శాతవాహనుల వారసత్వం – కొండాపూర్
సుప్రసిద్ధ చారిత్రక వారసత్వ స్థలాలెన్నో తెలంగాణలో ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి కొండాపూర్. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వెళ్లే జాతీయ రహదారి మీదుగా సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ ఉన్నది. ఇది చుట్టూ మట్టికోట, మధ్యలో ఒక నగరం ఉన్న చారిత్రక స్థలం. దీని ప్రాధాన్యత గుర్తించిన నిజాం ప్రభుత్వం 1940లో తవ్వకాలు ప్రారంభించింది. ఈ తవ్వకాల్లో ఒక ఇటుక రాతి స్థూపం, రెండు చైత్యాలు, రెండు విహారాలు లభించాయి. రెండు అంతస్తుల భూగృహం కూడా లభించింది. వాటిలో …