కళ్ళెంలో కళ్యాణి చాళుక్యుల కొత్తశాసనం
రాష్ట్రకూటులకాలంలో కొలనుపాక ప్రాంతంలో విరివిగా జైనబసదులు నిర్మాణమైనాయి. రాష్ట్రకూట చక్రవర్తి అమోఘవర్షుని బంధువు, పాణూర వంశానికి చెందిన శంకరగండరస మహామండ లేశ్వరుడిగా కొలనుపాక-20,000లనాడు పాలించేవాడు. శంకర గండరస దిగంబరజైనానికి చెందినవాడు. శంకరగండరస శాసనాలు వేలుపుగొండ (జాఫర్ గడ్), ఆకునూరు, ఇంద్రపాల నగరం, మల్లికార్జునపల్లి, ఆమనగల్లులలో లభించాయి. ఈ స్థలాలలో కొన్నింటిలో జైనబసదు లున్నాయి. ఇతని ఏలుబడిలో కొలనుపాక కేంద్రంగా ఈ ప్రాంతంలో జైనం విస్తరించింది. రాష్ట్రకూటుల తర్వాత పాలకులైన కళ్యాణీ చాళుక్యరాజులలో కొందరు జైనాన్ని అభిమానించారు. పోషించారు …