Uncategorized

ఒక్కొక్క రాయీ కూలుతుంది! ఆ గుడి నేడో రేపో నేల రాలబోతుంది!!

అవును ఆ గుడి రాళ్లు ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. పట్టించుకునేవారు లేక మూకుమ్మడిగా కూడబలుక్కొని మొత్తం నేల రాలబోతున్నాయి. వారసత్వ ప్రేమికులు ముక్కున వేలేసుకునేట్లు ఒకప్పటి చరిత్ర చెరిగి పోవటానికి కారణ మౌతున్నాయి. ఆ ఆలయం లోపల శివుడుండేవాడు. ఆయన భద్రత కోసం ద్వార శాఖలపై నిరంతర నిఘాతో పాలకులు కూడా ఉండేవారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలుగొందటానికి దాతల ద్వారా కానుకల రూపంలో కాసుల వర్షం కురిపించిన పై గడపపై ఉన్న గజలక్ష్మి మౌనముద్ర దాల్చింది. అభిషేక …

ఒక్కొక్క రాయీ కూలుతుంది! ఆ గుడి నేడో రేపో నేల రాలబోతుంది!! Read More »

భారత్‍ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం ఏ ఎంఐఆర్‍వీ టెక్నాలజీ..!!

మహా భారతంలో అర్జునుడు రెండు చేతులతో బాణాలు ప్రయోగించి శత్రు సైన్యంపై అరవీర భయంకరంగా విరుచుకు పడేవారని, అందుకే అతనిని సవ్యసాచి అని పిలుస్తారని మనం పుస్తకాలలో చదివే ఉంటాం. అంటే అర్జునుడు ఏకకాలంలో రెండు లక్ష్యాలపై బాణాలతో దాడిచేసేవారన్నమాట. దీనిని నేర్పరితనంతో కూడిన యుద్ధకళగా, ఆనాటి పరిస్థితులకు అది ఎంతో గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. అది వాస్తం కూడా! అయితే ఏక కాలంలో, శత్రువు ఏం జరుగుతుందో గుర్తించే లోపే బహుళ లక్ష్యాలపై క్షిపణులతో …

భారత్‍ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం ఏ ఎంఐఆర్‍వీ టెక్నాలజీ..!! Read More »

పారిశ్రామిక నాగరికత – పర్యావరణ దృష్టి

ప్రకృతికీ, మానవులకూ మధ్య సహజంగా జరిగే జీవరసాయన క్రియలో ఒక పెద్ద అగాధం ఏర్పడిందని, అది నానాటికీ మరింత విస్తరిస్తూన్నదని ప్రకృతి శాస్త్రవేత్తలో, పర్యావరణవేత్తలో లేక పర్యావరణ సామాజిక శాస్త్రవేత్తలో చెప్పా రనుకోండి. మనమేమీ పెద్దగా పట్టించుకోం. ప్రతిస్పందించం. మన నిత్యావసరాల గొడవ లేనంతవరకూ మనకేమీ ఇటువంటి విషయాల పట్ల పెద్ద ఆసక్తి ఏమీ కలగదు. అదే ఒక్కరోజు రెండు గంటలపాటు కరెంటు లేకపోయినా, రెండు బిందెల మంచినీళ్లు అందకపోయినా ప్రపంచం తల్లకిందులై పోయిందని గగ్గోలు పెడతాం. …

పారిశ్రామిక నాగరికత – పర్యావరణ దృష్టి Read More »

దక్షిణ భారతంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

దక్షిణ భారతంలో ఇప్పటి వరకు జియోలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా ప్రతిపాదన మేరకు, కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటిని జయోలాజికల్‍ మాన్యుమెంట్స్గా డిక్లేర్‍ చేయడం జరిగింది. అలాంటి స్థలాలు పదిహేను (15) ఉన్నవి. ఆంధప్రదేశ్‍లో అయిదు (5), కర్నాటకలో నాలుగు (4), తమిళ నాడులో మూడు (3) మరియు కేరళలో మూడు (3) కలవు. ఈ సంచికలో ఆంధప్రదేశ్‍లోని జియోలాజికల్‍ మాన్యుమెంట్స్ గురించి చర్చించుకుందాము.ఆంధప్రదేశ్‍లోని అయిదు సైట్స్ యొక్క వివరణ ఒకొక్కటిగా క్రింద ఇవ్వబడినది. 1) నేచురల్‍ …

దక్షిణ భారతంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు Read More »

క్యాన్సర్‍ భూతం

కుర్మయ్య: అమ్మా! నీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. పదా! ఆసుపత్రికి వెళ్లి చూపించుకుందాం.తల్లి: వద్దు బిడ్డా! ఇప్పటికే మస్తు ఆస్పిటల్లకు తిరిగినా. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గుతలేదు. నేను రాను బిడ్డా!కుర్మయ్య: లేదమ్మా! నామాట విను! పాలమూరులో మంచి డాక్టర్‍ వున్నడు. సూపించుకుని వద్దాం . ఇదొక్క సారి నా మాట వినమ్మా!తల్లి: సరే బిడ్డా! పోదాం పదా ఈ మాయదారి రోగమేందో నన్ను సంపుతోందికుర్మయ్య: అమ్మా! పాత రిపోర్టులన్నీ తీసుకోతల్లి: తీసుకున్న బిడ్డా!కుర్మయ్య: డాక్టర్‍ గారూ! …

క్యాన్సర్‍ భూతం Read More »

లక్క గాజులకు ‘జీఐ’(GI) నగిషీ

హైదరాబాద్‍ నగరానికి మరో గుర్తింపు దక్కింది. పాతబస్తీలోని లక్క గాజులకు జియోగ్రాఫికల్‍ ఇండికేషన్‍ (Geographical Indication) గుర్తింపు లభించింది. ఇదివరకే హైదరాబాద్‍ హలీమ్‍కు జీఐ ట్యాగ్‍ దక్కగా.. తాజాగా లక్క గాజులు ఆ జాబితాలో చేరాయి. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చార్మినార్‍ లాడ్‍బజార్‍ లాక్‍ గాజులను తెలుగులో లక్క రాళ్ల గాజులుగా పిలుస్తుంటారు. తాజాగా ఈ లక్క గాజులకు చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ GI Registration Tagను ప్రకటించింది. తెలంగాణలో జీఐ ట్యాగ్‍ అందుకున్న 17వ ఉత్పత్తి …

లక్క గాజులకు ‘జీఐ’(GI) నగిషీ Read More »

ఖజురహో కట్టడాలు

ఉనికి: మధ్యప్రదేశ్‍ UNESCO SITE – 1986గుర్తింపు: 1986విభాగం: సాంస్క•తికం (MOUNUMENT) ఖజురహోలోని దేవాలయాలు చండేలా రాజవంశం పాలనలో నిర్మించబడ్డాయి. అవి మూడు విభిన్న సమూహాలుగా విభజించబడ్డాయి. ఇవి రెండు వేర్వేరు మతాలకు చెందినవి. ఒకటి హిందూ మతం, మరొ కటి జైన మతం. వాస్తుశిల్పం, శిల్పకళల మధ్య సంపూర్ణ సమతుల్యతతో, అన్ని ఆలయఉపరితలాలు బాగా చెక్కబడ్డాయి. ఆరాధనలు, వంశం, చిన్నచిన్న దేవతలు, సన్నిహిత జంటలను చెక్కారు. ఇవన్నీ పవిత్ర విశ్వాస వ్యవస్థను ప్రతిబింబిస్తాయి. అత్యంత నిపుణులైన …

ఖజురహో కట్టడాలు Read More »

రామగిరి కథ

తెలంగాణ రాష్ట్రం పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి దగ్గరగా రామగిరిఖిల్లాగా పిలువబడేదే రామగిరి దుర్గం. ఈ కోట రామగిరి గుట్టలమీద నిర్మాణమైంది. వనౌషధులకు ప్రసిద్ధమైన దట్టమైన అడవి విస్తరించిన ప్రదేశంలోనే దుర్గం కట్టబడ్డది. వివిధ మూలికాజాతులకు చెందిన మొక్కలతో సంపన్నమైంది. ఈ కోట నుంచి చూస్తే మానేరు, గోదావరి నదుల సంగమం కనిపిస్తుంది. రామగిరిని తరుచుగా రత్నగిరి, రత్నగర్భ అంటుంటారు. రామగిరి భౌగోళిక స్థితి:రామగిరి కొండ భౌగోళికంగా 790025-790028 డిగ్రీల తూర్పు రేఖాంశాలు, 180034-180038 …

రామగిరి కథ Read More »

కొల్లేటి జాడలు నవల – పర్యావరణ వివేచన

“If all mankind were to disappear, the world would regenerate back to the rich state of equilibrium that existed ten thousand years ago. If insects were to vanish, the environment would collapse into chaos.” – E. O. Wilson మానవ జాతి అంతా కనుమరుగైతే, ఈ ప్రపంచం పదివేలయేళ్లనాటి సమతుల్యతతో గొప్ప పునరుజ్జీవనం పొందుతుంది. కీటక జాతులు నాశనమైతే, పర్యావరణమంతా సంకటస్థితిలోకి కుంగిపోతుంది-జీవావరణ …

కొల్లేటి జాడలు నవల – పర్యావరణ వివేచన Read More »

భారీ జలాశయాలపై మరో 800 మె.వా సోలార్‍ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహం

రాజస్థాన్‍లో 500 మెగావాట్ల సోలార్‍ ప్లాంటుకు ప్రాజెక్ట్ రిపోర్ట్కు ఆదేశంమరింత తక్కువ ధరలో విద్యుత్‍ ఉత్పత్తికి క•షి చేయాలిరాష్ట్రంలో పవన విద్యుత్తు ప్లాంట్‍ల ఏర్పాటుకు పరిశీలనసింగరేణి సంస్థ చైర్మన్‍ మరియు ఎండి ఎన్‍.బలరామ్‍ ఇప్పటికే కంపెనీ వ్యాప్తంగా 234 మెగావాట్ల సోలార్‍ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సింగరేణి సంస్థ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో భారీ జలాశయాలపై సుమారు 800 మెగా వాట్ల సోలార్‍ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉందని సింగరేణి చైర్మన్‍ మరియు ఎండి …

భారీ జలాశయాలపై మరో 800 మె.వా సోలార్‍ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి సన్నాహం Read More »