కొలాము గిరిజనుల పెండ్లి – పాటలు
కొలాం సంప్రదాయ వివాహంలో కొన్ని ఆచారాలు ప్రత్యేకంగా ఉంటాయి. కొలాం వివాహ వ్యవస్థలో వరకట్నం అనేది ఉండదు. వరుడు గృహం వద్దనే వివాహం జరుగుతుంది. వివాహానికి అనేక దూర ప్రాంతాల వారిని ఆహ్వానించుతారు. ఆహ్వాన ఆనవాలుగా పసుపుతో కలిపిన జొన్న ధాన్యాలను తలూవల్ (అక్షింతలు)గా వారికి అందజేస్తారు.ఊరిలో కళ్యాణ మండపం నిర్మించడానికి గ్రామంలోని ప్రజలందరు సహకరిస్తారు. అడవి నుండి వెదురు (బొంగులు) పెళ్ళిపందిరి నిర్మాణానికి తీసుకొని వస్తారు.కళ్యాణానికి వచ్చే బంధువుల, చుట్టాల కోసం, భోజనం చేయడానికి, మోదుగు …