2020

భారతీయుల జన్యు అమరిక చిక్కుముడిని విప్పే…

ఇండీజెన్‍ ప్రాజెక్ట్…!!! భూమి మీద అడుగిడిన తొలి మానవుడు తన ప్రారంభ దశలో ఆవాసం, ఆహారం లాంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకే ఆపసోపాలు పడ్డాడు, ఎన్నెన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. ‘‘పడి లేచిన కెరటంలా’’ తన జీవనగమనంలో ఎదురు దెబ్బలు తిన్న ప్రతిసారి రెట్టించిన ఉత్సాహంతో తన చుట్టూ ముసురుకున్న సమస్యలను ప్రతిఘటించాడు. అంతిమంగా మనుగడ కోసం పోరాటం తప్పదన్న నిర్ణయానికొచ్చాడు. ఈ క్రమంలో తనకు సమస్యలెదురైనప్పడల్లా అలుపెరగని పోరాటంతో, తన సునిశిత మేధాశక్తితో వాటికి పరిష్కారాలు కనుగొన్నాడు. …

భారతీయుల జన్యు అమరిక చిక్కుముడిని విప్పే… Read More »

తెగుళ్లు నివారిస్తేనే లాభాల పసుపు

ఈ తెగులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు, గాలిలో ఎక్కువ తేమ, తక్కువ ఉష్ణోగ్రత ఉండటం వలన వ్యాపిస్తుంది. పెద్దపెద్ద అండాకారపు మచ్చలు ఆకులపై అక్కడక్కడ కనబడతాయి. మచ్చలు ముధురు గోధుమ రంగులో ఉండి మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఏర్పడుతుంది. ఆకు కాడపై మచ్చలు ఏర్పడి కిందకు వాలి పోతుంది. దీని నివారణకు దృఢమైన విత్తనాన్ని ఎన్నుకోవాలి. మచ్చలు ఉన్న, ఎండిన ఆకులను తొలగించి కాల్చివేయాలి. లీటర్‍ నీటిలో గ్రాము కార్బండిజమ్‍ లేదా 2.5 గ్రాముల …

తెగుళ్లు నివారిస్తేనే లాభాల పసుపు Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!!-1

కరోనా నేపథ్యంలో శాస్త్రీయ పరిజ్ఞానం గూర్చి, ప్రకృతి గూర్చి, జీవం పుట్టుక గూర్చి, జీవ పరిణామం గూర్చి విధిగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత వుంది. ముఖ్యంగా రేపటి తరాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, రేపటి పథ నిర్దేశకులైన విద్యార్థులు ఈ విషయాల్ని అవగతం చేసుకుంటే, తమ పరిమితులు, బాధ్యతలు గుర్తెరిగి ప్రకృతి అనుకూల జీవనం సాగిస్తే పది కాలాల పాటు హాయిగా మనుగడ సాగిస్తాం! కాదంటే, ప్రకృతి ప్రకోపానికి, మమ్మారీలకు బలికాక తప్పదు!! ‘చివరి కొమ్మను నరికిన తర్వాత గాని, …

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!!-1 Read More »

ఆహుతి అవుతున్న అడవులు

అభివృద్ధి హోమంలో ప్రపంచ ఊపిరితిత్తులుగా పేరొందిన అటవీ సంపద ఆహుతి అవుతున్నది. దీనికి ఆజ్యం పోస్తున్నది మనిషే. మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నట్టుగానే ప్రపంచానికి ప్రాణ వాయువును ఇచ్చే అడవులను నెమ్మది నెమ్మదిగా వ్యవసాయం పేరుతొ, జీవనోపాధి పేరుతో కొల్ల గొడుతున్నాము. ఈ అడవులు ప్రకృ తి వైపరిత్యాలకు కొంత , మనిషి స్వార్ధానికి కొంత అగ్నికి కాలి బూడిద అవుతున్నాయి. ఇప్పటివరకు 43 శాతం అడవులు అంతరించి పోయినవి.NASA వారి terra శాటిలైట్‍ ఉపయోగించి …

ఆహుతి అవుతున్న అడవులు Read More »

కరోనాపై లోతైన అధ్యయనాలు జరగాలి : డాక్టర్‍ బి.వి.సుబ్బారావు

పర్యావరణవేత్త డాక్టర్‍ బి.వి.సుబ్బారావుగారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ ఇక్రిశాట్‍లో సైంటిస్టు పని చేసి పదవీ విరమణ పొందిన డాక్టర్‍ బి.వి.సుబ్బారావు గారు ఏప్రిల్‍ మాసంలో దక్కన్‍ల్యాండ్‍కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ కరోనాలాంటి విపత్కర పరిస్థితులకు కారణం ఏమని అనిపిస్తుంది?కరోనాలాంటి విపత్కర పరిస్థితిని ఒక చారిత్రాత్మక ఘట్టంగా పరిగణించాలి. ఎందుకంటే వైరస్‍లను ఇంతకు ముందు ప్లేగు, మలేరియా రూపంలో 20వ శతాబ్దంలో చాలా చూశాం. కానీ కోవిడ్‍-19 వైరస్‍ అర్థం కావడానికి చాలా సమయం పట్టింది. ఎలా వ్యాప్తి చెందుతుందో తెలుసుకోవటానికి కొంత…

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం

తెలంగాణ ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍ అల్లం నారాయణ గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ అల్లం నారాయణ సీనియర్‍ జర్నలిస్ట్, నమస్తే తెలంగాణ దినపత్రిక మాజీ సంపాదకులు, తెలంగాణ ప్రెస్‍ అకాడమీ చైర్మన్‍. పత్రికా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్నారు. కరోనా విపత్తుపై ఏప్రిల్‍ మాసంలో దక్కన్‍ల్యాండ్‍కు వారు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు. ఇలాంటి విపత్కర పరిస్థితిల్లో కరోనా వ్యాప్తి ఏ విధంగా ఉండబోతుంది?కరోనా వైరస్‍ గురించి తెలిసింది చాలా తక్కువ. కానీ రకరకాల ఊహాగానాలు, అంచనాలు …

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం Read More »

ప్రకృతి నేర్పే పాఠాలు అర్థం చేసుకోవాలి… ఆచరించాలి..

ఓల్గాగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ తెలుగు రచయిత్రి పోపూరి లలిత కుమారితో కోవిడ్‍-19పై ‘దక్కన్‍ ఛానెల్‍’ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రముఖ తెలుగు రచయిత్రి ఓల్గాగా ప్రసిద్ధి పొందిన పోపూరి లలిత కుమారి రాజకీయ, సామాజిక, సాహిత్యరంగంలో స్త్రీవాద ధృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయిత్రి. స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా నిలిచిన ఓల్గా, అస్మిత రిసోర్స్ సెంటర్‍ ఫర్‍ విమెన్‍కు అధ్యక్షురాలిగా, జనరల్‍ సెక్రటరీగా పనిచేసారు. వీరు కరోనాపై ‘దక్కన్‍ ఛానెల్‍’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. లాక్‍డౌన్‍ పిరియడ్‍లో కరోనా వైరస్‍ …

ప్రకృతి నేర్పే పాఠాలు అర్థం చేసుకోవాలి… ఆచరించాలి.. Read More »

దళిత బహుజన మేధావి, ప్రజాస్వామికవాది ఉ.సా.

దళిత బహుజన మేధావి, ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉ.సా. జులై 25న కరోనాతో మరణించడం అత్యంత విషాదకరం. ఉ.సా. అసలు పేరు ఉప్పుమావులూరి సాంబశివరావు. ఉ.సా. గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరులో ఉన్నత మధ్యతరగతి, వైద్యరంగ కుటుంబంలో జన్మించారు. ఆ కుటుంబం ఆయుర్వేద వైద్యంలో ఆ చుట్టు పక్కల ప్రాంతమంతా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నది. ఉ.సా.ను మెడిసన్‍ చదివించాలనేది కుటుంబ ఆకాంక్ష. 1968లో ఉ.సా. పి.యు.సి. విద్య కోసం తెనాలి వి.ఎస్‍.ఆర్‍. కాలేజీలో చేరే టప్పటికే నాస్తికవాది, హేతువాది. తెనాలి విద్యార్థి …

దళిత బహుజన మేధావి, ప్రజాస్వామికవాది ఉ.సా. Read More »

నిర్మల్‍ బొమ్మలు

నిర్మల్‍!ఈ పేరు చెబితేనే చాలు…సహజత్వం ఉట్టిపడేలా ఉండే కొయ్య బొమ్మలు, విలక్షణ శైలికి పేరొందిన పెయింటింగ్స్ గుర్తుకు వస్తాయి. ఆదిలాబాద్‍ జిల్లా నిర్మల్‍ కొయ్య బొమ్మలు దేశీయంగానే గాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతగానో పేరు ప్రఖ్యాతులు పొందాయి. స్థానికంగా అడవిలో లభించే పొనికి కర్రను ఉపయోగించి వనమూలికలు, సహజరంగులతో ఈ బొమ్మలను రూపొందిస్తారు. ఇదీ నేపథ్యంనిర్మల్‍ సంస్థానాన్ని పాలించిన నిమ్మనాయుడు పద్మనాయక వంశానికి చెందిన వాడు. అప్పట్లో ఆయన దేశం నలుమూలల నుంచి కళాకారులను నిర్మల్‍కు రప్పించి …

నిర్మల్‍ బొమ్మలు Read More »

విపత్కర పరిస్థితుల్ని సైన్స్ మాత్రమే ఎదుర్కొంటుంది!

ఉ. సా. (ఉప్పుమావులూరి సాంబశివరావు) కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ ఉప్పుమావులూరి సాంబశివరావు (ఉ.సా.) విప్లవోద్యమ క్షేత్రంలో అస్తిత్వ పోరాటాల గొంతుక, రచయిత, వక్త, ఉద్యమాల ఉపాధ్యాయుడిగా పేరొందారు. ‘దక్కన్‍ ఛానల్‍’కు మే మాసంలో ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ. కరోనా వ్యాప్తి చెందడానికి కారణం ఏమనిపిస్తుంది?విపత్కర పరిస్థితికి ప్రధానంగా రెండు కారణాలు చెప్పవచ్చు. ఒకటి కరోనా మిగతా వైరస్‍ల కంటే విలక్షణ లక్షణాలు కలది. ఈ వైరస్‍ వ్యాప్తి చెందడంలో చాలా చురుకైన, వేగవంతమైన పాత్ర వహిస్తుంది. ఒకరినుంచి మరొకరికి వ్యాధి …

విపత్కర పరిస్థితుల్ని సైన్స్ మాత్రమే ఎదుర్కొంటుంది! Read More »