Uncategorized

మంచి పని

‘‘రాణక్కా! రోజూ ఒక మంచిపనయినా చెయ్యాలని మా టీచరు చెప్పారు’’ అన్నాను పాలుతాగుతూ.‘‘ఒక ముసలతన్ని రోడ్డు దాటించిన పిల్లాడి కథను మీ టీచర్‍ ముందుగా చెప్పారు కదా!’’ అని అడిగింది రాణక్క. అక్కకి పాలలో మీగడ గొంతు దిగదు. అందుకే పాలమీద తేలిన మీగడను తీసేయటంలో మునిగి ఉంది.‘‘నీకెలా తెలుసు?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘మా టీచర్‍ కూడా చెప్పారులే. ఒక మంచిపనిచేసి, దాని గురించి రాసి చూపించమన్నారు’’‘‘అయితే ఈ రోజే ఇప్పుడే మొదలు పెడదామా’’ పాలుతాగేసి ఉత్సాహంగా అన్నాను.‘ఊ’ …

మంచి పని Read More »

కళావరు రెండు

గుహనిండా చెల్లా చెదరుగా పడి ఉన్న రాళ్ళ మధ్య వాళ్లు నలుగురూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నించున్నారు. గుహ బయట ఉన్న రాళ్ళు, రప్పలు, తుప్పలు, ఆకుపచ్చని వెలుగులో తళ తళలాడిపోతున్నాయి. ఆ రాళ్ళ మధ్య వాళ్ళు వచ్చిన అంతరిక్ష నౌక ‘పినాకిని’ నిశ్చలంగా ఉంది. గుహ బయట వాళ్ళకు ఎదురుగా పర్వతంలా ఉన్న ఒక భయంకరమైన జంతువు నిలబడి ఉంది. ఆ జంతువు పెద్ద లోహపు ముద్దలా ఉంది. దాని వీపు నిండా ఉన్న ముళ్ళు …

కళావరు రెండు Read More »

యయాతికల

నక్షత్రనౌక అశ్వని తన కక్ష్యలోంచి కిందికి జారింది. దానికి అమర్చిన రాకెట్లు సజావుగా పేలాయి. అశ్వని మెల్లిగా కిందికి దిగుతూ ఉపరితలానికి దగ్గరగా వస్తోంది.అశ్వనిని నడుపుతున్నది కెప్టెన్‍ యయాతి. అతనికి నక్షత్ర నౌకలు నడపడం కొత్తకాదు. ఎన్నో వందలసార్లు నడిపి ఉంటాడు. అసలు అతను కళ్ళు మూసుకుని దానిని కిందికి దింపగలడు. ఆ నౌకలో పదిహేను వందల మది ప్రయాణీకులు ఉన్నారు. వాళ్ళంతా రోహిణి నక్షత్రం మీద స్థిరపడటానికి వలస వస్తున్నారు. ఇప్పటికే రోహిణి మీద యాభైవేల …

యయాతికల Read More »

బెస్తవాడు నీటిదయ్యం

చైనా దేశంలో ఒక పల్లెటూరు ఉండేది. ఆ ఊరి చుట్టూ ఒకనది ప్రవహిస్తూ ఉండేది. ఆ నదిలో ఒక నీటి దయ్యం ఉండేది. ఆ దయ్యం ఏ మనిషి నయినా నదిలోకి లాగి చంపితేచాలు. దాని దయ్యం బతుకు ఆ మనిషికి వస్తుంది. అదేమో మళ్లీ మనిషిగా పుడుతుంది. అయితే ఆ ఊరు మరీ గొడ్డు పల్లెటూరు కావడం వల్ల పొరుగూరు వారెవ్వరికీ ఆ ఊరికి వచ్చే అవసరమే ఉండేది కాదు. ఇహ ఆ ఊరివారు ఎన్నడయినా …

బెస్తవాడు నీటిదయ్యం Read More »

వికసించిన నూరు పూలు

నూరు పూలు వికసించనీ, వేయి భావాలు పరిమళించనీ..ది నూరవ సంచిక. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో సెప్టెంబర్2012లో తొలి సంచిక వెలువడింది. ఒక సామాజిక రాజకీయ మాసపత్రికగా దక్కన్ లాండ్ నిరాటంకంగా నూరు సంచికలు వెలువడటం సంతోషదాయకం. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలకు అందుబాటులో లేని తెలంగాణ ప్రాచీన చరిత్ర, వారసత్వ సంపద, భాష-సాహిత్యం- జానపద కళారూపాలతో కూడిన సాంస్కృతిక వైభవం, పోరాట తెగువ వంటి తరతరాల మౌలిక సంపదతో పాటు, సమైక్య పాలకుల అధిపత్యవిధానాలు, వివక్షత, నీరు, నిధులు, నియామకాలు వంటి ప్రాధాన్యతా …

వికసించిన నూరు పూలు Read More »

వేముల పెరుమాళ్ళు

ఇంటికి వాకిలి సాక్షి అన్నట్టు ఈ తెలుగింటికి, ఈ తెలంగాణ ఇంటికి వాకిలి లాంటి వాడు వేముల పెరుమాళ్ళు. తెలుగు భాషా సంస్కృతుల గూర్చి, తెలుగు జీవనానికి సంబంధించిన జాతీయాల గూర్చి వేముల పెరుమాళ్ళు ఒక జీవిత కాలపు కృషి చేశారు. అయితే ఆ కృషి గురించి తెలుగు సాహితీ లోకంలో జరగాల్సినంత చర్చ జరగకపోవడం విచారకరం. పెరుమాళ్ళు మాటల్లోనే చెప్పాలంటే మన సాహిత్య చర్చలన్నీ ‘ఉత్తుత్తి పుట్నాలు – మూడు మూడు కుప్పలన్నట్లుగా సాగుతున్నాయి’. మంచి మనిషిగా, నిగర్విగా …

వేముల పెరుమాళ్ళు Read More »

ప్రణయ – చరిత్రకు పట్టం

తెలుగునాట ఎంతోమంది సాహితీవేత్తలు తమ ఇంటి పేరు తోనే ప్రసిద్ధులు. ఆ రచయితలు సీమాంధ్ర ప్రాంతం వారైనా వారి ఇంటిపేర్లున్న ఊళ్లు తెలంగాణలో ఉన్నాయి. వాళ్లు కూడా తమకు తెలంగాణాతో అనుబంధమేదో ఉన్నదనే భావించారు. ముఖ్యంగా బ్రాహ్మణులు తాము పౌరోహిత్యం చేస్తున్న/ నివసిస్తున్న ఊరిపేర్లనే ఇంటిపేరుగా స్థిరపరచుకున్నారు. అట్లాంటి వారిలో రాచకొండ విశ్వనాథశాస్త్రి, కందుకూరు వీరేశలింగం, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ముదిగొండ వీరభద్రమూర్తి, ఆదిభట్ల నారాయణ దాసు, తెలకపల్లి రవి ఇట్లా కొన్ని వందలమంది పండితులు, రచయితలున్నారు. ఇంకా చెప్పాలంటే వారందరికీ …

ప్రణయ – చరిత్రకు పట్టం Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-4 బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని కొల్లాపురం రాగిరేకు శాసనం(క్రీ.శ.672)

కొల్లాపురం. మళ్లీ అలంపురం తరువాత నేను జీవితంలో గుర్తుంచుకోవాల్సిన రెండో తెలంగాణా పట్టణం. అలంపురంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు మహబూబ్‍నగర్‍ జిల్లా, కొల్లాపూర్‍ తాలూకా, జటప్రోలు దేవాలయాలు శ్రీశైలం జలాశయ నీటి ముంపుకు గురౌతున్నందున, వాటిని ఎగువకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొల్లాపురంలో అందుకోసం దేవదాయశాఖ, సబ్‍డివిజన్‍ ఉన్న జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, చిన్నమారూరు దేవాలయాల చిత్రాలు గీసి, రాయి రాయికీ నంబర్లు వేసే పనికి చాలా మంది శిల్పులు కావాలి. గాబట్టి అలంపూరు నుంచి నన్ను కొన్నాళ్లపాటు కొల్లాపూరుకు డిపుటేషన్‍ మీద …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-4 బాదామీ చాళుక్య మొదటి విక్రమాదిత్యుని కొల్లాపురం రాగిరేకు శాసనం(క్రీ.శ.672) Read More »

ముసల్మానుల కన్నా ముందే వెలిసిన ‘పహాడీ షరీఫ్‍ దర్గా’

గణగణగంటలు మ్రోగే గుళ్లు గోపురాలు, అజాలు వినిపించే గుంబజ్‍లు మినార్లు, ఆదివారం ప్రాతఃకాలం ప్రార్థనలతో కళకళలాడే చర్చ్లు, చాపెల్స్లు లేకపోతే ఈ హైద్రాబాద్‍ నగరం ఇంత అందంగా కనబడేదా? హారం ఒకటే కాని అందులోని పువ్వుల రంగులు మాత్రం వేరువేరు.‘‘తూ హిందు బనేగ న / ముసల్మాన్‍ బనేగఇన్సాన్‍ కి ఔలాద్‍ హై / ఇన్సాన్‍ బనేగ’’సరిగ్గా ఈ తత్వాన్నే సూఫీ ఇజం ప్రచారం చేసింది. వైష్ణవ మత ప్రచారానికి ఆళ్వార్లు ఎలాగో, శైవ మత ప్రచారానికి …

ముసల్మానుల కన్నా ముందే వెలిసిన ‘పహాడీ షరీఫ్‍ దర్గా’ Read More »

సమాచార ప్రసార రంగంలో మరో నూతన తరం..5జీ టెక్నాలజీ..!!

(అక్టోబర్‍ సంచిక తరువాయి) 5జీ (భవిష్యత్‍ తరం) :5జీ ప్రస్తుతం మన దేశంలో అభివృద్ధిదశలో ఉంది. అయితే ముందే చెప్పుకున్నట్లు చైనా, దక్షిణ కొరియాలాంటి దేశాలు ఇప్పటికే 5జీ టెక్నాలజీని ప్రవేశపెట్టాయి. 4జీతో పోలిస్తే, 5జీ చాలా మెరుగైనది మరియు వినియోగదారులకు మరింత వేగవంతంగా సేవలు అందించగలదని సాంకేతిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నో ప్రత్యేకతలు :4జీ తో పోలిస్తే 5జీ లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వేగం విషయానికొస్తే 5జీ వేగం, 4జీ కన్నా 35 రెట్లు …

సమాచార ప్రసార రంగంలో మరో నూతన తరం..5జీ టెక్నాలజీ..!! Read More »