2021

తప్పెటగుళ్ళు – నీలబోను సత్యం

‘‘నారాయణ, శ్రీమన్నారాయణ’’ అనే ఒక పదం ‘రంగస్థలం’ సినిమా స్వరూపాన్నే మార్చి చిట్టిబాబు అన్నను చంపిన హంతకులను హతమార్చి రంగస్థలంకు క్రొత్త సర్పంచ్‍ను ఏకగ్రీవంగా ఎన్నుకునేలా చేస్తుంది. నృత్యం చేస్తూ గంభీరమైన ముఖ వర్చస్సుతో, పొడగాటి జుట్టు, మెలితిరిగిన మీసాలతో ‘శ్రీమన్నారాయణ’ అనే పదాన్ని పాటరూపంలో పలికిన వ్యక్తి పేరే ‘నీలబోను సత్యం’. అతడు ఆడిన నృత్యం పేరే ‘తప్పెటగుళ్ళు’. ఛాతిపైన ఒక తప్పెటగుండు (బోలుగా ఉన్న చిన్న గుండ్రటి డప్పు) గజ్జెలలాగు, కాళ్ళకు గజ్జెలు, ఒకేరంగుతో …

తప్పెటగుళ్ళు – నీలబోను సత్యం Read More »

కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా?

కొలనుపాకకు ‘కొల్లిపాక’, ‘కొట్టియపాక’, ‘కొల్లియపాక’, ‘కొల్లిహాకే’ అనే పేర్లు శాసనాలలో, ‘బింబావతిపురం, కుదుటనగరం, సరోవరకుటీరం, సోమశేఖరపురం, కుళుదపురం, కుల్పాక్‍’ అనే పేర్లు స్థానికమైనవని తెలుస్తున్నది. కొల్లిపాక అనే పేరు 18వ శతాబ్దం వరకు కొనసాగినట్లు రావూరి సంజీవకవి ‘వీరనారాయణ శతకం’వల్ల తెలుస్తుంది. నిజాం కాలంలో కుల్పాక్‍ అని పిలువబడ్డది. 3వ నిజాం సింకిందర్‍ జా (క్రీ.శ.1803-1829) ‘నవాబ్‍ మీర్‍ జైన్‍ లాబొద్దీన్‍ ఖాన్‍ సత్వత్‍ జంగ్‍ బహరాముద్దౌలా భైరాముల్‍ ముల్క్’కు ‘కుల్పాక్‍’ను జాగీరుగా ఇచ్చాడు. కొలనుపాక చారిత్రకంగా …

కొలిపాక తీర్థం చారిత్రక భాగ్యనగరమా, శాపగ్రస్త పురమా? Read More »

కేసులు నిలవాలని పెట్టరు

‘గాంధీ మాలా బేత్లా’ అన్న కవితను వసంత్‍ దబాత్రేను గుర్జార్‍ అన్న మరాఠీ కవి రాశాడు. ‘గాంధీ నన్ను కలిశాడు’ అన్నది కవితా శీర్షిక తెలుగులో. అది ఓ వేయి పదాల కవిత. ఆ కవితని 1983లో గుర్జార్‍ రాశాడు. ఆయన వయస్సు ఇప్పుడు 72 సంవత్సరాలు. ఆ కవితలో అశ్లీలం వుందని 1994లో ఓ క్రిమినల్‍ కేసు దాఖలైంది. మహాత్మాగాంధీ తనని దేవాలయంలో, చర్చీలలో, మసీదులో అదే విధంగా ఓషో ఆశ్రమంలో, క్లెమ్లిన్‍లో, ముంచాయి రెడ్‍ …

కేసులు నిలవాలని పెట్టరు Read More »

ప్రకృతివరణంకు (డార్వినిజం) దారితీసిన పరిస్థితులు!

ప్రకృతే నియంత్రిస్తుంది! 12 ప్రకృతే శాసిస్తుంది!! శాస్త్రపరిశోధనలన్నీ సందర్భోచితంగా, సమస్యల పరిష్కారానికి దోహదపడేలా జరుగుతాయి. కొన్ని శోధించి సాధించబడితే, మరికొన్ని కాకతాళీయంగా జరిగిన సంఘటనల ఆధా రంగా సిద్ధాంతీకరించ బడతాయి. అత్యధిక పరిశోధనలన్నీ ప్రకృతి దృగ్విషయాల నేపథ్యంలో జరిగితే, మరికొన్ని భౌతిక, రసాయనిక, భౌగో ళిక, ఖగోళ, భూగర్భ, సముద్ర సంబంధిత పదార్థాల, జీవుల మధ్యన జరిగే పరస్పర చర్యల ఆధారాలతో ముడిపడి వుంటాయి. ఏ పరిశోధన అయినా, పరిశోధకుల ఊహ ప్రతిపాదనలతో, పరికల్పనలతో (hypotheses ప్రారంభమై …

ప్రకృతివరణంకు (డార్వినిజం) దారితీసిన పరిస్థితులు! Read More »

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం

సిరి ధాన్యాలు (Millets) ఎందుకు తినాలి?ఇవి మన జీవితంలో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా నింపుతాయి? ప్రఖ్యాత శాస్త్రవేత్త, ఆరోగ్య, ఆహార నిపుణులు డాక్టర్‍ ఖాదర్‍ అవిరామ కృషి ద్వారా, మన ముందు తరాలు ఆహారంగా తిన్న ఈ అద్భుత ఆహార ధాన్యాలు – ‘సిరి ధాన్యాలు’ తిరిగి వెలుగులోకి వచ్చాయి. ఈనాటి ఆధునిక రోగాల నివారణ, నిర్మూలనలో కూడా ఈ ‘సిరిధాన్యాలు’ ఎలా కీలక పాత్ర వహిస్తాయో డాక్టర్‍ ఖాదర్‍ ప్రపంచానికి చాటి చెప్తున్నారు. ఇది మనకూ, …

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం Read More »

నిర్ణయం

గోడ గడియారం ఎనిమిది గంటలు కొట్టింది. శోభ మనసులో ఆందోళనగా ఉంది. ఆ రోజు లెక్కల పరీక్ష. ఇప్పటి వరకు రాసిన పరీక్షలు బాగానే రాసింది. ఇదే చివరి పరీక్ష. మళ్ళీ ఒకసారి ముఖ్యమైన లెక్కల సూత్రాలు చూస్తూంది. ఇంకా గంట మాత్రమే ఉంది. ఈసారి శోభ చాలా పట్టుదలతో చదివింది. క్లాసులో ఇప్పటి వరకు ఎప్పుడూ మొదటి ర్యాంకు రాలేదు. కనీసం మొదటి మూడు ర్యాంకులలో ఏదో ఒకటి తనకు రావాలి. అందుకే ఈ సంవత్సరం …

నిర్ణయం Read More »

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం

ఏ దేశ సుస్థిర ఆర్థిక వ్యవస్థకైనా ఆయా దేశాల్లోని ప్రభుత్వరంగ సంస్థలు దోహదం చేస్తాయి. డిమాండ్‍కు తగ్గ ఉత్పత్తి, తక్కువ ధరలకు ప్రజలందరికీ అందుబాటులో ఉండటం, వచ్చే ఆదాయం ఆయా దేశాల ప్రజల ప్రయోజనాలకు వినియోగించడం, మిగులు ఆదాయాన్ని మళ్లీ అదే సంస్థలకు పెట్టుబడిగా మార్చడం వల్ల ఒకే సమయంలో ప్రజలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు భరోసా ఏర్పడుతుంది. విదేశీ సంస్థలకు, స్వదేశీ ప్రైవేట్‍ సంస్థలకు ప్రభుత్వాలు, ప్రజలు పరాధీనత చెందకుండా నివారిస్తాయి. అటువంటి ప్రభుత్వరంగ సంస్థల …

ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు నడుం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం Read More »

బొమ్మ హేమాదేవి

తెలంగాణ మలితరం రచయిత్రులలో బొమ్మ హేమాదేవి ఒకరు. మొట్ట మొదటి బహుజన రచయిత్రి. 1960-1980 మధ్యకాలంలో మహిళల నుండి సాహిత్యం వెల్లువయింది. చదువుకునే వారి సంఖ్య పెరగడంతోపాటే రాసేవారి సంఖ్యా పెరిగింది. జీవితానుభవాలు, సంఘటనల నుండి కథలు, నవలలుగా మలిచారు మహిళలు. అందులో ఒకరు బొమ్మ హేమాదేవి. ఆమె అసలు పేరు రుక్ష్మిణీదేవితోపాటు యమున అనే పేరు కూడా ఉంది. రాయడం ఆరంభం చేసినప్పుడు ‘దేవీరమ’ అని ఇంకో పేరు పెట్టుకున్నారు. ఆ పేరుతో 20 నవలలు, …

బొమ్మ హేమాదేవి Read More »

ఆకాశంలో విరిసిన అందాల పుష్పం ‘ఫలక్‍ నుమా ప్యాలెస్‍’

రాజుల సొమ్ము రాళ్ల పాలు’’ అయితే కావొచ్చు గాక నష్టమేముంది? ఒక తాజ్‍మహల్‍, ఒక కోణార్క, ఒక హంపీ, ఒక రామప్ప మనకు దక్కింది కదా!ఆ వరుసలోనే హైద్రాబాదీలకు దక్కింది ఫలక్‍నుమా ప్యాలెస్‍. చార్మినార్‍ నుండి చాంద్రాయణగుట్టకు సీదాగా ప్రయాణిస్తుంటే ఒక మలుపులో కుడి వైపు గుట్టమీద వెలసిన పాలరాతి వెన్నెల భవనమే ఫలక్‍నుమా. ఉర్దూలో ఫలక్‍ అంటే ఆకాశం, నుమా అంటే ప్రతిబింబం. ఆ అందమైన భవనం గురించి అందంగా చెప్పాలంటే ‘‘ఆకాశ హర్శ్యం’’ అన్నమాట.అందమైన, …

ఆకాశంలో విరిసిన అందాల పుష్పం ‘ఫలక్‍ నుమా ప్యాలెస్‍’ Read More »

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-13 మహేశ్వరభటారల ప్రాగటూరు తెలుగు శాసనం (క్రీ.శ.859)

ఈసారి ప్రాగటూరులో నేను 1978 జులై 3వ తేదీన చూచిన శివాలయం ముందు నంది మండపం ఒక స్థంభంపైన గల శాసనంపైన రాయాలను కొన్నాను. ఎందుకంటే నేను, మొట్ట మొదటిసారిగా, ఒక శాసనాన్ని దగ్గర్నించి చూచింది ఆ శాసనమే. అక్షరాలు కనిపిస్తున్నాయి గానీ, ఇప్పటి తెలుగు కాదు గాబట్టి, కన్నడ శాసన మనుకొన్నాను. శాసనంలోని ఒక్కో పంక్తిని, పంక్తిలోని ప్రతి అక్షరాన్నీ చేతితో తడిమినపుడు ఏదో తెలియని వింత అనుభూతిని పొందాను. మళ్లీ నలభై మూడేళ్ళ తరువాత, …

అలనాటిమేటి తెలంగాణ శాసనాలు-13 మహేశ్వరభటారల ప్రాగటూరు తెలుగు శాసనం (క్రీ.శ.859) Read More »