మహారాజా కిషన్ పర్‍షాద్ దేవుడీ
‘‘షాద్’’ అన్న తఖల్లూస్‍తో (కలంపేరు) ఉర్దూ, అరబ్బీ, ఫార్సీ భాషలలో కవిత్వం రాసినది ఎవరో తెలుసా? ఆరవ నిజాంకు దివాన్‍గా పనిచేసిన మహరాజా కిషన్ పర్‍షాద్. ఆయన జాగీరు గ్రామం పేరే షాద్‍నగర్. నగరంలో కిషన్‍భాగ్ దేవాలయం ఆయన కట్టించినదే. ఆయన అధికార నివాసభవనం ‘‘దేవుడీ’’ షాలిబండాలో ఉంది. కరిగిపోయిన కమ్మని కథలకు ప్రతిరూపమే ఆ దేవుడీ. ఆ దివాణం చుట్టూ అల్లుకున్న కమ్మని కథలు ఎన్నెన్నో!వీరు ఖత్రీ కులానికి సంబంధించినవారు. వీరి మాతృభూమి పంజాబ్. వీరు …