పరుల కోసం
పూర్వం క•ష్ణా నది ఒడ్డునున్న శేరు గూడెంలో రాఘవయ్యనే జాలరి నివసిస్తుండే వాడు. తనకు పిల్లలు లేరు. తెల్లవారు జామున్నే వల తీసుకొని నది వద్దకు వెళ్ళేవాడు. పడవ మీద నీళ్ళ లోకి వెళ్ళి, తను పెట్టిన మావులు, బుట్టలు చూసుకునే వాడు. వాటిల్లో పడ్డ చేపల్ని తీసి, పడవలో ఉన్న తాటాకు బుట్టలో వేసుకొని తిరిగి యధా స్థానంలో వాటిని పెట్టేవాడు. తరువాత నది మీద పడవలో తిరుగుతూ వల విసిరే వాడు. పడిన చేపల్ని …