deccanland

బాధిత జంతువులు – మానవ బాధ్యతలు – పర్యావరణం

చరిత్రలో ప్రధాన బాధితులు జంతువులే అంటాడు చరిత్రకారుడు యూవల్‍ నోవా హరారి. పెంపుడు జంతువులను కూడా సమధికంగానే చరిత్రలో అధికంగా మానవులు బాధించారనీ ఆయన పేర్కొన్నాడు. ఈ అభిప్రాయాలు వినడానికి హాస్యాస్పదంగా అనిపిస్తాయి కానీ, ఇది తిరస్కరించలేని వాస్తవం. 1975లో పీటర్‍ సింగర్‍ ‘యానిమల్‍ లిబరేషన్‍’ అనే గ్రంధం ప్రచురించాడు. ఈ గ్రంధం కొంతయినా మనుషుల ఆలోచనల మీద ప్రభావం చూపింది. అసలు జంతువులు విముక్తి గురించి కొంతయినా ఆలోచించటానికి, కొద్దిగానైనా చర్చించటానికి ఈ పుస్తకం అవకాశమిచ్చింది.యానిమల్‍ …

బాధిత జంతువులు – మానవ బాధ్యతలు – పర్యావరణం Read More »

తెలంగాణలో బౌద్ధం

జాతిపరంగా, దేశపరంగా వాడిన ఆంధ్ర శబ్దం మొట్టమొదట తెలంగాణకే చెల్లుతుంది. ఈ అంశాన్ని వాయు, మత్స్య పురాణాలేకాక బౌద్ధవాఙ్మయం నిరూపించింది. అంతేకాదు బౌద్ధం ఆచరించిన తొలి నేలగా ఈ ప్రాంతాల చరిత్రను బౌద్ధ సాహత్యమే తొలుత తెల్పింది. దాంతో తెలంగాణ చరిత్ర క్రీ.పూ.2500 సం।। నుండే ఉనికి (రికార్డు)లో ఉందన్న అంశం నిర్ధారితమైంది. ఇది బౌద్ధం వల్ల తెలంగాణకు కలిగిన లాభం.‘‘సుత్తనిపాత’’ (పారాయణ వర్గ) ఈ ప్రాంతాన్ని ‘‘అంధక రట్ట’’గా పేర్కొంది. అస్సక, ములక రాజ్యాలు ప్రధానంగా …

తెలంగాణలో బౌద్ధం Read More »

కేరళరాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు

కేరళ రాష్ట్రం పశ్చిమ సముద్ర తీరాన్ని అంటుకుని యున్నది. ఈ రాష్ట్రానికి తూర్పులో తమిళనాడు మరియు ఈశాన్యంలో కర్నాటక రాష్ట్రాలు ఉన్నవి. ఈ రాష్ట్రంలో చాలా భూభాగంలో సదరన్‍ గ్రాన్యులైటు టెర్రేన్‍కు చెందిన చార్నోకైట్‍ మరియు కొండలైట్‍ గ్రూప్స్కు చెందిన శిలలు ఉన్నవి. తమిళనాడు, కర్నాటక బార్డర్‍ వద్ద పిజిసికి చెందిన నైస్‍ మరియు గ్రానైట్స్ కలవు. సముద్ర తీరానికి దగ్గరగా కన్నురూకు తూర్పులో వెంగడ్‍ గ్రూప్‍కు చెందిన మైకాశిస్ట్, క్వార్ట్జైడ్‍, కంగ్లామరేట్‍ శిలలు కలవు. కొన్ని …

కేరళరాష్ట్రంలోని జియో హెరిటేజ్‍ స్థలాలు Read More »

ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం

విశ్వంలో జీవరాశుల మనుగడకు మూలాధారం అయిన భూమి, గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాలను ప్రకృతే ఈ విశ్వానికి అందించింది. పంచ భూతాల నిష్పత్తిలో సమతుల్యత లోపించి మానవ జీవనం అస్తవ్యస్తమౌతుంది. మానవాళి పలు విపత్తులకు గురవుతుంది. ప్రకృతి వాతావరణ పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అవసరం. ఆధునికీకరణ ‘పారిశ్రామికీకరణ, పట్టణీకరణ’ శీఘ్రంగా విస్తరిస్తున్న కార్పొటీకరణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న పరిణామాలు మానవుని స్వార్థపరత్వం ప్రకృతి విధ్వంసం దిశగా కొనసాగడం శోచనీయం.ప్రకృతి విధ్వంసంమానవుడు …

ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత జూలై 28న ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం Read More »

మానస్‍ వన్యప్రాణుల అభయారణ్యం 1985లో UNESCO చే గుర్తింపు

ప్రదేశం: అస్సాంగుర్తింపు: 1985విభాగం: నేచురల్‍ మానస్‍ వన్యప్రాణుల అభయారణ్యం మానస్‍-బెకి నదీ తీరంలో విస్తరించి ఉంది. భూటాన్‍లోని తూర్పు హిమాలయ పర్వత ప్రాంతాలలోని రక్షిత ప్రాంతాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంటుంది. ఈ సైట్‍ ప్రక•తి అందాల్లో పర్వత ప్రాంత అడవులు, ఒండ్రు గడ్డి భూములు, ఉష్ణమండల సతత హరిత అడవులు ఉన్నాయి. ఈ సైట్‍ లో అరుదైన, అంతరించిపోతున్న జాతుల ఆవాసాలు ఉన్నాయి. భారత ఉపఖండంలోని రక్షిత ప్రాంతాలలో ఇది అసాధారణమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. …

మానస్‍ వన్యప్రాణుల అభయారణ్యం 1985లో UNESCO చే గుర్తింపు Read More »

అదిగదిగో… నవలోకం.. ఏ సెమీకండక్టర్స్ రంగం

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎలక్ట్రానిక్‍ గాడ్జెట్స్ లేకుండా మనం ఏ పనీ చేయలేము అనడం అతిశయోక్తి కాదేమో! కార్ల నుండి స్మార్ట్ ఫోన్ల వరకు మరియు ఎంఆర్‍ఐ స్కానర్ల నుండి పారిశ్రామిక రోబోట్ల వరకు మనం పనిచేయడానికి, ప్రయాణించడానికి, ఆరోగ్య పరిరక్షణకు, విద్యారంగ పురోగతికి.. ఇలా ప్రతిచోటా ఎలక్ట్రానిక్‍ వస్తువుల ప్రాధాన్యం విస్తరిస్తోంది. అయితే ఈ ఎలక్ట్రానిక్‍ వస్తువులు సమర్ధవంతంగా పనిచేయడానికి సెమీకండక్టర్స్ అన్న చిప్‍లు కీలకమని చెప్పవచ్చు. సెమీకండక్టర్స్ను ఎలక్ట్రానిక్‍ వస్తువుల యొక్క క్రియాత్మక …

అదిగదిగో… నవలోకం.. ఏ సెమీకండక్టర్స్ రంగం Read More »

తీర్పుల్లో పాండిత్యం..?

‘ది ట్రాజెడీ ఆఫ్‍ హమ్లెట్‍’లో షేక్స్పియర్‍ క్లుప్తత గురించి ఇలా అంటాడు. ‘‘తెలివిగల వారి ఆత్మ క్లుప్తత.’ ఈ విషయం సాహిత్యానికే కాదు, చాలా విషయాలకి వర్తిస్తుంది. జీవితాలకి కూడా వర్తిస్తుంది. తీర్పులకి కూడా వర్తిస్తుంది.చాలా తీర్పులు పేజీలకు పేజీలు వుంటాయి. చాలా మంది న్యాయమూర్తులు ఈ క్లుప్తత అంశాన్ని మర్చిపోయారు. ఒకే విషయం మీద ఒక ప్రముఖమైన తీర్పుని ఉదహరించాల్సిన సమయంలో అలాంటి పది పదిహేను తీర్పులని ఉదహరిస్తారు. మరి కొంతమంది న్యాయమూర్తులు అవసరం లేని …

తీర్పుల్లో పాండిత్యం..? Read More »

సమస్త పార్శ్వాల ప్రక్షాళనకే కులగణన

కులగణనే భారతీయ వాస్తవికతకు దర్పణంకులగణనే భారతీయ వాస్తవికతకు దర్పణంగా నిలుస్తుంది. కులం ఒక వాస్తవికత. కులం, కుల వ్యవస్థ, కుల సంస్క•తి ఒక జీవన విధానం. రెండున్నర వేల యేళ్ళుగా అనేక మలుపులు తీసుకొని గణతెగలు హరప్పన్‍ ప్రజలు, నాగులు, ఆర్యులు, ద్రవిడులు తదితర జాతులు, ఆదివాసులు అందరు క్రమక్రమంగా భారత ఉపఖండంలో ఏవో కులాల కింద స్థిరీకరించబడ్డారు. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, దేశాలు వేరైనా కులాలు, కుల సెంటిమెంట్లు ప్రజలను కలుపుతున్నాయి. తమవారిని ఎదిగించాలని …

సమస్త పార్శ్వాల ప్రక్షాళనకే కులగణన Read More »

చరిత్రలో కొండపాక

మెదక్‍ జిల్లాలోని మండల కేంద్రమైన కొండపాక అపూర్వమైన చరిత్రపూర్వయుగ పురావస్తు సంపదతో, ఒక కళ్యాణీ చాళుక్యుల శాసనం, రెండు కాకతీయ శాసనాలతో ప్రఖ్యాతమైన పురాతన నగరం. ఇటీవల తెలంగాణా చరిత్రబ•ందం సభ్యులు వేముగంటి మురళీక•ష్ణ, అహోబిలం కరుణాకర్‍, మహమ్మద్‍ నసీరుద్దీన్‍, సామలేటి మహేశ్‍, అరవింద్‍ ఆర్య, సునీల్‍ సముద్రాల, బీవీ భద్రగిరీశ్‍, కొలిపాక శ్రీనివాస్‍, శ్రీరామోజు హరగోపాల్‍ పరిశీలనలో కొండపాక గ్రామానికి దక్షిణ దిశలో పారే ‘దక్షిణ గంగ’ అంచున చిన్నరాతిబోడు మల్లన్నగుట్ట వద్ద వున్న చెలకలలో …

చరిత్రలో కొండపాక Read More »

హైదరాబాద్ క్రికెట్‍

బ్రిటిష్‍ సైన్యం హైదరాబాద్‍ ప్రజానీకానికి క్రికెట్‍ను పరిచయం చేసింది. సుమారుగా 1880 ప్రాంతంలో నగరంలో క్రికెట్‍కు బీజాలు పడ్డాయి. మొయినుద్దౌలా గోల్డ్ కప్‍ 1930/31కు పూర్వం హైదరాబాద్‍లో ఫస్ట్ క్లాస్‍ క్రికెట్‍కు సంబంధించి ఏ రికార్డులు లభ్యం కావడం లేదు. 19వ శతాబ్ది చివరికాలం, 20వ శతాబ్ది మొదట్లో రాజా లోచన్‍ చంద్‍ ఈ ఆటకు ప్రధాన పోషకుడిగా ఉన్నట్లు చెబుతారు. మసూద్‍ అహ్మద్‍, అహ్మద్‍ అలీ, నజీర్‍ బేగ్‍, ఖుర్షీద్‍ బేగ్‍ లాంటి క్రికెటర్లు అప్పట్లో …

హైదరాబాద్ క్రికెట్‍ Read More »