోగ్యం పట్ల ఇక్కడి రాజులు వందల ఏండ్ల క్రితమే శ్రద్ధ వహించారు. కుతుబ్‍షాహీ వంశానికి చెందిన సుల్తాన్‍ మొహ్మద్‍ కులీకుతుబ్‍షా 1595లో హైదరాబాద్‍లోని చార్మినార్‍ పక్కనే ‘దారుషిఫా’ అనే వైద్యాలయాన్ని నిర్మించాడు. ఇక్కడ యునాని వైద్యంలో శిక్షణ నిప్పించడమే గాకుండా, రోగులకు చికిత్స చేసేవారు. రెండంతస్థుల్లో నిర్మించిన ఈ భవనంలో మొత్తం 40 గదులుండేవి. ఒక్కో గదిలో కనీసం నాలుగు బెడ్ల …

చరిత్రకెక్కిన హైదరాబాద్‍ మెడికల్‍ స్కూల్‍ Read More »

అడుగడుగున కథ ఉంది ‘సుల్తాన్‍ బజార్‍’

ఒకప్పుడు సుల్తాన్‍ బజార్‍ లేదు.ఆ ప్రాంతమంతా రెసిడెన్సీ బజార్‍లోనే కలిసి ఉండేది. అక్కడ నిజాం పరిపాలన కాక బ్రిటిష్‍ రెసిడెంటు ప్రభుత్వం నడిచేది. 1933లో కొంత ప్రాంతాన్ని నిజాంకు అప్పగించారు. అప్పుడు ఆ కొత్త ప్రాంతాన్ని సుల్తాన్‍ బజార్‍ అన్నారు. అప్పుడు ఇదొక వస్త్ర వ్యాపారుల విఫణి వీధి. సుల్తాన్‍ బజార్‍కు దగ్గరలో ఉన్న ‘‘బడీ చావుడీ’’ ప్రాంతమంతా మహా రాష్ట్రులతో నిండి ఉండేది. శ్రీకృష్ణదేవరాయల భాషా నిలయం పక్క సందులో మరాఠీలు మరాఠీల కోసం నడిపే …

అడుగడుగున కథ ఉంది ‘సుల్తాన్‍ బజార్‍’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-12

రెండో పులకేశి హైదరాబాదురాగిరేకు శాసనం (క్రీ.శ.610-11) (తొలిసారిగా తెలుగులో) తెలంగాణ కొత్త చరిత్ర బృందం తలవర శ్రీరామోజు హరగోపాల్‍ గారు నాకు ఒకరోజు ఫోన్‍ చేశారు. నేను తెలంగాణలో బాదామీ చాళుక్యులు అన్న పుస్తకాన్ని రాస్తున్నానని, తనకు రెండో పులకేశి హైదరాబాదు రాగిరేకు శాసన ప్రతిబింబాలు, పాఠం ఉంటే పంపిస్తారా, అని అడిగారు. నేను కూడ రెండో పులకేశి గురించి చదివినపుడు ఆ శాసన ప్రస్తావనను గమనించానే తప్ప, శాసన పాఠాన్ని గానీ, ముద్రలను గానీ చూడలేదు. …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-12 Read More »

స్మైల్ ప్లీజ్‍… ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే

ఫొటో.. మాటలకందని ఓ  దృశ్య కావ్యం.. ప్రేమగా లాలిస్తుంది.. హాయిగా నవ్విస్తుంది.. కోపంగా కసురుకుంటుంది.. కంటతడి కూడా పెట్టిస్తుంది..ఫ్రాన్స్కు చెందిన లూయీస్‍ జాక్వేస్‍ మాండే డాగ్వేర్‍ 1837లోనే తొలిసారి డాగ్వేరియన్‍ ఫొటోగ్రఫీ విధానానికి రూపకల్పన చేశారు. రెండేళ్ల తర్వాత 1839 జనవరి 9న ఫ్రెంచ్‍ అకాడమీ ఆఫ్‍ సైన్స్ ఈ విధానాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వందేళ్ల తర్వాత ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం డాగ్వేర్‍ ఫొటోగ్రఫీ పేటెంట్లను కొనుగోలు చేసింది. ప్రజలందరికీ ఈ విధానం ఉచితంగా …

స్మైల్ ప్లీజ్‍… ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డే Read More »