August

2020 అక్టోబర్‍ 6న భూమికి సమీపంలో అంగారక గ్రహం

PLANET MARS CLOSEST TO EARTH ON 6th OCT 2020at 62.02 million km – Spot Mars without use of Telescopes/Binocular ఆకాశంలో నిత్యం ఎన్నో ఖగోళ సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మనం ప్రతిరోజూ సాయంత్రం వేళ ఇంట్లో నుంచి ఆకాశంవైపు చూసినప్పుడు మనకు కోట్లాది నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ నక్షత్రాల్లో గ్రహాలు కూడా ఉంటాయని తెలుసు. కాకపోతే ఆ గ్రహాలను ఎలా గుర్తించాలో తెలియక పోవడం వల్ల వాటిని మనం చూడలేకపోతున్నాం. …

2020 అక్టోబర్‍ 6న భూమికి సమీపంలో అంగారక గ్రహం Read More »

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -2

ప్రకృతి సూత్రాలలో 15వది – అనగా జీవశాస్త్ర పరంగా మొదటిది:భూమిపైన జీవం నిర్జీవ పదార్థాల నుండే పుట్టింది. ఈ జీవం క్రమానుగుణంగా పరిణామం చెందుతూ ప్రకృతికి అనుగుణంగా పలురూపాల్లోకి రూపాంతరం చెందింది. చెందుతూనే వుంది. మానవుడి పుట్టుక ఈ పరిణామంలో ఓ భాగమే! (Life originated from inanimate matter and has been diversifying by Natural Selection. Man is a part of the Organic Evolution)మత విశ్వాసాల ప్రకారం మానవుడు దేవుడి, …

ప్రకృతే నియంత్రిస్తుంది! ప్రకృతే శాసిస్తుంది!! -2 Read More »

అద్భుత నిర్మాణ శైలికి ప్రతీక పైగా టూంబ్స్

హైదరాబాద్‍కు చారిత్రకంగా పేరు ప్రఖ్యాతులు అందించిన వారసత్వ కట్టడాల్లో ఇవి కూడా ఉన్నాయి. నిజామ్‍లకు విధేయులుగా ఉండిన పైగా కుటుంబీకుల సమాధులివి. ఉన్నతాధికారులుగా, దాతలుగా, వీరులుగా పైగా కుటుంబీకులు పేరొందారు. హైదరాబాద్‍ లో ఆర్కిటెక్చర్‍ అద్భుతాలకు పేరొందిన వాటిలో ఈ సమాధులు కూడా ఉన్నాయి. అక్కడి మొజాయిక్‍ టైల్స్, హస్తకళానైపుణ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఊహకు అందని రీతిలో ఆనాటి వారు అక్కడ తమ అద్భుతాలను ఆవిష్కరించారు. హైదరాబాద్‍లో చార్మినార్‍కు 4 కి.మీ. దూరంలో దబర్హానా షా …

అద్భుత నిర్మాణ శైలికి ప్రతీక పైగా టూంబ్స్ Read More »

అనేక బాధలను తట్టుకున్న మానవజాతి : కె.బి.గోపాలం

సైన్స్ రచయిత కె.బి.గోపాలం గారితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రముఖ సైన్స్ రచయిత, అనువాదకులు కె.బి.గోపాలం డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి, తరువాత ఆకాశవాణిలో సైన్స్ ఆఫీసర్‍గా, అసిస్టెంట్‍ స్టేషన్‍ డైరెక్టర్‍గా, స్టేషన్‍ డైరెక్టర్‍గా, డిప్యుటీ డైరెక్టర్‍గా వివిధ హోదాలలో హైదరాబాదు, ఆదిలాబాదు, న్యూఢిల్లీ కేంద్రాలలో పనిచేశారు. కరోనా విపత్తుపై మే మాసంలో దక్కన్‍ ల్యాండ్‍కు వారు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్యాంశాలు. కరోనా సమయంలో మీకు కలిగిన ఆలోచనలు, అంతర్మథనాలు ఏమిటి?దీనిమీద ఒక పుస్తకం రాయాలి. రెండు లక్షల సంవత్సరాల నాడు మానవ జాతి పుట్టింది. …

అనేక బాధలను తట్టుకున్న మానవజాతి : కె.బి.గోపాలం Read More »

అన్నీ ప్రభుత్వాలే చేయాలను కోకూడదు పౌరులు ఉత్పత్తిదారులు కావాలి : చెలికాని

సాంఘిక – ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం పనిచేస్తున్న చెలికానితో కోవిడ్‍-19పై ప్రత్యేక ఇంటర్వ్యూ సాంఘిక-ఆర్థిక ప్రజాస్వామ్యం కోసం దశాబ్దాలుగా పనిచేస్తున్న వెంకట భూసుర జగన్నాధరావు (రావు వి.బి.జె.) చెలికానిగా పాఠకులకు సుపరిచితులు. వీరు భారతదేశంలో నివాస సంక్షేమ సంఘాలను రూపొందించడానికి ఎంతో కృషి చేశారు. అవి ఇప్పుడు భారత రాజకీయాలలో నాల్గవ శ్రేణి స్వపరిపాలనగా అంగీకరించబడుతున్నాయి. యునెస్కోతో, ఇంటర్నేషనల్‍ ఫౌండేషన్‍ ఆఫ్‍ హ్యూమన్‍ డెవలప్‍మెంట్‍, సీనియర్‍ సిటిజన్స్ సమాఖ్య తదితర సంస్థలలో పనిచేస్తున్నారు. కోవిడ్‍-19పై చెలికాని గారు దక్కన్‍ల్యాండ్‍కు ఏప్రిల్‍ మాసంలో ఇచ్చిన ప్రత్యేక …

అన్నీ ప్రభుత్వాలే చేయాలను కోకూడదు పౌరులు ఉత్పత్తిదారులు కావాలి : చెలికాని Read More »

మునగ సాగు ఆవశ్యకత

భారతదేశంలో మునగ ఒక ముఖ్యమైన కాయగూర పంట. మునగ చెట్టును మానవులు క్రీస్తు పూర్వం 150 సంవత్సరం ప్రాంతంలో ఉపయోగించారు. కొందరు చరిత్రకారుల ప్రకారం, మౌర్య సైన్యం యొక్క ప్రధాన పోషక పదార్థంగా మునగ కాయ వుంది. అదే అలెగ్జాండర్‍ సైన్యాన్ని ఓడించిందని ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేదం ప్రకారం కనీసం 300 మానవ వ్యాధులకు చికిత్స చేయగల సామర్థ్యం మునగకు ఉంది. ఈ కాయలు, ఆకులను ఎక్కువగా వంటకాల్లో వాడటం మన రాష్ట్రంలో ఆనవాయితీ. ఆకుకూరలతో మునగను కూడా వాడాల్సిన అవసరం ఎంతో …

మునగ సాగు ఆవశ్యకత Read More »

చిత్తా…? బొత్తా..

మీరు ఏం మాట్లాడినాఎవర్ని ప్రశంసించినామీరెన్ని వంకర్లు పోతున్నామీ పరిధులు దాటినామేం కళ్ళు మూస్కు నడవాల్సిందేనిస్సహాయంగానిశ్శబ్దంగానా గొంతు కిందఆర్టికల్‍ 19 నలిగి పోతుందినేనిక మాట్లాడనుధిక్కారమో, దండనోనన్ను పరుగెత్తిస్తుందిజెండా వందనం తరువాతపిల్లలకి చాక్లెట్లు ఇచ్చేవాళ్ళుఇది కూడా అలాంటిదేనేమో!!ప్రశాంత్‍భూషణ్‍ కోర్టు ధిక్కారణ నేరం చేశాడని సుప్రీంకోర్టు నిర్ధారణ చేసిన తరువాత ఓ తెలుగు కవి ఆవేదన, ఆక్రోసం. ఇంతకీ ప్రశాంత్‍ భూషణ్‍ చేసిన నేరం ఏమిటి? ఆయనకు వేసిన శిక్ష ఏమిటి?సుప్రీంకోర్టు తనకు తానుగా స్వీకరించిన కోర్టు ధిక్కార నేరంలో ప్రశాంత్‍ …

చిత్తా…? బొత్తా.. Read More »

కోట్ల నర్సింహులపల్లి గ్రామంలో మరో జైన దిగంబర విగ్రహం

కరీంనగర్‍ జిల్లాలోని గంగాధర మండలం కోట్ల నర్సింహులపల్లె ఒక చారిత్రక గ్రామంగా ప్రసిద్ది చెందియుంది. ఇది ఒక కుగ్రామమైనా ఇక్కడ పురావస్తు సంపదలతో విలసిల్లుతున్నది. ఇక్కడ జైన దిగంబర విగ్రహాలు బయల్పడటం ద్వారా, పదే పదే పత్రికల్లోకి ఎక్కుతోంది. క్రీ.శ. 7-9 శతాబ్దాల మధ్య వేములవాడ చాళుక్యులు, రాష్ట్రకూటులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ గ్రామం అటు హిందూ దేవాలయాలతో పాటు, జైన మత వికాసానికి, ప్రాభవానికి ఆలవాలంగా నిలుస్తున్న దనడానికి కారణం, జూన్‍ 13 వ తేదీన ఇక్కడ ఒగ్గు అంజయ్య అనే ఒక రైతు పొలంలో ట్రాక్టర్‍తో దుక్కులు దున్నుతుండగా వర్ధమాన మహావీరుడి విగ్రహం …

కోట్ల నర్సింహులపల్లి గ్రామంలో మరో జైన దిగంబర విగ్రహం Read More »

పాల్కురికి పేర్కొన్నపర్యాటక స్థలాలు

తెలంగాణ సాహిత్య చరిత్రలో మనకు కనిపించే అతి గొప్ప కవి పండితుడు పాల్కురికి సోమనాథుడు అనేది తెలుగు సాహిత్య లోకానికి తెలిసిన విషయమే. సోమనాథుని రచన ‘బసవ పురాణం’కు 1926లో ముందుమాట (విపులమైన పీఠిక) రాస్తూ ఆయన వరంగల్‍ జిల్లాలోని పాలకుర్తికి గ్రామానికి చెందినవాడు అని వేటూరి ప్రభాకర శాస్త్రిగారు రాశారు. ఇంతవరకు బాగానే ఉంది కాని సోమనాథుని కాలం గురించి మాత్రం ఐదు పేజీల చర్చ చేసి ఆయన క్రీ.శ.1132-1198 మధ్య కాలానికి చెందినవాడు అని అభిప్రాయపడ్డారు. ఇది చారిత్రక సత్యం కాదు. కాబట్టి …

పాల్కురికి పేర్కొన్నపర్యాటక స్థలాలు Read More »

నులక చందయ్యలు

తెలంగాణ జానపద కళారూపాల్లో ఆశ్రిత జానపద కళారూపాల సంస్కృతి ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ కళారూపాలు ఒక కులాన్ని మాత్రమే ఆశ్రయించి ప్రదర్శిస్తాయి. ఆయా కళారూపాల కళాకారులను వృత్తి గాయకులు, భిక్షుక గాయకులు, ఉపకులాలు, ఆశ్రిత గాయకులు, పూజారులు, కుల గురువులు అనే పేరుతో జానపద పరిశోధకులు వ్యవహరిస్తున్నారు. ఈ కళారూపాలను పోషించే కులాలను పోషక కులమని, ప్రధాన కులమని, దాతృ కులమని అంటున్నారు. ఈ రకంగా ప్రతి కులానికి ఒక ఆశ్రిత కళారూపం నిర్మించబడి మనుగడ సాగిస్తున్నాయి. …

నులక చందయ్యలు Read More »