January

భారతదేశంలో పట్టనంత చరిత్ర తెలంగాణలో ఉంది

డెక్కన్‍ హెరిటేజ్‍ అకాడమీ ట్రస్ట్ (DHAT) 37వ హైదరాబాద్‍ బుక్‍ ఫెయిర్‍లో తన తాజా మూడు పుస్తకాలను విడుదల చేసింది. ఈ ఘన కార్యక్రమం ఈ రోజు, 2024 డిసెంబర్‍ 29, ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎన్‍టిఆర్‍ స్టేడియంలో, ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్న ‘‘సాదిక్‍ అలీ స్టేజ్‍’’ వద్ద జరిగింది. విడుదల చేసిన మూడు పుస్తకాలు ఇవీ: ‘‘కోర్టు తీర్పులో సాహిత్య మెరుపులు’’ – డాక్టర్‍ మంగరి రాజేంద్ర (జిమ్బో) రచన‘‘తెలంగాణ శిథిలాలు… వ్యథాభరిత …

భారతదేశంలో పట్టనంత చరిత్ర తెలంగాణలో ఉంది Read More »

బయోస్పియర్‍ పార్క్!

చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రతిపాదన 2 లక్షల హెక్టార్లలో ఏర్పాటుకు అవకాశం అటవీ, జంతు సంరక్షణతో పాటు పరిశోధన, శిక్షణకు యునెస్కో నిధులు ఆంధప్రదేశ్‍లోని చింతూరు, రంపచోడవరం ప్రాంతాల్లోని సుమారు 2 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బయోస్పియర్‍ పార్కు (జీవావరణ పార్క్) ఏర్పాటుకు అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో యునెస్కోకు ప్రతిపాదనలు పంపాలని భావిస్తున్నారు. ఇప్పటికే శేషాచలం అటవీ ప్రాంతాన్ని 2010లోనే యునెస్కో జీవావరణ పార్కుగా గుర్తించింది.4,756 కిలోమీటర్ల …

బయోస్పియర్‍ పార్క్! Read More »

పుల్లూరు బండ

‘జాతరంటె జాతర పుల్లూరుబండ జాతరపుల్లూరు బండజాతర, పోదాము పదే జాతర’ఈ జానపదగీతం పుల్లూరుబండ జాతరను గొప్పగా కీర్తిస్తుంది. పుల్లూరుబండ మీద వెలసిన ‘నరసింహస్వామి’కి ప్రతి సంవత్సరం పుష్యబహుళ అమావాస్య, మాఘశుద్ధ పాడ్యమి, విదియల్లో మూడురోజులు జరిపే ఉత్సవాలే పుల్లూరుబండజాతర.సిద్ధిపేట జిల్లాకేంద్రానికి 6కి.మీ.ల దూరంలోనే ఉన్న పుల్లూరు పురాచారిత్రక ప్రదేశం. పుల్లూరుబండను ఆనుకునే చరిత్రపూర్వయుగ విశేషాలు, మధ్యయుగాలనాటి గుడులు, గోపురాలు విస్తరించివున్నాయి.ఇపుడు పుల్లూరు గుట్ట తొవ్వకు కట్టిన కొత్త కమాన్‍ కాదు, గుట్టమీద ఒక నిరాలంకారమైన ద్వారతోరణముంది. తెలంగాణ …

పుల్లూరు బండ Read More »

వారసత్వ సంపద పెంబర్తి హస్తకళ

భారతదేశం, సంస్కృతి, నాగరికత యొక్క మూలాధారం, సాంప్రదాయ కళలు, చేతిపనుల యొక్క గొప్ప మూలం. ఇది శతాబ్దాలుగా కొనసాగుతూ, ప్రామాణికమైన, వినూత్నమైన,  సృజనాత్మకంగా మిగిలిపోయింది. వారి అద్భుతమైన నైపుణ్యం, విలువైన ప్రాచీనతకు బహుమతిగా ఉంది. కళాత్మక వ్యక్తీకరణల రూపంలో అసాధారణమైన సంపద, వైవిధ్యమైన శైలులతో పాటు, భారతదేశంలోని ప్రతి ప్రాంతం కలప మరియు లోహం వంటి సహజ పదార్థాల లభ్యతపై ఆధారపడి ప్రత్యేకమైన చేతిపనులను కలిగి ఉంటుంది. సాంప్రదాయ హస్తకళలు వాటి స్వాభావిక విలువ, డిజైన్‍ యొక్క …

వారసత్వ సంపద పెంబర్తి హస్తకళ Read More »

నాణ్యత పాటిస్తూ లక్ష్యాలు సాధించాలి రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా ఉత్పత్తి: సీఎండీ ఎన్‍.బలరామ్‍

ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మార్చి 31 వరకు ఇకపై రోజుకు 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించాలని సింగరేణి సిఎండీ ఎన్‍.బలరామ్‍ పిలుపునిచ్చారు. డిసెంబర్‍ 12న హైదరాబాద్‍ సింగరేణి భవన్‍ నుంచి ఆయన అన్ని ఏరియాల జనరల్‍ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్పత్తి, నాణ్యతపై సమీక్ష నిర్వహించారు. లక్ష్యాల మేరకు ఉత్పత్తి సాధిస్తున్న గనులను, ఏరియాలను ఆయన అభినందిస్తూ, వెనుకబడి ఉన్న ఏరియాలు ఇప్పుడు పుంజుకోవాల్సిన …

నాణ్యత పాటిస్తూ లక్ష్యాలు సాధించాలి రోజుకు కనీసం 2.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా ఉత్పత్తి: సీఎండీ ఎన్‍.బలరామ్‍ Read More »

వ్యవ‘సాయ’ వర్సిటీ..

వ్యవ‘సాయ’ వర్సిటీ..అరవై ఏళ్లుగా రైతులకు సేవలందిస్తూ…అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాల స•ష్టికళాశాల నుంచి వ్యవసాయ పరిశోధనల వరకూ.. వ్యవసాయంలో నిత్య పరిశోధనలు.. వివిధ పంటలకు సంబంధించి కొత్త వంగడాల సృష్టి, సూక్ష్మనీటి సేద్యం, వ్యవసాయంలో యాంత్రీకరణ, పశువైద్య శాస్త్రం దిశగా పురోగమనం, వ్యవసాయ విద్య ద్వారా రైతులకు మేలు చేస్తూ, శాస్త్రవేత్తలను అందించడం.. ఇలా అనేక రకాలుగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటై 60 ఏళ్లు …

వ్యవ‘సాయ’ వర్సిటీ.. Read More »

సాగులో సాంకేతికత పెంచాలి

ఏఐ, రోబోటిక్‍ టెక్నాలజీలను విరివిగా వాడాలిదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయమే వెన్నెముక: రాష్ట్ర గవర్నర్‍ జిష్ణుదేవ్‍ వర్మఉద్యాన పంటల సాగు పెరగాలి: మంత్రి తుమ్మల దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక లాంటిదని రాష్ట్ర గవర్నర్‍ జిష్ణుదేవ్‍ వర్మ అన్నారు. వ్యవసాయ విద్య, పరిశోధనల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ప్రొఫెసర్‍ జయశంకర్‍ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. రైతులకు మరింత చేరువయ్యేలా సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రెండు రోజులపాటు జరగనున్న వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాలను చాన్స్లర్‍ …

సాగులో సాంకేతికత పెంచాలి Read More »

అండు కొర్రలు – ఆరోగ్య ప్రయోజనాలు

అండు కొర్రలను ఇంగ్లీష్‍లో brown top millets అని అంటారు. ఇవి సంప్రదాయ వంటలో ఒకటి. చిరుధాన్యాలు ఏవైనా కానీ కనీసం 5 నుండి 6 గంటల వరుకు నానబెట్టిన తరువాతనే వాడుకోవడం మంచిది. అండు కొర్రలు మన ఆహారంలో చేరే ఒక విలువైన ధాన్యం. ఇది ఆరోగ్యానికి మంచిది మరియు పర్యావరణానికి కూడా అనుకూలం. వంటకాల్లో దీన్ని ఉపయోగించడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇవి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. …

అండు కొర్రలు – ఆరోగ్య ప్రయోజనాలు Read More »

వనపర్తి శ్రీరంగం

తమిళనాడులోని శ్రీరంగం రంగనాయకుడిని వనపర్తి సంస్థానాధీశులు ఇంటి దైవంగా కొలుస్తూ పూజించేవారు. తమ సంస్థానంలోని కొర్విపాడు (పెబ్బేరు మండలం శ్రీరంగాపురం) గ్రామంలోని రంగసముద్రం చెరువు ఒడ్డున ఉన్న గరుడకొండపై శ్రీరంగాన్ని పోలిన రంగనాథస్వామి ఆలయాన్ని 345 ఏళ్ల క్రితం అప్పటి సంస్థానాధీశుడు గోపాలరావు నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది. అనంతరం కొర్విపాడు పేరును శ్రీరంగాపురంగా మార్చారు.ద్వీపకల్పంగా దర్శనమిచ్చే ఈ దేవాలయానికి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉంది. పురాతన ఆలయాల మాదిరిగా నేలమాలిగలను సైతం నిర్మించి.. అందులో పురాతనమైన తంజావూరు …

వనపర్తి శ్రీరంగం Read More »

నెమ్మదించిన భూ మండల వేగం

భూమి ఉపరితలం నుంచి కిందకు వెళ్లే కొద్దీ సగటున ప్రతి 32 మీటర్లకు 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంటే, భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత 13 డిగ్రీలు ఉంటే.. భూ కేంద్రం వద్ద ఏకంగా 6 వేల డిగ్రీలు ఉంటుంది. అంటే, ఇది సూర్యుడి ఉపరితలం వద్ద ఉష్ణోగ్రతకు సమానం. భూమిపైకి ప్రవహించే లావా, గీజర్ల ఆధారంగా లోపలి ఉండే ఉష్ణోగ్రతను అంచనా వేశారు. అయితే, కొన్నాళ్లుగా భూ కేంద్ర మండలం వేగం నెమ్మదించింది. భూమి కూర్పు …

నెమ్మదించిన భూ మండల వేగం Read More »