ప్రకృతితో చెలిమి చేద్దాం…
ఒకే విషయాన్ని పదేపదే మాట్లాడుకోవాల్సిరావడం అనివార్యమవుతున్నది. మనిషి మనుగడకు మూలమైన మౌలిక అంశాల ప్రస్తావన-చర్చ అధిక ప్రాధాన్యత సంతరించుకుంటున్నది.ఒకటిన్నర సంవత్సరాలుగా మనల్ని భయకంపితుల్ని చేస్తున్న కరోనా నేపథ్యంలో మనల్ని మనం మరోసారి సమీక్షించుకోవాలి. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమితో సమ్మిళితమైనదే ప్రకృతి. ఈ ప్రకృతి ఆవరణలో కోట్లాది సంవత్సరాలుగా, అనేక కోట్ల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయి. అందులో మానవజాతి కూడా ఒకటి. ఈ జీవజాతులకు ప్రకృతితో వుండే సమతుల్యతే జీవ వైవిధ్యం. అన్ని జీవజాతులు తమ …