May

అవురవాణి (అవిరువాణ్డి) శాసనం

నల్లగొండ జిల్లా, నార్కెట్‍ పల్లి మండలం అవురవాణి గ్రామశాసనం:రాజ్యం : పశ్చిమ(కళ్యాణి)చాళుక్యులురాజుః త్రిభువనమల్ల విక్రమాదిత్యుడుశాసన కాలం: శక సం.1016, క్రీ.శ.1094 సం.సూర్యగ్రహణ సమయంశాసన లిపి: తెలుగు,శాసనభాష: తెలుగుశాసనోద్దేశం: సామంతరాజు, మహామండలేశ్వరుడుః మల్లయరాజులు దానశాసనంఅవురవాణి గ్రామం తూర్పు శివారు, కల్వర్టు దగ్గరలో 9 అంగుళాల వెడల్పు, 9అడుగుల ఎత్తైన నల్లశానపు రాతిస్తంభం శాసనపాఠం:మొదటివైపుః(శాసనప్రారంభంలో శివలింగం, సూర్యచంద్రులు, ఆవు, దూడల బొమ్మలున్నాయి.)స్వస్తి సమధిగత ప0చమహాశబ్ద మహా మణ్డలేశ్వర…………………………….చాళెక్యాభజిరణ సుజనమనోరంజనం శత్రుమళభంజన దినానాత మనోభివాంచృనఃవరాహలాంఛన నుమాది సమస్త ప్రశస్తిసహితం శ్రీమన్మహామణ్డలేశ్వరజిమల్లయరాజులుజిసక వర్ష …

అవురవాణి (అవిరువాణ్డి) శాసనం Read More »

ఇంటికాడ పిలజెల్ల ఎట్ల ఉండ్రోనని ఎక్కిళ్లుబెట్టిన పదాలు దేశదేశాలను కదిలించిన ఆదేశ్‍ రవి అక్షరాలు

ఎవరీ ఆదేశ్‍ రవి? ఎక్కడో విన్నట్టు, ఇంకెక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదు. అవును మీ అనుమానం నిజమే. కవిగా, గాయకునిగా, సౌండ్‍ ఇంజనీర్‍గా, సినీ సంగీత దర్శకునిగా, మాటల రచయితగా, నటుడిగా, సహదర్శకుడిగా సినిమాకు సంబంధించి అనేక విభాగాలో అవసరానికి అనుగుణంగా ఆయా పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయగల దిట్ట. పదిమందిని మెప్పించే సామర్థ్యం కలిగినవాడు. ప్రస్తుత ‘కరోనా’ పరిస్థితులలో వలసకూలీల వెతలను గానం చేసిన ఆదేశ్‍ రవి ఒక్కసారిగా అందరిదృష్టిని ఆకర్శించిండు. రవి తండ్రి పేరెన్నికగన్న …

ఇంటికాడ పిలజెల్ల ఎట్ల ఉండ్రోనని ఎక్కిళ్లుబెట్టిన పదాలు దేశదేశాలను కదిలించిన ఆదేశ్‍ రవి అక్షరాలు Read More »

ప్రపంచం ముంగిట సరికొత్త సవాలు… కరోనా వైరస్‍…!!!

ఏవైనా రెండు దేశాల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ప్రపంచమంతా రెండు సమూహాలుగా విడిపోయి ప్రపంచ యుద్ధాలు జరిగిన సంగతి మనందరికీ తెలుసు. కానీ కంటికి కనిపించని కరోనా వైరస్‍ అనే సూక్ష్మక్రిమిపై ప్రపంచంలోని దేశాలన్నీ తమ మధ్య నున్న బేధాభిప్రాయాలను విడనాడి కలిసికట్టుగా యుద్ధం చేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నామని చెప్పవచ్చు. గతకొన్ని మాసాలుగా భూమండలంలోని మానవాళికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘కరోనావైరస్‍ సృష్టించిన భీభత్సం వర్ణనాతీతం. ప్రపంచంలో అగ్రరాజ్యంగా భాసిల్లుత్తున్న అమెరికా సైతం …

ప్రపంచం ముంగిట సరికొత్త సవాలు… కరోనా వైరస్‍…!!! Read More »

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం

‘‘ఆకలి వేయడం, తినాలని అనిపించడం రెండూ వేరు వేరు’’ అన్నారు డా.ఎన్‍.ఆర్‍.రావుగారు, కర్నూలు మెడికల్‍ కాలేజీ, విశ్రాంత సూపరింటెండెంటు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి, ఒక ప్రసంగంలో. మెదడులో ‘ఆహారం తీసుకోవాలి’ అనే ఒక ఇష్టాన్ని కలుగచేసే కేంద్రం ఉంటుంది. దానినే ఎపెటైట్‍ సెంటర్‍ అంటారు. మానసికంగా అలజడి, క్రుంగుబాటు, కలత, ఒత్తిడి ఇవన్నీ ఆ వ్యక్తి ఆహారం తీసుకునే కోరికపై ప్రభావం చూపిస్తాయి. ఇవేకాక అత్యంత ప్రధమ దశలో ఉన్న కేన్సర్‍ నుంచి ఉత్పన్నమయే కొన్ని మూలకాల …

ఆరోగ్యాన్నిచ్చే ఆహారం Read More »

వాతావరణ మార్పులు – వైద్య రంగం

దేశంలో అందరికీ ఆరోగ్యం అందించాలంటే, సమస్యను పరిష్కరించడంలో చీకట్లో బాణాలు వేయడం మానాలి. అన్ని రకాల వైద్యవిధానాల సాయంతో దేశ ఆరోగ్యవ్యవస్థను బలోపేతం చేసుకోవాలి. ఇందుకు డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది సహాయం తీసుకోవాలి అంటూ ప్రభుత్వ కర్తవ్యాన్ని వివరిస్తున్నారు సామాజికోద్యమ కార్యకర్త ప్రొఫెసర్‍ డాక్టర్‍ కె. సత్యలక్ష్మి ప్రతీ రోగానికీ ఓ మందు ఉంటుందనేది పాత నానుడి. అరకొర పరిశోధనలు, వ్యాధిని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల రోగాన్ని వెంటాడి వేటాడి గుర్తించడం… దాన్ని హతమార్చడం చేస్తున్నాం. మరి …

వాతావరణ మార్పులు – వైద్య రంగం Read More »

అడవి బిడ్డల అస్తిత్వ పోరు

అమెజాన్‍ ప్రాంతంలో కరోనా నుంచి పెద్దల్ని కాపాడుకునే తాపత్రయం కరోనా మహమ్మారి.. లాటిన్‍ అమెరికాలోని ఆటవిక తెగలకు అస్తిత్వ పోరు తెచ్చింది. అబేధ్యమైన అమెజాన్‍ అడవిలో కల్లోలం సృష్టిస్తోంది. వైరస్‍ నుంచి తప్పించుకొనేందుకు వారు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకొంటున్నారు. తెగల్లోని వృద్ధులను కాపాడుకోవడం ఇప్పుడు కీలకంగా మారింది. లాటిన్‍ అమెరికాలో అటవీ తెగల జనాభా 4.2 కోట్లు. అక్కడి జనాభాలో ఇది 8 శాతం. ఇప్పటికే చట్టవ్యతిరేకంగా జరుగుతున్న మైనింగ్‍, చమురు వెలికితీత, అడవుల నరికివేత …

అడవి బిడ్డల అస్తిత్వ పోరు Read More »

దివ్యాస్త్రం టీకా తయారీలో నిమగ్నమైన భారత్‍ ప్రపంచ దేశాల్లోనూ విస్తృత పరిశోధనలు

కరోనాకు అంతం ఎక్కడ?ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న.దీనికి దీటైన సమాధానం.. టీకా(వ్యాక్సిన్‍).అంతిమంగా మహమ్మారిని జయించే దివ్యాస్త్రం ఇదే.మరి ఈ టీకా ఎప్పుడొస్తుంది? ఎంతకాలం పడుతుంది?ఆధునిక శాస్త్ర ప్రపంచం చేస్తున్న కృషి ఏమిటి?ఇవన్నీ కోట్లాది ప్రజల్లో ఆశలను, ఉత్సుకతను రేపుతున్న అంశాలు. కరోనాకు టీకాను కనిపెట్టడం, అందుబాటులోకి తేవడం వెనుక కథేమిటో, కృషేమిటో చూద్దాం..భారత్‍ సహా ప్రపంచ దేశాల దృష్టంతా ఇప్పుడు కొవిడ్‍-19 టీకా తయారీపైనే ఉంది. 40కి పైగా పరిశోధనలు సాగు తున్నాయి. నిపుణులు, శాస్త్రవేత్త …

దివ్యాస్త్రం టీకా తయారీలో నిమగ్నమైన భారత్‍ ప్రపంచ దేశాల్లోనూ విస్తృత పరిశోధనలు Read More »

కరోనా ప్రపంచవ్యాప్తంగా పరిణమించిన ఉపద్రవం

తడకమళ్ల వివేక్‍ రిటైర్డ్ టీఎస్‍పీఎస్సీ మెంబర్‍ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ తడకమళ్ల వివేక్‍ జనరల్‍ అడ్మినిస్ట్రేషన్‍ డిపార్ట్మెంట్‍ యొక్క విజిలెన్స్ విభాగంలో సుమారు ఒక దశాబ్దం పాటు పనిచేశారు. వాణిజ్య పన్నుల విభాగంలో అదనపు కమిషనర్‍ హోదాకు ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పరోక్ష పన్ను సంస్కరణలో భాగంగా కొత్త పన్ను పాలన, వ్యాట్‍ రూపకల్పన, ప్రవేశపెట్టడంలో, అడ్వాన్స్ రూలింగ్‍ వంటి పన్ను పరిపాలనలో కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడంలో వీరు కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఖజానాకు, …

కరోనా ప్రపంచవ్యాప్తంగా పరిణమించిన ఉపద్రవం Read More »

భారతీయ సాంప్రదాయ చిత్రకారిణి.. చిలువేరు ఉదయ లక్ష్మి

తన అద్భుతమైన పెయింటింగ్‍తో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఆర్టిస్టు చిలువేరు ఉదయలక్ష్మి.  విద్యాభ్యాసం : మాస్టర్‍ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్ (ఎంఎఫ్‍ఏ) పెయింటింగ్‍. సరోజిని నాయుడు స్కూల్‍ ఆఫ్‍ పెర్పామింగ్‍ ఆర్టస్, ఫైన్‍ ఆర్టస్ అండ్‍ కమ్యూనికేషన్‍, యూనివర్సిటీ ఆఫ్‍ హైద్రాబాద్‍, 2000- 2002 బాచిలర్‍ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్ (పెయింటింగ్‍). శ్రీ వెంకటేశ్వర కాలేజీ ఆఫ్‍ ఫైన్‍ ఆర్టస్, ఉస్మానియా యూనివర్సిటీ, 1994- 99. ఎగ్జిబిషన్స్  గ్రూప్‍ ఎగ్జిబిషన్స్ నవదేవ్‍ 2017, అలయన్స్ ప్రాన్సెస్‍, …

భారతీయ సాంప్రదాయ చిత్రకారిణి.. చిలువేరు ఉదయ లక్ష్మి Read More »

హైదరాబాదీలతో ఆకు, వక్కలా కలిసిపోయిన తమిళులు

బ్రిటీష్‍వాళ్లు సికింద్రాబాద్‍లో కంటోన్మెంట్‍ (మిలటరీబేస్‍) ఏర్పాటు చేయడంతో మద్రాస్‍ నుంచి బ్రిటీష్‍ వాళ్లతో తమిళులు కూడా హైదరాబాద్‍కు మకాం మార్చారు. రక్షణరంగ పరిశ్రమ, రైల్వే డిపార్టుమెంట్‍లో చేరేందుకు ఎక్కువ సంఖ్యలోనే తమిళులు ఇక్కడికి వచ్చారు. అ మాట కొస్తే కొండవీటి రెడ్డిరాజులు శైవులైనందున వీరి శత్రువైన రాచకొండ వెలమదొరలు వైష్ణవాన్ని స్వీకరించి ఎంతోమంది వైష్ణవ అయ్యంగార్లను రప్పించి, దేవాలయాల్లో పూజారులుగా నియమిండంతో క్రీ.శ.14 శతాబ్దంలోనే తమిళ బ్రాహ్మణులు తెలంగాణకు వలస వచ్చారు. బ్రిటీష్‍ వారితో పాటు వలస …

హైదరాబాదీలతో ఆకు, వక్కలా కలిసిపోయిన తమిళులు Read More »