Day: February 1, 2024

నిర్మాణాత్మక అభివృద్ధికి నిజాయితీ, నిబద్ధత కలిగిన నిర్దిష్టమైన ప్రణాళికలు అవసరం

మానవ సమాజం మౌలికంగా ఒక్కటే అయినప్పటికీ భౌగోళిక, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్క•తిక, ప్రాకృతిక వనరులలో విభిన్నతల వల్ల వైరుధ్యాలతో కూడిన, వైవిధ్యంతో కూడిన సంకలితగా ఉంటుంది. ఆ ప్రయోజనాలను తీర్చగలిగిన అభివృద్ధి విధానాల రూపకల్పన లోనూ ఈ విభిన్నత ప్రధాన పాత్ర పోషిస్తుంది. సాధ్య, అసాధ్యాలతో నిమిత్తం లేకుండా తాత్కాలిక, ఆకర్షిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చే వివిధ ప్రభుత్వాలు తమ తమ రీతుల్లో అమలుపరిచే ఆర్థిక విధానాలు, పథకాలు ప్రజల సమగ్ర, సమస్త ప్రయోజనాలు నెరవేర్చలేకపోతున్నాయి.దీనివల్ల …

నిర్మాణాత్మక అభివృద్ధికి నిజాయితీ, నిబద్ధత కలిగిన నిర్దిష్టమైన ప్రణాళికలు అవసరం Read More »

పాకాల యశోదారెడ్డి

స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రసిద్ధ కథకురాలు యశోధారెడ్డి. రేడియో ధారావాహిక కార్యక్రమం ద్వారా ‘‘మహాలక్ష్మి ముచ్చట్లు’’ అనే పేరుతో తెలంగాణ భాషను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసిన తొలి రచయిత్రి యశోదా రెడ్డి.తెలంగాణ మూరుమూల గ్రామంలో జన్మించి హైద్రాబాదు నగరానికి వచ్చి, విద్యాభ్యాసం చేసి ఒక యూనివర్శిటీలో ప్రొఫెసర్‍ అవ్వడమనేది ఆనాడు చాలా అసాధారణమైనటువంటి విషయం. ఆమె 1929 ఆగస్టు 8వ తేదీన మహబూబ్‍నగర్‍ జిల్లాలోని మిదినేపల్లి గ్రామంలో జన్మించింది. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది. …

పాకాల యశోదారెడ్డి Read More »

ముల్కీ పుట్టుక చరిత్ర

ఉద్యోగం అనేది వ్యక్తులలో మానసికంగా భద్రతా భావాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, సమాజంలో గుర్తింపును, స్థాయిని సమకూర్చి పెడ్తే అదే నిరుద్యోగం వ్యక్తులలో అభద్రతా భావాన్ని అధైర్యాన్ని, ఆత్మవిశ్వాసం లేకపోవడాన్ని కల్గిస్తుంది. అందుకే ఆధునిక సమాజంలో మనిషికి ఉద్యోగం అనేది క్రమంగా ఓ జీవనాధారంగా పరిణామం చెందింది. ఉద్యోగాల కోసం ప్రతి నిరుద్యోగి ప్రయత్నించడం సహజం. ఉద్యోగాలు లభించిన కుటుంబాలు ఆనందంగా సుఖశాంతులతో ఉంటే నిరుద్యోగుల కుటుంబాలు నిరాశ నిస్ప•హలతో అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతయి. ఉద్యోగం సగటు మనిషి …

ముల్కీ పుట్టుక చరిత్ర Read More »

స్వర్ణసంహిత

మనకు అసలు పరిచయం అవసరం లేని లోహం బంగారం, ఆఫ్రికాలోని అడవి బిడ్డల నుండి అమెరికా లోని స్టాక్‍ మార్కెట్‍ మదుపరుల దాక అందరు కావలనుకునేది ఈ బంగారాన్నే. మానవుడు సంఘజీవిగా మారిన తొలి దశ నుండి నేటి వరకు అన్ని నాగరికతలకు అవసరమైన పదార్ధం ఏదన్నాఉందంటే అది బంగారమే. విలువయిన దాన్ని, అరుదైన వాటిని బంగారం తోటే పోలుస్తారు. నాగరికత తొలిదశ నుండి బులియన్‍ గా ఉపయోగపడి నేటి వరకు అలాగే కొనసాగుతోంది. సాంకేతికత పెరుగుతున్న …

స్వర్ణసంహిత Read More »

భౌతిక శాస్త్రానికి కాంతి పుంజమైన ‘రామన్‍ ఎఫెక్ట్’ ఫిబ్రవరి 28న సైన్స్ దినోత్సవం

సీవీ రామన్‍గా పేరుగాంచిన ప్రముఖ భౌతికశాస్త్రవేత్త చంద్రశేఖర్‍ వెంకటరామన్‍. 1928 ఫిబ్రవరి 28న రామన్‍ ఎఫెక్ట్ను కనుగొనడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. భౌతికశాస్త్రంలో రామన్‍ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్దం ఆ తేదీని జాతీయసైన్స్ దినంగా 1987లో భారత ప్రభుత్వం ప్రకటించంది. భారత్‍ గడ్డపైనే చదువుకుని, తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్లో దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి రామన్‍. ఆధునిక భారతీయ విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను …

భౌతిక శాస్త్రానికి కాంతి పుంజమైన ‘రామన్‍ ఎఫెక్ట్’ ఫిబ్రవరి 28న సైన్స్ దినోత్సవం Read More »

అంధేరిరాత్ కే సితార్

అట్ల ఆనాడు అంటే బచ్‍ 1989 డిసెంబరు 15 రాత్రి మేమందరం ‘బాల్‍బాల్‍ మే బచ్‍ గయే’ అర్థాత్‍! వెంట్రుక వాసిలో ప్రాణాలను గుప్పిట్ల పెట్టుకుని తప్పించుకున్నాం. ఇక ఆ దెబ్బతో మేం చార్‍ సౌ సాల్‍ పురానా షహర్‍ నుండి బేదఖల్‍ఐ స్వంత ఇల్లు వదులుకుని హైద్రాబాద్‍ న్యూ సిటీకి కాందిశీకుల్లా వలస వచ్చాం. అచ్చంగా 1947 దేశ విభజన సమయంలో జరిగిన మానవ వలసల ప్రవాహాలలాగే! × × × ‘‘ఖుష్‍ రహో అహెలె …

అంధేరిరాత్ కే సితార్ Read More »

అపురూప ఆలయాల చంద్రవెల్లి ఆ శిథిలాలను చూడాలి అందరం వెళ్లి

అది తెలంగాణా అపురూప ఆలయాల వెలుంగాణా. ఎక్కడికెళ్లినా అలనాటి శిల్పకళ, వాస్తువిన్యాసాల హేల! ఒక అంచనాప్రకారం తెలంగాణాలో చాళుక్యులనుంచి సంస్థానాధీశుల వరకూ దాదాపు 15 వేల ఆలయాలకు పైగానే నిర్మించారు. ఆయా రాజవంశాలు పోటీపడి, సాటిరాని మేటి శైలుల్లో రకరకాల ఆలయాలు, మండపాలను నిర్మించి, తెలంగాణా సంస్క•తిని శాశ్వతంగావించారు. అలాంటి అపురూప ఆలయాల్లో శిథిలాలైనా, సౌందర్య శకలాలుగా నేటికీ నిలిచే ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా, కంబంపల్లి మండలం మంథని ముత్తారం సమీపంలో మానేరు నడిఒడ్డునగల చంద్రెల్లిలో. అది …

అపురూప ఆలయాల చంద్రవెల్లి ఆ శిథిలాలను చూడాలి అందరం వెళ్లి Read More »

పర్యావరణ విషాదాలు – సాహిత్య సంవేదనలు

పర్యావరణ ఉద్యమ చైతన్యం కలిగించిన వారిలో భారతదేశం సర్వోన్నతంగా స్మరించదగినవారు సుందర్‍లాల్‍ బహుగుణ. ఆయన ఒక సందర్భంలో ప్రకృతి, పర్యావరణ సమస్యలు, సంక్షోభాల విషయంగా కవులు, రచయితలు, పాత్రికేయులు, న్యాయవాదులు స్పందించవలసిన అవసరం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణ వాదులు, కార్యకర్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు వారు చేయవలసింది వారు ఎలాగూ చేస్తారు కానీ, తక్కిన వారు ప్రజా బాహుళ్యానికి పర్యావరణ విషయంగా సరైన అవగాహన కల్పించడానికి, సదిశలో జనబాహుళ్యం నడవటానికి కవులు, రచయితలు కృషి చేయాలని ఆశించారు …

పర్యావరణ విషాదాలు – సాహిత్య సంవేదనలు Read More »

రైతు ఆత్మ- రైతుల ఆత్మ -ఒక కొయ్య మరియు తోలు బొమ్మ లాట – లఘు చిత్రం

వర్చువల్‍ ఇంటర్నేషనల్‍ పప్పెట్‍ రెసిడెన్సీ (VIPR)ని కోవిడ్‍ 19 మహమ్మారి సమయంలో యునైటెడ్‍ స్టేట్స్కు చెందిన ప్రఖ్యాత తోలుబొమ్మలాటకారుడు టామ్‍ సర్వర్‍ రూపొందించారు. ఈ వర్చువల్‍ ప్లాట్‍ఫారమ్‍ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తోలుబొమ్మల కోసం నెట్‍వర్క్ చేయడానికి మరియు నిర్దిష్ట సమస్యలు లేదా సవాళ్లు మరియు థీమ్‍లను పరిష్కరించేటప్పుడు వారి తోలుబొమ్మలాట నైపుణ్యాలను ప్రదర్శించడానికి విలువైన అవకాశాన్ని అందించింది. VIPR పప్పీటీర్స్ మీట్‍ సందర్భంగా, నేను నెదర్లాండ్స్కు చెందిన ప్రఖ్యాత పప్పెటీర్‍ వీతీ. ఫార్నస్ హక్కెమర్స్తో పరిచయం అయ్యాను. …

రైతు ఆత్మ- రైతుల ఆత్మ -ఒక కొయ్య మరియు తోలు బొమ్మ లాట – లఘు చిత్రం Read More »

రెండువైపులా పదునైన ఖడ్గం @ డీప్‍ఫేక్‍ టెక్నాలజీ

సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) అన్నది మానవాళిని ఆధునికత వైపు పురోగమింపజేయడంతో పాటు, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్ఠం చేయాలన్న సుప్రీంకోర్ట్ చీఫ్‍ జస్టిస్‍ డీ వీ చంద్రచూడ్‍ మాటలు అక్షర సత్యాలు. సాంకేతిక పరిజ్ఞానం మానవాళి జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. వారు ఎదుర్కొనే ప్రతీ సమస్యకు కూడా క్షణాల్లో పరిష్కారాన్ని సూచించిందనడం కూడా కాదనలేని సత్యం. ఇదంతా నాణేనికి ఒకవైపు కాగా, మరోవైపు అదే సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) దుర్వినియోగ మవుతూ మానవాళిని తిరోగమనం వైపు నెడు…