Day: February 1, 2024

సూర్య ఆరాధన చరిత్రలో విశిష్ట స్థానం సూర్య దేవాలయం, కోణార్క్

ప్రదేశం: ఒడిషా, భారతదేశంప్రకటితం: UNESCO – 1984విభాగం: సాంస్క•తికం (మాన్యుమెంట్‍) బంగాళాఖాతం ఒడ్డున, ఉదయించే సూర్యుని కిరణాలలో స్నానం చేస్తున్నట్లుగా కోణార్క్ లోని ఆలయం ఉంటుంది. సూర్య దేవుడు, సూర్యుని రథం, సింబాలిక్‍ డిజైన్‍లతో అలంకరించబడిన దాని ఇరవై నాలుగు చక్రాలకు ఒక స్మారక చిహ్నంగా ఉంటుంది. ఈ రథానికి ఆరు గుర్రాలుంటాయి. పదమూడవ శతాబ్దంలో నిర్మించబడిన ఇది భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బ్రాహ్మణ ఆలయాలలో ఒకటి. ప్రమాణాలు:ఒక అద్వితీయమైన కళాత్మక కట్టడం. ఆలయం కళాఖండాలకు నిలయం. …

సూర్య ఆరాధన చరిత్రలో విశిష్ట స్థానం సూర్య దేవాలయం, కోణార్క్ Read More »

అనేక యుద్ధముల ఆరితేరినవాడు మా చక్రపాణి

చిన్న పిల్లవాడు, పెద్ద కలలు కనేవాడు. ఆజానుబాహువై అంగలు వేసుకుంటూ ఎదిగిపోయాడు.తమ్ముడిగా ఉండడం మానలేదు, స్నేహితుడిగా ఉండడమూ మానలేదు.మంచిచెడ్డలన్నిటితో మనిషిగా మెలగడమూ మానలేదు. అందుకే అతనంటే నాకు వాత్సల్యం, స్నేహమోహం!ఈ రోజు (జనవరి 31, 2024) అతని ఉద్యోగానికి రిటైర్మెంట్‍ అట. చక్రపాణి పనిజీవితాన్ని, ప్రజాజీవితాన్ని గుర్తు చేసుకుని పండగ చేసుకోవడానికి ఈ రోజు ఒక అవకాశం. రేపటి నుంచి కూడా అతను పనిమంతుడే. విశ్లేషణలతో విప్పిచెప్పే ఆచార్యుడే.చక్రపాణి అనే ప్రవర్థమానుడు డాక్టర్‍ అయినప్పుడు, ముచ్చటపడి, ఇరవై …

అనేక యుద్ధముల ఆరితేరినవాడు మా చక్రపాణి Read More »

ముడుమాల నిలువురాళ్ళ అధ్యయనం

గత సంచికలో మనం ముడుమాల నిలువురాళ్ళ ప్రాముఖ్యాన్ని గురించి అక్కడ రాళ్ళపై చెక్కిన సప్తర్షి మండలం, సింహారాశి, ధృవ నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ముడుమాల నిలువురాళ్ళ అధ్యయనం డిపార్ట్మెంట్‍ ఆఫ్‍ తెలంగాణ, తెలంగాణ స్టేట్‍ మరియు దక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరిశోధన నిరంతరాయంగా సాగు తున్నది. జనవరి నెల 10, 11 తారీఖులలో ముడుమాల నిలువు రాళ్ళ ప్రాంతాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలలోను డ్రోను సాయంతో నిశిత పరిశోధన, చిత్రీకరణ, శాస్త్రీయ పద్ధతిలో చేపట్టడం …

ముడుమాల నిలువురాళ్ళ అధ్యయనం Read More »

ది బిల్‍ ఈస్‍ పాస్డ్

2024 ఫిబ్రవరికి తెలంగాణ బిల్లు పార్లమెంట్‍ ఉభయ సభల ఆమోదం పొంది ఒక దశాబ్ద కాలం గడచింది. ఉభయ సభల ఆమోదం అనంతరం బిల్లు రాష్ట్రపతి ఆమోదానికి వెళ్ళింది. మార్చ్ 1న రాష్ట్రపతి ఆమోదం తర్వాత 2014 మార్చి 4న భారత ప్రభుత్వం రాజపత్రం జారీ చేసింది. 2014 జూన్‍ 2న తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వస్తుందని భారత ప్రభుత్వం ఆ రాజపత్రంలో ప్రకటించింది. 2014 ఫిబ్రవరిలో భారత పార్లమెంట్‍ ఉభయ సభల్లో జరిగిన పరిణామాలను ఒకసారి …

ది బిల్‍ ఈస్‍ పాస్డ్ Read More »

సభ్య సమాజంలో బాలలపై హింస అప్రజాస్వామికం – దండన బోధనా పద్దతి కాదు!

Experience gained in two schools under my control has taught me that punishment does not purify, if anything, it hardens children. – M.K. GandhiThe true character of a society is revealed in how it treats its children. –Nelson Mandela పిల్లలపై హింస ఏ రూపంలో జరిగినా అది వారి మౌలికమైన హక్కును హరించి వేయడమే. పిల్లలు తమ కుటుంబాల నుండి, చుట్టూ …

సభ్య సమాజంలో బాలలపై హింస అప్రజాస్వామికం – దండన బోధనా పద్దతి కాదు! Read More »

తీర్పుల్లో సాహిత్య మెరుపులు

తీర్పులు రాయడం ఓ కళ. అది సైన్స్ కాదు. సాహిత్యంతో తీర్పులకి సంబంధం వుంది. కానీ చాలా మంది న్యాయమూర్తులు ఈ విషయాన్ని గుర్తించరు. చట్టం మాత్రమే తెలిస్తే సరిపోదు. న్యాయమూర్తికి సాహిత్యం తెలియాలి. సాహిత్యంలో జీవితం వుంటుంది. మనుషుల భావోద్వేగాలు వుంటాయి. ఈ విషయాన్ని కొంత మంది న్యాయమూర్తులు గుర్తించారు. అందుకే వాళ్ళు సాహిత్యాన్ని చదువుతూ వుంటారు. తమ తీర్పుల్లో ఉదహరిస్తూ వుంటారు.‘లా’కి సాహిత్యానికి మధ్య వున్న పరస్పర సంబంధాన్ని 2000 సంవత్సరాల క్రితమే గ్రీకు …

తీర్పుల్లో సాహిత్య మెరుపులు Read More »

కోట్ల నరసింహుల పల్లె – నరసింహస్వామి

నవనారసింహులు నరసింహస్వామి అవతారంలో విశిష్ట ఆరాధనారూపాలు. ఉగ్రనరసింహ క్రోధ నరసింహ మాలోల నరసింహ జ్వాలా నరసింహ వరాహ నరసింహ భార్గవ నరసింహ కరంజ నరసింహ యోగా నరసింహ లక్ష్మీ నరసింహ నవ నారసింహ క్షేత్రాలలో వున్న నరసింహమూర్తులు వీరేనని మరికొందరి పండితుల అభిప్రాయాలు: జ్వాలా నరసింహ 2. అహోబిల నరసింహ 3. మాలోల నరసింహ 4. క్రోధ నరసింహ 5. కరంజ నరసింహ 6. భార్గవ నరసింహ 7. యోగానంద నరసింహ 8. ఛాత్రవట నరసింహ 9. …

కోట్ల నరసింహుల పల్లె – నరసింహస్వామి Read More »

ఆర్‍ అండ్‍ ఆర్‍ కాలనీ జెడ్పీహెచ్‍ఎస్‍లో ‘బాలచెలిమి’ గ్రంథాలయం ఏర్పాటు

పుస్తక పఠనంతో మేధోసంపత్తిఆర్‍ అండ్‍ ఆర్‍ కాలనీ జెడ్పీహెచ్‍ఎస్‍లో ‘బాలచెలిమి’ గ్రంథాలయం ఏర్పాటు పుస్తక పఠనంతో మేధోసంపత్తి పెరుగుతుందని బాలచెలిమి కన్వీనర్‍ గరిపల్లి అశోక్‍ తెలిపారు. గజ్వేల్‍ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‍ అండ్‍ ఆర్‍ కాలనీలో గల జెడ్పీహెచ్‍ఎస్‍లో బాలచెలిమి, చిల్డ్రన్‍ ఎడ్యుకేషన్‍ అకాడమీ చైర్మన్‍ మణికొండ వేదకుమార్‍ సహకారంతో బాలచెలిమి గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గరిపల్లి అశోక్‍ మాట్లాడుతూ… చదవడం రాయడం, అభ్యసనంలో ఒక భాగమని, విద్యార్థులలో పఠనాసక్తిని కలిగిస్తూ, వారిలోని సృజనాత్మకతను వెలికి …

ఆర్‍ అండ్‍ ఆర్‍ కాలనీ జెడ్పీహెచ్‍ఎస్‍లో ‘బాలచెలిమి’ గ్రంథాలయం ఏర్పాటు Read More »

హైదరాబాద్‍ జిల్లా స్థల నామాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మరియు అతి చిన్న జిల్లా హైదరాబాద్‍. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈ జిల్లాకు ఉన్న ప్రత్యేకత వేరుగా చెప్పనక్కర్లేదు. దేశంలోని వివిధ మతాల, ప్రాంతాల, భాషల ప్రజలు కలిసి నివసిస్తుండడం ఇక్కడి ప్రత్యేకత. గంగా జమునా తెహజీబ్‍ అనే మిశ్రమ సంస్క•తిని చాటుతూ అత్యధిక మానవ సాంధ్రతను కలిగి ఉన్న జిల్లా ఇది.1978లో రంగారెడ్డి జిల్లా నుండి విడిపోయి హైదరాబాద్‍ జిల్లాగా అవతరించింది. 66 గ్రామాలతో సుమారు 217చ.కి.మీటర్లు విస్తరించి ఉన్నది. జిల్లా …

హైదరాబాద్‍ జిల్లా స్థల నామాలు Read More »

అరుదైన చారిత్రక గ్రంథం ‘బంజారా చరిత్ర’

పచ్చని వనాలు, విరబూసిన మోదుగుపూలు, పాలధారలోలే కొండల అంచుల నుండి దూకే జలపాతాలు, వాగులు వంకలు వాటి పక్కన వరుసగా గడ్డి గుడిసెలు. ఆ గుడిసెల్లో జీవితాల్ని వెలిగించు కుంటున్న వేగుచుక్కల్లాంటి బంజారాలు. జాబిల్లిని తుంచి తమ ఘుంక్టోలో దాచారా! అన్నట్టుగా అందమైన కలంకారి వస్త్రధారణ, వ్యవసాయం, పశుపోషణ. ఈ ద•శ్యం అనాది భారతాన్ని ఆవిష్కరిస్తుంది. మదిని చరిత్ర పుటల్లోకి మళ్ళిస్తుంది. దేశ నిర్మాణంలో వీరి పాత్ర ప్రత్యేకం. బంజారాల సమగ్ర చరిత్ర మీద నేటివరకు ఎటువంటి …

అరుదైన చారిత్రక గ్రంథం ‘బంజారా చరిత్ర’ Read More »