ఎందుకీ వివక్ష అంటున్న ‘వై’
పురుషుడుగానే పుట్టినా క్రమంగా లోన విచ్చుకుంటున్న స్త్రీత్వాన్ని అణచుకోలేక, బహిరంగపరచి కుటుంబం, సమాజం ఛీత్కారాన్ని భరించలేక సతమతమవుతున్న అటు ఇటు గాని బతుకులు ప్రపంచం నిండా ఉన్నాయి. తమదికాని దోషానికి జీవన కాలం శిక్ష అనుభవిస్తున్న జాతి వారు. ఇప్పుడిప్పుడే విడి జాతి గుర్తింపుతో, చట్టం ఆసరాతో తలెత్తుకుంటున్నారు. సమాజంలో దొరికిన ఆకాస్త చోటును విస్త•తపరచుకుంటున్నారు. వివిధ రంగాల్లో తమ సత్తా నిరూపిస్తున్నారు. వారి మానసిక, శారీరక వ్యధలను విప్పిచెప్పేందుకు గుండెలను, గొంతులను సవరించుకుంటున్నారు. కవులుగా, కథకులుగా …