తెలంగాణ శాసనాల పరిష్కరణ-ఒక పరిశీలన
కొత్తతెలంగాణ చరిత్రబృందం 7వ నెల వెబినార్‍లో డా. దామరాజు సూర్యకుమార్ గారి ప్రసంగపాఠం తెలంగాణ శాసనాలను మొదట ఎవరు, ఎపుడు పరిష్కరించా రన్నది పెద్దప్రశ్న. చరిత్రకారులు రాసిన ఆధారాలు వెతుకుతుంటే తెలంగాణాలో లభించిన శాసనాలను పరిష్కరించిన వారు 35 మంది కనిపించారు. వారి గురించి వాకబు చేయడానికి, వివరసేకరణ సమయమైతే పట్టింది కాని, విలువైన సమాచారమే దొరికింది. తెలంగాణలోని పాతజిల్లాలు పదింట్లో వెలుగుచూసిన శాసనాలు 2,795. అందులో జిల్లాలవారీగా అప్పటి పురావస్తుశాఖ ప్రచురించింది నల్గొండ, కరీంనగర్, వరంగల్, …